ప్రస్తుతం 18 నగరాల్లో ఉబర్ సర్వీసులు

By Vinay

భారతదేశంలోని చాలా ముఖ్య నగరాల్లో రోజురోజుకి ప్రైవేటు ట్యాక్సీల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో రేడియో బేస్డ్ ట్యాక్సీల మొత్తానికి సమానమైన అమౌంట్‌తోనే కొన్ని ఆప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీసులు నడుస్తున్నాయి.

ఉబర్ కూడా ఆప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీసుల్లో ఒకటి. ఇది చాలా మంది కస్టమర్లను సంపాదించుకుంది. ఇప్పుడు 2015 జూలై 2 నుంచి తన సర్వీసులను దేశంలోని మరిన్ని నగరాలలో విస్తరింపచేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం ఇండియాలోని ప్రాముఖ్యమైన 18 నగరాల్లో తమ ట్యాక్సీ సర్వీసులను నడుపుతోంది. ఉబర్ 2015 జూలై 15వ తేదీ వరకు INDIA18 అనే ప్రోమో కోడ్‌తో కొత్త కస్టమర్లకు మూడు ఉచిత రైడ్‌లను అందిస్తోంది.

uber

ఉబర్ ఇండియా మరియు సబ్‍‌కాంటినెంట్ ఎక్స్‌ఫ్యాన్షన్ హెడ్ నీరజ్ సింగాల్ మాట్లాడుతూ..." 7 కొత్త నగరాల్లో మా సర్వీసులు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్‌లో ప్రయాణంలో కొత్త అధ్యయనం మొదలైంది" అని తెలిపారు.

మా నివేదికల ప్రకారం చాలా నగరాల్లో ఉబర్ సర్వీసుల కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. వారి కోసం త్వరలో మరిన్ని సర్వీసులు ప్రారంభించే యోచనలో ఉన్నాం అని ఆయన పేర్కొన్నారు.

యునైటెడ్ స్టేట్స్ తర్వాత రెండవ పెద్ద మార్కెట్ భారత్ అని ఉబర్ వెల్లడించింది. ఈ 7 కొత్త నగరాలేవనగా....భువనేశ్వర్, కొయంబత్తూర్, ఇండోర్, మైసూర్, నాగపూర్, సూరత్ మరియు విశాఖపట్నం.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

Most Read Articles

English summary
service that is steadily being adopted by many commuters. Now on 2nd of July, 2015 they expanded their services to several new cities in India.
Story first published: Monday, July 6, 2015, 9:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X