శ్రీలంకలో టాటా ఏస్ ఈఎక్స్2 ఎల్‌సివి విడుదల

Written By:

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ కొత్త 'టాటా ఏస్ ఈఎక్స్' (Tata ACE EX2) లైట్ వెయిట్ కమర్షియల్ వెహికల్‌ను పొరుగు దేశమైన శ్రీలంక మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్‌తో స్టయిలిష్‌గా టాటా ఏస్ ఈఎక్స్ ఎల్‌సివిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం శ్రీలంకో టాటా మోటార్స్ అందిస్తున్న టాటా ఏస్ రేంజ్ వాహనాలకు కాంప్లిమెంట్‌‌గా టాటా ఏస్ ఈఎక్స్2ను విడుదల చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

టాటా ఏస్ ఈఎక్స్2 ఎల్‌సివిని పాపులర్ ఏస్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. అయితే, రెగ్యులర్ ఏస్ కన్నా విభిన్నమైన డిజైన్‌తో స్టయిలిష్‌గా ఉంటుంది. ఇందులోని ఇంటీరియర్స్‌ వలన ఓ కారును నడుపుతున్న ఫీల్ లభిస్తుంది. పెర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఇందులో పవర్‌ఫుల్ 700సీసీ ఇంజన్‌‌, 13 ఇంచ్ టైర్స్, కొత్త లో-ఎఫర్ట్ స్టీరింగ్ సిస్టమ్ (స్టీర్ చేయటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు)తో సాటిలేని పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

అధిక మైలేజ్, తక్కువ మెయింటినెన్స్ కలిగిన టాటా ఏస్ ఈఎక్స్ ధరకు తగిన విలువను కలిగి ఉండి, డ్రైవర్లు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని కంపెనీ పేర్కొంది. సేఫ్టీ విషయంలో కూడా ఏస్ ఈఎక్స్2 భేషుగ్గా ఉంటుంది. దీని బాడీని హై స్ట్రెన్త్‌తో రూపొందించారు. ఫలితంగా ముందువైపు, రూఫ్ భాగంలో ఇది చాలా ధృఢంగా ఉంటుంది. టాటా ఏస్ ఈఎక్స్2 ఎల్‌సివి 60,000 కిలోమీటర్లు లేదా 24 నెలల వారంటీతో లభిస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Tata ACE EX2
English summary
Tata Motors today launched the new Tata ACE EX2, in Sri Lanka. The new Tata ACE EX2 is styled to thrill, with completely new exteriors & interiors. The new Tata ACE EX2 will compliment Tata Motors existing range of Tata ACE vehicles in Sri Lanka.
Story first published: Thursday, August 8, 2013, 13:28 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark