డిసి స్టయిల్ సూపర్ లగ్జరీ బస్సును విడుదల చేసిన స్కానియా

Written By:

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో స్వీడన్‌కు చెందిన ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ 'స్కానియా' భారత బస్ అండ్ కోచ్ సెగ్మెంట్లోకి ప్రవేశించి, తమ సరికొత్త 'మెట్రోలింక్' రేంజ్ లగ్జరీ బస్సులను దేశీయ విపణిలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు గాను, ప్రముఖ ఆటోమొబైల్ డిజైన్ దిగ్గజం 'డిసి డిజైన్స్'తో కలిసి అభివృద్ధి ఆల్ట్రా లగ్జరీ బస్సును స్కానియా విడుదల చేసింది.

స్కానియా మెట్రోలింక్ బస్సు ఇంటీరియర్లను డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసింది. ఈ తొలి లగ్జరీ బస్సును సూరత్‌కు చెందిన సిద్ధి వినాయక లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎస్‌విఎల్ఎల్) డెలివరీ తీసుకోనుంది. ఈ బస్సును బెంగుళూరుకు సమీపంలో ఉన్న స్కానియా ఫ్యాక్టరీలో అసెంబ్లింగ్ చేయనున్నారు. ఈ 7-స్టార్ స్కానియా సూపర్ లగ్జరీ ఇంటర్‌సిటీ కోచ్‌ను కార్పోరేట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారు.

ఈ ఆల్ట్రా సూపర్ లగ్జరీ బస్సుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

స్కానియా బస్సుకు డిసి లగ్జరీ టచ్

ఆటోమోటివ్ కస్టమైజేషన్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిసి డిజైన్స్, స్కానియా మెట్రో లింక్ బస్సు ఇంటీరియర్లను డిజైన్ చేసింది.

స్కానియా బస్సుకు డిసి లగ్జరీ టచ్

ఈ లగ్జరీ బస్సులో ప్రీమియం ఇంటీరియర్లే కాకుండా, స్పా, టాయిలెట్, రిఫ్రెష్‌మెంట్ బార్, ఆన్-ద-గో డైనింగ్, యూఎస్‌బి కనెక్టివిటీతో కూడిన పర్సనల్ ఎల్‌సిడి స్క్రీన్స్, సెన్‌హీసర్ హెడ్‌ఫోన్స్ వంటి అనేక ఫీచర్లను ఆఫర్ చేయనున్నారు.

స్కానియా బస్సుకు డిసి లగ్జరీ టచ్

మాడ్యూల్స్ అండ్ మాడ్యులర్ బాడీవర్క్ ఛాస్సిస్ సిస్టమ్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన రెగ్యులర్ మెట్రోలింక్ బస్సులు టూ-యాక్సిల్, 3-యాక్సిల్ రూపంలో 45, 49, 53 ప్యాసింజర్ సీట్స్ కెపాసిటీతో మూడు మోడళ్లలో లభ్యమవుతున్నాయి.

స్కానియా బస్సుకు డిసి లగ్జరీ టచ్

స్కానియా అందిస్తున్న మెట్రోలింక్ హెచ్‌డి 45-సీటర్ బస్సు 12 మీటర్ల పొడవును కలిగి ఉండి 2+2 సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో 9-లీటర్, 314పిఎస్, యూరో3 ఇంజన్‌ను అమర్చారు. ఈ బస్సుకు తరచూ గేర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

స్కానియా బస్సుకు డిసి లగ్జరీ టచ్

మెట్రోలింక్ హెచ్‌డి 49-సీటర్ బస్సు 13.7 మీటర్ల పొడవును కలిగి ఉండి 49 సెమీ-స్లీపర్ సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో పవర్‌ఫుల్ 13-లీటర్, 365 పిఎస్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్‌ను స్కానియా ఆప్టిక్రూయిజ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‍‌తో జతచేయబడి ఉంటుంది.

స్కానియా బస్సుకు డిసి లగ్జరీ టచ్

మెట్రోలింక్ హెచ్‌డి 45-సీటర్ బస్సు 14.5 మీటర్ల పొడవును కలిగి ఉండి, 53 సెమీ-స్లీపర్ సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో 8-లీటర్ 416 పిఎస్ ఇంజన్‌ను అమర్చారు. ఇది కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

English summary
Swedish commercial vehicle manufacturer, Scania has officially launched their first Scania Super Luxury Intercity Coach in India. The bus’ interiors are designed by DC Design.
Story first published: Tuesday, September 24, 2013, 12:41 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark