వేలానికి జేమ్స్ బాండ్ చివరి లోటస్ ఈస్పిరిట్ సబ్‌మెరైన్ కారు

By Ravi

గూఢచారి జేమ్స్ బాండ్ చిత్రాల్లో కార్లకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ చిత్రాల్లోని నమ్మసక్యం కాని రీతిలో చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటాయి. డ్రైవర్ సాయం లేకుండానే నడవటం, బాంబులు, మిసైళ్లు, తుపాకులను కలిగి ఉండటం, సడెన్‌గా మాయమైపోవటం, నీటిలో చేపలా ఈదుకుంటూ వెళ్లిపోవటం ఇలాంటి విచిత్రమైన పనులెన్నో చేస్తుంటాయి ఈ కార్లు.

ప్రత్యేకించి 1977వ సంవత్సరంలో విడుదలైన జేమ్స్ బాండ్ చిత్రం 'ది స్పై హూ లవ్డ్ మి'లో ఉపయోగించిన 'లోటస్ ఈస్పిరిట్' (Lotus Espirit) సబ్‌మెరైన్ కారు అప్పట్లో మంచి పాపులారిటీని దక్కించుకుంది. నేలపైనే కాకుండా నీటి లోపల కూడా దూసుకుపోవటం ఈ కారు ప్రత్యేకత. ప్రస్తుతం ఈ లోటస్ ఈస్పిరిట్ సిరీస్ వేలానికి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఈబేలో ఇది లిస్ట్ అయ్యింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

వేలానికి బాండ్ సబ్‌మెరైన్ కార్

ఈ క్లాసిక్ వింటేజ్ జేమ్స్ బాండ్ లోటస్ ఈస్పిరిట్ కారును సదరు ఓనర్ ఈబేలో 10 లక్షల డాలర్లకు లిస్ట్ చేశాడు.

వేలానికి బాండ్ సబ్‌మెరైన్ కార్

ఓనర్ తెలిపిన సమాచారం ప్రకారం, మొత్తం మూడు లోటస్ సబ్‌మెరైన్ కార్లలో కెల్లా మిగిలి ఉన్నది ఇదొక్కటేనట. ఒరిజినల్‌గా మూవీలో ఉపయోగించిన ఈ కారును తిరిగి పూర్తిగా పునరుద్ధరించినట్లు లిస్టింగ్‌లో పేర్కొన్నారు.

వేలానికి బాండ్ సబ్‌మెరైన్ కార్

హిస్టరీ చానెల్‌లో వచ్చే అమెరికన్ రీస్టోరేషన్ షోలో ఈ కారును ప్రదర్శించారు. లాస్ వేగాస్‌లో ఉన్న రిక్స్ రిస్టోరేషన్ అధినేత రిక్ డేల్ ఈ కారును రీస్టోర్ చేశారు.

వేలానికి బాండ్ సబ్‌మెరైన్ కార్

ఇలాంటివి మొత్తం ఆరు కార్లను తయారు చేస్తే, ఇప్పటికి మూడు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో రెండు కార్లు ఇప్పటికే వేలంలో అమ్ముడుపోగా మిగిలిన ఒక్క కారు తాజాగా వేలానికి వచ్చింది.

వేలానికి బాండ్ సబ్‌మెరైన్ కార్

జేమ్స్ బాండ్ చిత్రం కోసం లోసట్ ఈస్పిర్ సిరీస్ 1 కారును ప్రత్యేకంగా తయారు చేశారు. దీని తయారీకి అప్పట్లో లక్ష డాలర్లు పైగా ఖర్చయింది. ఇప్పటి రేటు ప్రకారం చూసుకుంటే అది 5 లక్షల డాలర్లతో సమానం.

Most Read Articles

English summary
The 1977 Lotus Espirit submarine car from the James Bond movie 'The Spy Who Loved Me' has been listed on auction website eBay for a whopping $ 1,000,000.
Story first published: Tuesday, October 21, 2014, 17:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X