2017 సిటి సెడాన్‌కు అదనపు ఫీచర్ల జోడిస్తున్న హోండా

Written By:

హోండా మోటార్స్ ఇండియా ఇప్పటి వరకు దేశీయ ప్యాసింజర్ కార్ల విభాగంలోని దాదాపు అన్ని సెగ్మెంట్లలో కూడా తమ ఉత్పత్తులను విడుదల చేసింది. సెడాన్ సెగ్మెంట్లో హోండా కు మంచి విజయాన్ని సాధించి పెట్టిన సిటి సెడాన్‌కు ఇప్పుడు తీవ్ర పోటీ తయారైంది. మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నాలు ఇప్పుడు దీని అమ్మకాలను దోచేస్తున్నాయి. మార్కెట్లో సిటి సెడాన్ మళ్లీ పుంజుకోవడానికి హోండా మోటార్స్ నూతన ఫీచర్లను జోడించిన 2017 నాటికి మళ్లీ విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

హోండా మోటార్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 2017 సిటి సెడాన్ లో ప్రీమియమ్ క్వాలిటి కోసోం సాఫ్ట్-టచ్ డ్యాష్ బోర్డ్ ను అందిస్తున్నారు. దీని పోటీదారులతో పోల్చుకుంటే ఈ ఫీచర్ పరంగా దీనిదే పై చేయి.

2017 లో విడుదల కానున్న ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్‌ డిజైన్ పరంగా అచ్చం ప్రస్తుతం ఉన్న సిటి వేరియంట్‌నే పోలి ఉంటుంది. అయితే ముందు వైపు డిజైన్‌లోని ఫ్రంట్ గ్రిల్ మీదుగా హోండా అకార్డ్ ప్రేరిత మందమైన క్రోమ్ బ్యాండ్ కలదు, ఫాగ్ ల్యాంప్స్ ఇముడింపుతో ఉన్న సరికొత్త బంపర్ మరియు అధునాతన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌తో రానుంది.

సిటి సెడాన్ వెనుక భాగంలో మిడ్ సైజ్ సెడాన్ తరహాలో డిజైన్ చేయబడింది. సరికొత్త ఎల్ఇడి టెయిల్ లైట్ క్లస్టర్ కలదు. ఫ్రంట్ అండ్ రియర్ లో ఈ స్వల్ప మార్పులు మినహాయిస్తే ఎక్ట్సీరియర్‌ పరంగా మరే మార్పులు చోటు చేసుకోలేదు.

2017 సిటి సెడాన్‌లో చాలా మార్పులనే గుర్తించవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు మొబైల్-మిర్రర్ లను సపోర్ట్ చేసే సరికొత్త తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. టాప్ ఎండ్ వేరియంట్ సిటి లో ఆరు ఎయిర్ బ్యాగులతో పాటు సన్ రూఫ్ మరియు లెథర్ అప్‌హోల్ట్స్రే వంటివి ఉన్నాయి.

సాంకేతికంగా 2017 సిటి సెడాన్ ప్రస్తుతం ఉన్న అదే 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-విటిఇసి పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్‌లతో రానుంది.

ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విధంగా డీజల్ ఇంజన్ గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్ పరంగా ఇందులోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లకు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు కంటిన్యూయస్లి వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ఆప్షన్‌తో రానుంది.

2017 లో అదనపు ఫీచర్ల జోడింపుతో మార్కెట్లోకి విడుదల కానున్న సిటి సెడాన్ 8 నుండి 13 లక్షల మధ్య ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వేరియంట్లకు సరాసరి పోటీనివ్వనుంది.

English summary
2017 Honda City Top Of The Line Variant To Be Equipped With Additional Features
Please Wait while comments are loading...

Latest Photos