ఏఎమ్‌టితో రానున్న టాటా మోటార్స్ ట్రక్కులు

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎమ్‌టి) అతికొద్ది కాలంలోనే మంచి సక్సెస్‌ను సాధించడంతో, కార్ కంపెనీలు మరిన్ని ఉత్పత్తులలో ఈ టెక్నాలజీని వినియోగించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, టాటా మోటార్స్ వంటి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు, ఈ ఏఎమ్‌టి టెక్నాలజీని కేవలం ప్యాసింజర్ కార్లకే పరిమితం చేయకుండా వాణిజ్య వాహనాల్లో సైతం దీనిని వినియోగించేందుకు ప్రయత్నిస్తోంది.

భారత వాణిజ్య వాహన మార్కెట్లో టాటా మోటార్స్‌కు దాదాపు 60 శాతం మార్టెట్ వాటా ఉంది. టాటా మోటార్స్ ఇప్పటికే తమ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ ద్వారా ఈ ఏఎమ్‌టి టెక్నాలజీని పరిచయం చేసింది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఏఎమ్‌టితో కూడిన ప్రైమా, జెనాన్‌, ఆల్ట్రా ట్రక్కులను విడుదల చేయాలని భావిస్తున్నామని టాటా మోటార్స్‌ మేనేజింగ్ డైరెక్టర్ రవి పిషరోడి తెలిపారు.

ఏఎమ్‌టి టెక్నాలజీతో కూడిన వాహనాల ధరలను అందుబాటు ఉంచేందుకు గాను, ఈ సాంకేతికతను దేశీయంగానే అభివృద్ధి చేస్తున్నామని, వాణిజ్య వాహనాలలో ఏఎమ్‌టి టెక్నాలజీని వినియోగించడం వలన ఇంధన సామర్థ్యం (మైలేజ్) పెరుగుతుందని, క్లచ్‌ జీవితకాలం, డ్రైవింగ్‌ సౌలభ్యం పెరుగుతాయని కంపెనీ పేర్కొంది. ఏఎమ్‌టితో పాటుగా ఎల్‌ఎన్‌జి, డ్యూయల్‌ పవర్‌ వాహనాల అభివృద్ధిపై కంపెనీ దృష్టి సారించామని టాటా మోటార్స్ తెలిపింది.

Tata Motors Trucks Will Be Equipped With AMT
Most Read Articles

English summary
Tata Motors plans to introduce several new technologies, including the automated manual transmission (AMT), in its commercial vehicles in a bid to consolidate its position in the segment.
Story first published: Monday, November 24, 2014, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X