హైదరాబాద్‌లో అశోక్ లేలాండ్ పార్ట్‌నర్ ఎల్‌సివి విడుదల

By Ravi

హైదరాబాద్: ప్రముఖ దేశీయ వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ అశోక్‌ లేలాండ్‌ మరియు జపనీస్ కార్‌మేకర్ నిస్సాన్‌‌లు సంయుక్తంగా రూపొందించిన మరో సరికొత్త తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సివి) 'పార్ట్‌నర్'ను కంపెనీ రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. ఈ నెల ఆరంభంలో అశోక్ లేలాండ్ తమ పార్ట్‌నర్ ఎల్‌సివిని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది.

రాష్ట్ర మార్కెట్లో అశోక్ లేలాండ్ పార్టనర్‌ 2850 డబ్ల్యూబి ఎల్‌ఎస్‌ (పవర్‌ స్టీరింగ్‌) ధర రూ. 8.72 లక్షలు గాను మరియు ఎల్‌ఎక్స్‌ (పవర్‌స్టీరింగ్‌, హెచ్‌వీఏసీ) ధర రూ.8.99 లక్షలు గాను ఉంది. అలాగే పార్టనర్‌ 3350 డబ్ల్యూబి ఎల్‌ఎస్‌ (పవర్‌ స్టీరింగ్‌) ధర రూ. 8.99 లక్షలు గాను మరియు ఎల్‌ఎక్స్‌ (పవర్‌స్టీరింగ్‌, హెచ్‌వీఏసీ) ధర రూ. 9.29 లక్షలు గాను నిర్ణయించారు. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

Ashok Leyland Partner

అశోక్ లేలాండ్ పార్ట్‌నర్ మినీ ట్రక్కును ప్రపంచ స్థాయిలో ప్రమాణాలతో రూపొందించామని, దీని యూరోపియన్ స్టైల్ క్యాబిన్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ క్యాబిన్‌లో ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) లెవల్స్ తక్కువగా ఉంటాయని, మోడ్రన్ ఇంటీరియర్స్, డ్రైవర్ యుటిలిటీ స్పేస్‌లు ఇందులో ప్రత్యేకంగా ఉంటాయని కంపెనీ వివరించింది.

రవాణా రంగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా, వాహనాన్ని నడిపే డ్రైవర్‌కు ఎటువంటి పరిస్థితులలోనైనా ఎలాంటి ఆపదా రాకుండా ఉండేలా దీని క్యాబిన్‌ రూపొందించినట్ల సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నితిన్‌ సేథ్‌ తెలిపారు. భవిష్యత్తులో అశోకాలేలాండ్‌, నిస్సాన్‌ జెవి సంస్థలు సంయుక్తంగా మరిన్ని వాహనాలను రూపొందించనుందని, రవాణా వాహనాల తయారీలో అశోకాలేలాండ్‌కు ఉన్న డిమాండ్‌ ను దృష్టిలోపెట్టుకొని మరిన్ని రవాణా వాహనాలు రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Most Read Articles

English summary
Ashok Leyland has launched its Partner mini truck in Hyderabad, expanding its LCV range and plugging the gap in the 3.5-7 tonne LCV segment that sits above the Dost LCV. The Partner is price starts at Rs 8.72 lakh (ex-showroom Hyderabad).
Story first published: Thursday, February 20, 2014, 16:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X