సర్వీస్ నచ్చక మాసేరటి కారును చిత్తు చేసిన యజమాని

కోట్ల విలువ చేసే కారును కొనుగోలుదారులకు విక్రయించినప్పుడు, వారికి అంతే విలువైన సర్వీసులను అందించడం కూడా ఎంతో అవసరం. లేకపోతే ఇదిగో ఇలానే జరుగుతుంగి. చైనాలోని ఓ సంపన్నుడు 4.2 లక్షల డాలర్ల విలువైన (మన దేశ కరెన్సీలో సుమారు రూ.2.30 కోట్లు) మాసేరటి క్వాట్రోపోర్టే లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. అయితే, సదరు సంస్థ అందిస్తున్న ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌తో విసుగు చెందిన సదరు కారు యజమాని, నలుగురు వెల్డింగ్ చేసే వర్కర్లకు డబ్బులిచ్చి తన కారును పచ్చడి చేయించాడు.

చైనాకు చెందిన వాంగ్ ఈ కారును 2011లో 2.6 మిలియన్ యువాన్‌లు చెల్లించి కొనుగోలు చేశాడు. ఈ మొత్తం చైనాలోని పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న సగటి వ్యక్తి ఆదాయంతో పోల్చుకుంటే 100 రెట్లు ఉంటుంది. కొన్న కొత్తలోనే ఈ కారులో సమస్యలు తలెత్తడంతో డీలర్ వద్దకు తీసుకువెళ్లగా స్పేర్ట్ పార్ట్‌ల కోసం సదరు డీలర్‌షిప్ సిబ్బంది డబ్బులు వసూలు చేశారట. అప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకపోగా కారు డోర్‌కు స్క్రాచ్‌లు పడ్డాయట. దీంతో విసుగు చెందిన సదరు కారు యజమాని చైనాలోని క్వింగ్‌డావ్‌లో ప్రారంభం కానున్న ఓ ఆటో షో వేదిక ముందు భాగంలో ఈ కారును ఇలా చిత్తు చిత్తు చేయించాడు.

మాసేరటి బ్రాండ్ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఓ ఎర్రటి బ్యానర్‌ను నుజ్జు నుజ్జయిన కారు చుట్టి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు వాంగ్. గతంలో కూడా ఓ లాంబోర్గినీ కారు యజమాని ఇదే తరహాలో తన కారును సుత్తులతో చితకబాదించ వార్తల్లోకెక్కిన సంగతి తెలిసినదే.

మాసేరటి చిత్తు చిత్తు

మాసేరటి చిత్తు చిత్తు

మాసేరటి చిత్తు చిత్తు

మాసేరటి చిత్తు చిత్తు

మాసేరటి చిత్తు చిత్తు

మాసేరటి చిత్తు చిత్తు

మాసేరటి చిత్తు చిత్తు

మాసేరటి చిత్తు చిత్తు

మాసేరటి క్వాట్రోపోర్టే

మాసేరటి క్వాట్రోపోర్టే

మాసేరటి క్వాట్రోపోర్టే

మాసేరటి క్వాట్రోపోర్టే

లాంబోర్గినీ చిత్తు చిత్తు

లాంబోర్గినీ చిత్తు చిత్తు

గతంలో చైనాలోని ఓ ధనవంతుడు తాను కొనుగోలు చేసిన లాంబోర్గినీ కారు సర్వీస్ పట్ల విసుగు చెంది కూలీల చేత కారును పచ్చడి చేయించాడు.

లాంబోర్గినీ చిత్తు చిత్తు

లాంబోర్గినీ చిత్తు చిత్తు

గతంలో చైనాలోని ఓ ధనవంతుడు తాను కొనుగోలు చేసిన లాంబోర్గినీ కారు సర్వీస్ పట్ల విసుగు చెంది కూలీల చేత కారును పచ్చడి చేయించాడు.

Most Read Articles

English summary
According to news reports, a wealthy Chinese Maserati Quattroporte owner hired four sledgehammer-wielding men to smash up his USD 420,000 supercar in protest at poor customer service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X