భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్న అశోక్ లేలాండ్

By Ravi

హిందూజా గ్రూపుకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం అశోక్ లేలాండ్, యూకేలో విజవంతంగా నిర్వహిస్తున్న ఆప్టేర్ బస్సులకు ఎలక్ట్రిక్ వెర్షన్లను ఇండియాలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె. దాసరి తెలిపారు.

యూకేకి చెందిన ఆప్టేర్ పిఎల్‌సిలో అశోక్ లేలాండ్‌కు మెజారీ వాటా ఉంది. యూకే ప్రభుత్వం తమ గ్రీన్ ఫండ్ స్కీమ్స్‌తో అప్టేర్‌కు ఎంతగానో సహకరించిందని, ఫలితంగా ఆప్టేర్ సరికొత్త టెక్నాలజీని సృష్టించి ఇప్పుడు ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ బస్సుల తయారీలో ప్రపంచంలో కెల్లా అగ్రగామి కంపెనీలలో ఒకటిగా నిలిచిందని ఆయన అన్నారు.

Ashok Leyland To Make Electric Buses In India

ఆప్టేర్ ఎలక్ట్రిక్ బస్సులను 2015 నుంచి భారత్‌లో తయారు చేయడం ప్రారంభిస్తామని, ఢిల్లీల్లో వచ్చే ఏడాది జనవరి 22న జరిగే బస్ ఎక్స్‌పోలో వీటిని ప్రదర్శనకు ఉంచుతామని వినోద్ తెలిపారి. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఫుల్‌గా చార్జ్ చేస్తే, వీటిపై 200 కి.మీ. దూరం వరకు ప్రయాణించవచ్చని, ఒక్కో బస్సు ఖరీదు సుమారు రూ.2-3 కోట్లు ఉంటుందని ఆయన వివరించారు.

భారత మార్కెట్లో ఆప్టేర్ ఎలక్ట్రిక్ బస్సులను అశోక్ లేలాండ్ బ్యాడ్జ్‌తోనే విక్రయిస్తామని, ప్రారంభ దశలో భాగంగా ఆప్టేర్‌ సోలో, వెర్సా మెడళ్లను భారత్‌లో తయారు చేస్తామని, ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వాల కోసమే వీటిని తయారు చేస్తామని వినోద్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులలో కేవలం మోటార్లు, బ్యాటరీలు మాత్రమే ఉంటాయని, అయితే హైబ్రిడ్ బస్సులలో మాత్రం ఓ చిన్నపాటి డీజిల్ ఇంజన్‌తో పాటుగా ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఉంటాయని ఆయన వివరించారు.

Most Read Articles

English summary
After the successful run in the UK, Hinduja Group flagship company Ashok Leyland will introduce an electric version of Optare buses in India early next year and plans to make them here, a top official said.
Story first published: Thursday, October 16, 2014, 15:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X