బ్రెజిల్‌లో కొత్త ఫోర్డ్ ఫిగో విడుదల, 2015లో ఇండియా లాంచ్

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ ఇటీవలి కాలంలో పలు ఆటోమొబైల్ ప్రదర్శనలలో ఫోర్డ్ కా (Ford KA) పేరిట తమ సరికొత్త హ్యాచ్‌బ్యాక్ (ఫిగోకి రీప్లేస్డ్ వెర్షన్)ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఇందులో ప్రొడక్షన్ వెర్షన్ ఫోర్డ్ కా (నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఫిగో) మోడల్‌ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: ఆగస్ట్ 5న ఫియట్ పుంటో ఇవో విడుదల

బ్రెజిల్ మార్కెట్లో ఈ నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఫిగో (ఫోర్డ్ కా) రెండు వెర్షన్లలో లభ్యం కానుంది. అవి ఎస్ఈ, ఎస్ఈఎల్. మన కరెన్సీతో పోల్చుకుంటే, బ్రెజిల్ మార్కెట్లో ఫోర్డ్ కా ఎస్ఈ ధర సుమారు రూ.9.52 లక్షలు గాను, ఫోర్డ్ కా ఎస్ఈఎల్ ధర రూ.10.76 లక్షలు గాను ఉన్నాయి. భారత మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న ఫిగో స్థానంలో ఫోర్డ్ ఇండియా ఈ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనుంది.


ఈ నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఫిగో భారత్‌కు రావటని మరికొంత సమయం పట్టనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది భారత్‌లో విడుదల కావచ్చని అంచనా. బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసిన ఫోర్డ్ కా హ్యాచ్‌బ్యాక్‌లో 1.0 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పిల శక్తిని, 107 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
Ford KA Brzil

కాగా.. ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్న కొత్త ఫోర్డ్ ఫిగోలో కేవలం కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఉండబోవని తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఫోర్డ్ ప్రదర్శించిన ఫిగో కాన్సెప్ట్ మాదిరిగానే కొత్త ఫిగో డిజైన్ కూడా ఉంటుంది. క్రోమ్ గార్నిషన్, రీడిజైన్డ్ ప్రొఫైల్స్‌తో ఇది లభ్యం కానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

ఈ వీడియో చూశారా..
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/0gGPROkwZnQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

Read in English: Ford Launches Its New Figo!
English summary
Ford had earlier in the year revealed their plans of launching a refreshed version of its Figo hatchback. It has now been confirmed, Ford has launched the new and refreshed version of the Figo in Brazil. The American manufacturer calls the hatchback the KA in Brazil and is available in two options SE and SEL. &#13;
Story first published: Wednesday, July 30, 2014, 15:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X