భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ బస్సుల తయారీ ప్లాంట్

Written By:

తరచూ ప్రమాదాలకు గురవుతున్న వోల్వో బస్సులో ప్రయాణించేలాంటే భయమేస్తోందా..? మరి మెర్సిడెస్ బెంజ్ బస్సులో ప్రయాణించడం మీకిష్టమేనా..? త్వరలోనే వోల్వో బస్సుల స్థానాన్ని బెంజ్ బస్సులు భర్తీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇకపై మెర్సిడెస్ బెంజ్ బస్సులు ఇండియాలో ఉత్పత్తి కానున్నాయి కాబట్టి.

డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిఐసివి) చెన్నైకి సమీపంలో ఉన్న ఓరగండం వద్ద ఓ బస్సు తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ దశలో భాగంగానే, గురువారం నాడు భూమిపూజ ప్రారంభించి, ప్లాంట్ నిర్మా పనులను మొదలు పెట్టారు. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటును నిర్మించనున్నారు.

మెర్సిడెస్ బెంజ్ మరియు భారత్ బెంజ్ బ్రాండెడ్ బస్సులను తయారు చేసేందుకు ఈ ప్లాంటును వినియోగించనున్నారు. వచ్చే ఏడాది (2015) మధ్య భాగం నాటికి ఈ ప్లాంటు నిర్మాణం పూర్తవుతుందని అంచనా. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే, ప్రపంచంలో కెల్లా ఒకే చోట మూడు బ్రాండ్ల ట్రక్కులు, బస్సులను నిర్మిస్తున్న ఏకైక డైమ్లర్ ట్రక్ ప్లాంట్‌గా ఈ ఓరగడం ప్లాంట్ నిలువనుంది.

ఈ బస్సు ప్రాజెక్టు కోసం డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిఐసివి) రూ.425 కోట్ల పెట్టుబడులను వెచ్చించింది. ప్రారంభ దశలో భాగంగా ఈ ప్లాంటులో సాలీనా 1500 యూనిట్లను ఉత్పత్తి చేయనున్నారు. ఆ తర్వాత ఈ సామర్థ్యాన్ని సాలీనా 4000 యూనిట్లకు పెంచనున్నారు.

English summary
Daimler India Commercial Vehicles Pvt. Ltd. (DICV) today celebrated the foundation stone laying ceremony of its new Bus plant at the its manufacturing facility located in Oragadam, near Chennai.
Story first published: Friday, March 7, 2014, 12:22 [IST]
Please Wait while comments are loading...

Latest Photos