ఆంధ్రాకు జాక్‌పాట్; ఏపిలో ఇసుజు కార్ ప్లాంట్

Posted By:

జపాన్‌కు చెందిన ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ 'ఇసుజు మోటార్స్' (Isuzu Motors) ఆంధ్రప్రదేశ్‌పై కన్నేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో ఓ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంటును ఏర్పాటు చేయాలని ఇసుజు యోచిస్తోంది. ప్రారంభంలో ఈ ప్లాంటు కోసం కంపెనీ రు.1,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటనను ఇసుజు మార్చి 15న హైదరాబాద్‌లో ప్రకటించే ఆస్కారం ఉంది.

ఇసుజు మోటార్స్ ఏర్పాటు చేయనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌లో ఆరంభంలో భాగంగా, ఏటా 50,000 వాహనాలను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ 2015 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి దశకు చేరుకోవచ్చని అంచనా. అప్పటి వరకూ ఇసుజు మోటార్స్ తాత్కాలిక ప్రత్యమ్నాయంగా చెన్నైలోని తిరువళ్లూర్‌లో ఉన్న హిందుస్థాన్ మోటార్స్, జనరల్ మోటార్స్ కార్ ప్లాంట్‌లను ఉపయోగించుకోనుంది.

శ్రీ సిటీలో ఇసుజు ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో తొలుత 'ఎమ్‌యూ7 చాయిజ్' (MU7 Choiz) అనే ఎస్‌యూవీని మరియు 'వి క్రాస్' పికప్‌లను ఉత్పత్తి చేయవచ్చని సమాచారం. ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్‌లో శక్తివంతమైన 3.0 లీటర్ ఇంజన్‌ను, వి క్రాస్ పికప్‌లో 2.5 లీటర్ ఇంజన్‌లను ఉపయోగించనున్నారు. శక్తివంతమైన ఇంజన్‌లను, ఎస్‌యూవీలను తయారు చేయటంలో ఇసుజు పెట్టింది పేరు. చెన్నై సరిహద్దుల్లో శ్రీ సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయటం ఇసుజుకి అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది.

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు వి క్రాస్

ఇసుజు వి క్రాస్

ఇసుజు వి క్రాస్

ఇసుజు వి క్రాస్

ఇసుజు వి క్రాస్

ఇసుజు వి క్రాస్

ఇసుజు వి క్రాస్

ఇసుజు వి క్రాస్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

ఇసుజు ఎమ్‌యూ7 చాయిజ్

డీజిల్ టెక్నాలజీలో ఇసుజు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును కలిగి ఉంది. ఇసుజు గ్లోబల్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో హెవీ, మీడియం, లైట్ డ్యూటీ ట్రక్కులతో పాటుగా, ప్యాసింజర్ బస్సులు, విలాసవంతమైన బస్సులు, యుటిలిటీ వాహనాలు, ప్యాసింజర్ వాహనాల ఇంజన్లు మరియు పరిశ్రమల్లో ఉపయోగించే డీజిల్ ఇంజన్లు ప్రధానంగా చెప్పుకోదగినవి. ఇసుజు తమ 'ప్యాంథర్' ఎమ్‌యూవీని జనరల్ మోటార్స్‌కు ఆఫర్ చేయగా, జనరల్ మోటార్స్ దానిని చెవర్లే తవేరా అనే పేరుతో ఇండియన్ మార్కెట్లో అందిస్తోంది. అలాగే హిందూస్థాన్ మోటార్స్ అందిస్తున్న అంబాసిడర్, కాంటెస్సా మోడళ్లలో కూడా ఇసుజు ఇంజన్లను ఉపయోగించారు.

English summary
Japanese utility vehicle maker Isuzu Motors has firmed up its India plans with a manufacturing plant in Sri City, Andhra Pradesh. Isuzu will invest nearly Rs 1,000 crore in the greenfield plant that can make nearly 50,000 vehicles a year.
Please Wait while comments are loading...

Latest Photos