మోటో గుజ్జి గ్రిసో 1200 8వి స్పోర్ట్స్ బైక్‌కు బుకింగ్స్ ఓపెన్

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ కంపెనీ పియాజ్జియోకు చెందిన ప్రీమియం మోటార్‍‌సైకిల్ బ్రాండ్ 'మోటో గుజ్జి' (Moto Guzzi) ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ముస్తాబవుతుంది. గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో పియాజ్జియో ఆవిష్కరించిన మోటో గుజ్జి టూవీలర్ బ్రాండ్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే తమ ఆప్రిలియా బ్రాండ్‌‌ను దేశీయ విపణిలో అందిస్తున్న పియోజ్జియో మోటో గుజ్జి కోసం గుర్గావ్‌లో ఓ షోరూమ్‌ను ప్రారంభించింది.

పూనేలోని ఆప్రిలియా మొదటి డీలర్‌షిప్ తర్వాత కంపెనీ గుర్గావ్‌ నార్త్‌వార్డ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా భారత్‌లో తమ రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ రెండవ ఆప్రిలియా షోరూమ్‌లో మోటో గుజ్జి మోడళ్లను ప్రదర్శనకు ఉంచేందుకు కూడా తగినంత స్థలం ఉంది. ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన ఈ షోరూమ్‌లో మోటో గుజ్జి మోటార్‌సైకిల్ కోసం అనధికారిక బుకింగ్‌లు స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఈ షోరూమ్‌కు చేరువలోనే కంపెనీ ఓ సర్వీస్ సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నారు.

ప్రారంభంలో భాగంగా, మోటో గుజ్జి తమ తొలి మోడల్ గ్రిసో 1200 (Moto Guzzi Griso 1200)ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. గుర్గావ్ షోరూమ్‌లో ప్రస్తుతం ఈ మోడల్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు. మోటో గుజ్జి గ్రిసో 1200లో శక్తివంతమైన 1151సీసీ ఫోర్-స్ట్రోక్ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 110 హార్స్ పవర్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. 2013 ఆరంభంలో మోటో గుజ్జి గ్రిసో 1200 మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

మోటో గుజ్జి గ్రిసో 1200 8వి

మోటో గుజ్జి గ్రిసో 1200 8వి

మోటో గుజ్జి గ్రిసో 1200 8వి

మోటో గుజ్జి గ్రిసో 1200 8వి

మోటో గుజ్జి గ్రిసో 1200 8వి

మోటో గుజ్జి గ్రిసో 1200 8వి

మోటో గుజ్జి గ్రిసో 1200 8వి

మోటో గుజ్జి గ్రిసో 1200 8వి

మోటో గుజ్జి గ్రిసో 1200 8వి

మోటో గుజ్జి గ్రిసో 1200 8వి

Most Read Articles

English summary
Piaggio India is planning to bring its Moto Guzzi brand motorcycles to India. Piaggio's another motorcycle brand Aprilia has opend its second Indian dealership Northward Motors Pvt Ltd in Gurgaon. This new Aprilia showroom will sell Moto Guzzi motorcycles. Dealers already accepting bookings for the Moto Guzzi Griso 1200 8V model.
Story first published: Tuesday, December 18, 2012, 16:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X