టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌కు 6 నెలల వెయిటింగ్ పీరియడ్

టాటా మోటార్స్ గడచిన ఆగస్ట్ నెలలో విడుదల చేసిన తమ తొలి కాంపాక్ట్ సెడాన్ 'టాటా జెస్ట్'కు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ మోడల్ అమ్మకాలు క్రమంగా జోరందుకుంటున్నాయి. గడచిన ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకూ టాటా మోటార్స్ సుమారు 10,000 యూనిట్లకు పైగా జెస్ట్ సెడాన్లను విక్రయించింది.

సరికొత్త ఇంజన్, మోడ్రన్ డిజైన్, హై-ఎండ్ ఫీచర్స్, ఏఎమ్‌టి (డీజిల్ వెర్షన్లో మాత్రమే) వంటి ఫీచర్లతో వచ్చిన టాటా జెస్ట్ కస్టమర్లను చక్కగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కలిగిన డీజిల్ వెర్షన్ కారుకు మంచి డిమాండ్ ఉంటోంది. దీంతో ఈ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది.


అలాగే, పెట్రోల్ వేరియంట్స్ టాటా జెస్ట్‌కు కూడా డిమాండ్ పెరుగుతున్నట్లు కంపెనీ పేర్కొంది. వెండర్ల నుంచి ఎదుర్కుంటున్న సరఫరా కొరత, తగినంతగా లేని ఉత్పత్తి సామర్థ్యం వలన ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోతోంది. మార్కెట్ అవసరానికి అనుగుణంగా తాము ఉత్పత్తిని చేపట్టలేకపోతున్నామని, డిమాండ్ కన్నా సప్లయ్ చాలా తక్కువగా ఉందని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం టాటా జెస్ట్ మోడల్‌లోని కొన్ని వేరియంట్లకు సుమారు 6 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ప్రత్యేకించి డీజిల్ వెర్షన్‌లో కంపెనీ ఆఫర్ చేస్తున్న టాటా జెస్ట్ ఎక్స్ఎమ్ఏ ఎఫ్-ట్రానిక్ వేరియంట్‌ అధిక వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంది.

Tata Zest 2

టాటా జెస్ట్ విషయానికి వస్తే.. పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 17.6 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.

డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుంది. ఇది లీటరుకు 23 కి.మీ. మైలేజీనిస్తుంది.

Most Read Articles

English summary
Tata Motors latest compact sedan Zest is receiving overhelming response from Indian buyers. This increased interest is also leading the waiting period of up to six months for some of its variants.
Story first published: Monday, November 17, 2014, 15:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X