2015 మధ్య భాగం నాటికి ఏరియల్ నోమ్యాడ్ విడుదల

By Ravi

బ్రిటీష్‌కు చెందిన స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఏరియెల్ మోటార్స్, గడచిన డిసెంబర్ నెలలో 'నోమ్యాడ్' (Nomad) అనే ఆఫ్-రోడర్ కాన్సెప్ట్ టీజర్ ఫొటోలను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ కారుకు సంబంధించిన రియల్-లైఫ్ ఫొటోలను విడుదల చేసింది. డర్ట్ ట్రాక్‌పై టెస్ట్ చేస్తున్న ఏరియల్ నోమ్యాడ్ ఆఫ్-రోడర్ ఫొటోలను ఏరియల్ మోటార్స్ రిలీజ్ చేసింది.

ట్రాక్ వెర్షన్ రేస్ కార్లను తయారు చేయటంలో మంచి పాపులారిటీని దక్కించుకున్న ఏరియల్ మోటార్స్, తొలిసారిగా ఆఫ్-రోడింగ్ వాహనాలపై దృష్టి సారించి ఈ నోమ్యాడ్ ఆఫ్-రోడర్‌ను డిజైన్ చేసింది. నోమ్యాడ్ ఆఫ్-రోడర్‌ను కంపెనీ విక్రయిస్తున్న అటామ్ కార్లకు మక్కీ బ్రదర్ (మురికి అన్న)గా ఏరియల్ మోటార్స్ అధినేత సిమోన్ సౌండ్రెస్ అభివర్ణించారు.

Ariel Nomad Unveiled

ఏరియల్ నోమ్యాడ్ ఒక టూ-వీల్ డ్రైవ్ వాహనం. వెడల్పాటి ఆఫ్-రోడ్ టైర్లు, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, రోల్ఓవర్ ప్రొటెక్షన్, రీఇన్‌ఫోర్స్డ్ షాషీ వంటి ఫీచర్లతో ఈ ఆఫ్-రోడ్ వాహనాన్ని తయారు చేశారు. ఈ ఏడాది మధ్య భాగం నాటికి ప్రొడక్షన్ వెర్షన్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఏరియల్ మోటార్స్ ప్రస్తుతం ఈ ప్రోటోటైప్‌ను టెస్టింగ్ చేస్తోంది. ప్రొడక్షన్ వెర్షన్ ఏరియల్ నోమ్యాడ్ ఆఫ్-రోడర్ కంపెనీ విభిన్న కస్టమైజేషన్ ఆప్షన్లను ఆఫర్ చేయవచ్చని సమాచారం. ఇక ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో హోండా నుంచి గ్రహించిన 2.4 లీటర్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Ariel Nomad Unveiled Prior To Official Launch By Mid 2015

ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ గేర్‌బాక్స్‌ను హోండా నుంచి గ్రహించినదే. ఇతర ఏరియల్ కార్ల మాదిరిగానే నోమ్యాడ్ కూడా తేలికైన వాహనం. దీని బరువు సుమారు 700 కిలోలు ఉండొచ్చని అంచనా. ఈ కారులో మెకానికల్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్‌ను స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా ఆఫర్ చేస్తున్నారు. అదనపు మొత్తం చెల్లించి మరింత హై-టెక్ సిస్టమ్స్‌ను కూడా పొందవచ్చు.
Most Read Articles

English summary
The Nomad is Ariel's off-road offering based on the Atom model. It is made more like a buggy and less of a tarmac hugging speedster. The British manufacturer has incorporated several design and structural changes to their off-road machine.
Story first published: Thursday, January 8, 2015, 16:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X