హైదరాబాద్‌లో అశోక్ లేలాండ్ స్టైల్ విడుదల; త్వరలో దోస్త్ ఎక్స్‌ప్రెస్

హైదరాబాద్: హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్ తమ జపాన్ భాగస్వామి నిస్సాన్‌తో చేతులు కలిపి రూపొందించిన తమ తొలి ప్యాసింజర్ కారు 'అశోక్ లేలాండ్ స్టైల్' ఎమ్‌పివిని తాజాగా రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. రాష్ట్ర విపణిలో దీని ధరలు రూ.7.49 లక్షల నుంచి రూ.9.29 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

నిస్సాన్ ఇవాలియా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఈ కొత్త అశోక్ లేలాండ్ స్టైల్ 7-సీటర్ ఎమ్‌పి డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో నిస్సాన్ నుంచి గ్రహించిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 75 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 185 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

Ashok Leyland Stile MPV

దోస్త్ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ క్యారియర్
ఇదిలా ఉండగా, అశోక్-లేలాండ్ నిస్సాన్ సంస్థలు కలిసి రూపొందించిన తొలి చిన్న తరహా వాణిజ్య వాహనం దోస్త్ ఎల్‌సివి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, తాము తాజాగా అభివృద్ధి చేసిన ప్యాసింజర్ క్యారియర్ 'దోస్త్ ఎక్స్‌ప్రెస్'ను కూడా మరో నెల రోజుల్లో మార్కెట్లో విడుదల చేస్తామని, 13 మంది కూర్చునే వీలున్న ఈ వాహనాన్ని ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేశామని కంపెనీ తెలిపింది. దోస్త్ ఎక్స్‌ప్రెస్ ధరలు రూ.5.85 లక్షల నుంచి ప్రారంభమవుతాయని అశోక్ లేలాండ్ వివరించింది.
Most Read Articles

English summary
Hinduja Group flagship automobile firm Ashok Leyland has launched its 'Stile' MPV in Hyderabad, developed by a joint venture with Nissan Motor Company. Priced at Rs 7.49 lakh (ex-showroom, Hyderabad), the Stile is basically a rebadged version of the Nissan Evalia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X