టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ సీజన్ 2 ప్రారంభం

By Ravi

ప్రముఖ దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్, గడచిన 2014 సంవత్సరంలో తొలిసారిగా భారతదేశంలో ప్రారంభించిన ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండవ సీజన్‌ను కంపెనీ నేడు (మార్చ్ 14, 2015) గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ప్రారంభించింది.

ఈ సెకండ్ సీజన్ 2015 టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను ఎఫ్ఐఏ మరియు ఎఫ్ఎమ్ఎస్‌సిఐల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ రేసులో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. అవి:
1. క్యాస్ట్రాల్ వెక్టన్
2. కమ్మిన్స్
3. టాటా టెక్నాలజీ మోటార్‌స్పోర్ట్స్
4. డీలర్ వారియర్స్
5. డీలర్ డేర్‌డెవిల్స్
6. అల్లైడ్ పార్ట్‌నర్స్

కాగా.. ఈ రెండవ సీజన్ టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి సీజన్‌లో వాడిన ట్రక్కులను కాకుండా మరింత శక్తివంతమైన రీట్యూన్డ్ ప్రైమా ట్రక్కులను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త ట్రక్కులు తేలికగా ఉండి, మంచి ఏరోడైనమిక్స్‌తో వేగంగా పరుగులు తీస్తాయని కంపెనీ తెలిపింది.

Tata T1 Prima Truck Racing Season 2 Commences Today

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు రేసులు ఉంటాయి. అందులో ఒకటి 5 ల్యాప్ స్ప్రింట్ మరొకటి 15 ల్యాప్ మెయిన్ రేస్. ఈ రెండు రేసులలో సంపాధించిన పాయింట్లను ఆధారంగా చేసుకొని తుది పాయింట్లను లెక్కించడం జరుగుతుంది. ఇలా వచ్చిన పాయింట్లలో అత్యధికంగా సాధించిన డ్రైవర్లను మరియు జట్లను అవార్డుతో సత్కరించడం జరుగుతుంది.

టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ కోసం టాటా మోటార్స్ ప్రత్యేకంగా 12 ప్రైమా బ్రాండ్ ట్రక్కులను తయారు చేసింది. వీటిని ప్రత్యేకించి రేస్‌కు అనువుగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ 12 ట్రక్కులను ఆరు జట్లకు కేటాయిస్తారు. ఒక్కొక్క జట్టులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. సేఫ్టీ మరియు పెర్ఫామెన్స్ స్టాండర్డ్స్ విషయంలో బ్రిటీష్ ట్రక్ రేసింగ్ అసోసియేషన్ (బిటిఆర్ఏ) మార్గదర్శకాల ప్రకారం, ఎమ్ఎమ్ఎస్‌సిఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అంతర్జాతీయంగా నైపుణ్యం పొందిన డ్రైవర్లు ఈ పోటీలో పాల్గొననున్నారు.

ఈ రేస్ కోసం టాటా ప్రైమా 4038.ఎస్ ట్రక్కులను ఉపయోగించనున్నారు. ఇందులోని శక్తివంతమైన 8.9 లీటర్ ఇంజన్ గరిష్టంగా 370 బిహెచ్‌పిల శక్తిని, 1550 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇదివరకటి రేస్‌లో ఈ ట్రక్కుల గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉండేది. కాగా.. ఈ సెకండ్ సీజన్ కోసం ఈ వేగాన్ని స్టాండర్డ్ రియర్ రియర్ యాక్సిల్ సాయంతో గంటకు 130 కిలోమీటర్లకు పెంచారు. ఈ రేస్‌ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యక్షంగా కవర్ చేస్తోంది. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata Motors will be entering the second season of their truck racing championship in India. The T1 Prima Truck Racing will begin on 14th of March, 2015 with qualifying and the main race will be held on 15th of March, 2015. These races will be held at Buddh International Circuit in Greater Noida.
Story first published: Saturday, March 14, 2015, 10:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X