అమెరికా టైర్ కంపెనీ 'కూపర్'ను కొనుగోలు చేస్తున్న 'అపోలో'

By Ravi

ప్రముఖ దేశీయ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్, అమెరికాకు చెందిన కూపర్ టైర్ అండ్ రబ్బర్‌ని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 2.5 బిలియన్ డాలర్లు(మన దేశ కరెన్సీలో సుమారు రూ. 14,500 కోట్లు). ఈ లావాదేవీ పూర్తి నగదు రూపంలో ఉంటుందని అపోలో టైర్స్ పేర్కొంది. కూపర్‌ టైర్ కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత అపోలో టైర్స్, టైర్ల తయారీకి సంబంధించి 6.6 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచంలోనే 7వ అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది.

ప్రస్తుతం అపోలో టైర్స్ 2.5 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఈ జాబితాలో 16వ స్థానంలో ఉంది. కూపర్ సంస్థను స్వాధీనం చేసుకోవటంతో అమెరికా మార్కెట్లో అపోలో టైర్స్‌కు అవకాశాలు విరివిగా లభించనున్నాయి. అంతేకాకుండా, వర్ధమాన, సంపన్న దేశాల్లోనూ తమ నెట్‌వర్క్‌ను విస్తృత స్థాయిలో విస్తరించేందుకు ఈ ఒప్పందం తమకు ఎంతగానో సహకరిస్తుందిని అపోలో టైర్స్ చైర్మన్ ఓంకార్ ఎస్ కన్వర్ తెలిపారు. ఎస్‌యూవీ టైర్ల మార్కెట్లో కూపర్‌కు మంచి పట్టు ఉందని, ఈ బ్రాండ్‌ని భారత్‌కి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు.

Apollo Cooper

కూపర్ టైర్ల తయారీ సంస్థను 1914లో స్థాపించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలో కెల్లా 11వ అతిపెద్ద టైర్ల తయారీ కంపెనీ. దీని ఆదాయం 4 బిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, సెర్బియా, బ్రిటన్, మధ్యప్రాచ్యంలో కూపర్ టైర్ అండ్ రబ్బర్ సంస్థకు 8 ప్లాంట్లు, 14,500 మంది ఉద్యోగులు ఉన్నారు. కూపర్ ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కూపర్, మాస్టర్‌క్రాఫ్ట్, స్టార్‌ఫైర్, షెంగ్షాన్, రోడ్‌మాస్టర్, ఏవన్ బ్రాండ్ల పేరిట ఈ సంస్థ ప్రీమియం, మధ్య తరహా టైర్లను తయారుచేస్తోంది.

కూపర్‌ను టేకోవర్ చేసుకున్న తర్వాత ఈ బ్రాండ్లు అన్ని అపోలో ఆధ్వర్యంలోకి వస్తాయి. ఈ డీల్‌తో ప్రస్తుతం రోజుకి 1,500 టన్నులుగా ఉన్న టైర్ల ఉత్పత్తి సామర్ధ్యం 3,500 టన్నులకు పెరుగుతుందని సంస్థ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే డీల్ పూర్తి కాగలదని, ఆపై కూపర్‌ని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి డీలిస్ట్ చేస్తామని ఆయన వివరించారు. మన దేశీయ కంపెనీలు విదేశీ కంపెనీల కోనుగోళ్లకు సంబంధించి టాప్ టెన్ ఒప్పందాల్లో అపోలో-కూపర్ ఒప్పందం కూడా ఒకటిగా నిలిచిపోనుంది. ఈ దెబ్బతో అపోలో టైర్స్ దశ తిరగిపోవటం ఖాయమని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Indian tyre manufacturer Apollo Tyres said it will acquire US-based Cooper Tire & Rubber Company in an all-cash transaction valued at approximately Rs 14,500 crore.
Story first published: Thursday, June 13, 2013, 17:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X