ఆర్ అండ్ డి కోసం రూ.4000 కోట్ల పెట్టుబడి: మారుతి సుజుకి

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, భవిష్యత్తులో మరిన్ని కొత్త కార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.

ఇందులో భాగంగానే.. డెవలప్‌మెంట్‌, ఆర్‌ అండ్‌ డి, మార్కెటింగ్‌ మౌలిక వసతులు తదితరాల్లో రానున్న రెండు మూడేళ్ళలో రూ.4,000 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఇంజినీరింగ్‌) సి.వి. రామన్‌ చెప్పారు.

మారుతి సుజుకి ప్యాసింజర్ కార్లలో తొలిసారిగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ని తమ సెలెరియో కారు ద్వారా భారత్‌కు పరిచయం చేసిన సంగతి తెలిసినదే. కంపెనీ ఈ టెక్నాలజీని ఆటో గేర్ షిఫ్ట్ (ఏజిఎస్) అని పిలుస్తోంది.

Maruti To Invest 4000 Crores

ఇప్పుడు ఈ ఏజిఎస్ టెక్నాలజీని కంపెనీ ఇటీవలే విడుదల చేసిన సరికొత్త 2014 ఆల్టో కె10 కారులో కూడా పరిచయం చేయటం జరిగింది. అతికొద్ది సమయంలో ఏజిఎస్ టెక్నాలజీ మంచి సక్సెస్‌ను సాధించడంతో భవిష్యత్తులో మరిన్ని ఏజిఎస్ మోడళ్లను కంపెనీ తీసుకురానుంది. ఆటో గేర్‌ షిఫ్ట్ టెక్నాలజీతో మరిన్ని మోడళ్లను విడుదల చేస్తామని రామన్‌ చెప్పారు.

ఏజిఎస్ మోడళ్ల కోసం ఉపయోగిస్తున్న గేర్‌బాక్స్‌లను మారుతి సుజుకి ఇటలీకి చెందిన మాగ్నెటీ మారెల్లీ నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే, దేశీయ విపణిలో వీటికి గిరాకీ అధికంగా ఉండటంతో, మానేసర్‌లోనే ఓ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, ఇక్కడే ఏజిఎస్ గేర్‌బాక్స్‌లను తయారు చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

Most Read Articles

English summary
India's largest automaker, Maruti Suzuki, will invest around INR 4,000 crores in the next two to three years in the company's key areas like R&D, product development and marketing infrastructure.
Story first published: Thursday, November 6, 2014, 11:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X