బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్-3 పెట్రోల్ వేరియంట్ విడుదల: ప్రారంభ ధర రూ. 54.90 లక్షలు

బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి తమ ఎక్స్-3 మోడల్‌ను సరికొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 54.90 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

By Anil

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా దేశీయ విపణిలోకి తమ ఎక్స్-3 స్పోర్ట్ వేరియంట్‌ను సరికొత్త పెట్రోల్ ఇంజన్‌తో విడుదల చేసింది. ఈ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్ డ్రైవ్ 28ఐ ఎక్స్‌లైన్ వేరియంట్ ధర రూ. 54.90 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. జర్మనీకి చెందిన బిఎమ్డబ్ల్యూ ఇప్పుడు తమ ఎక్స్-3 మోడల్‌ను పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది.

బిఎమ్‌బ్ల్యూ ఎక్స్-3 పెట్రోల్ వేరియంట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్ డ్రైవ్ 28ఐ 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 245బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బిఎమ్‌బ్ల్యూ ఎక్స్-3 పెట్రోల్ వేరియంట్

ఇందులోని ఇంజన్‌కు 8-స్పీడ్ స్టెప్ట్‌ట్రోనిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయబడింది. పెట్రోల్ ఇంజన్ గల ఎక్స్-3 వేరియంట్ కేవలం 6.5 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

బిఎమ్‌బ్ల్యూ ఎక్స్-3 పెట్రోల్ వేరియంట్

ఫీచర్ల పరంగా ఇందులో అత్యాధునిక ఐడ్రైవ్ టచ్ కంట్రోలర్ ఫీచర్ గల 22.3 సెం.మీల హెచ్‌డి డిస్ల్పే కలదు. పెట్రోల్ పవర్ ఎక్స్-3 వేరియంట్లో ప్రీమియమ్ హై-ఫై లౌడ్ స్పీకర్ సిస్టమ్ తో పాటు రియర్ వ్యూవ్ కెమెరా మరియు పార్కింగ్ ఫీచర్ కలవు.

బిఎమ్‌బ్ల్యూ ఎక్స్-3 పెట్రోల్ వేరియంట్

సులభతరమైన డ్రైవింగ్ సదుపాయం కోసం బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్-3 లో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ లతో పాటు బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, ఎకో ప్రో మోడ్ మరియు ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ కలదు.

బిఎమ్‌బ్ల్యూ ఎక్స్-3 పెట్రోల్ వేరియంట్

  • మారుతి నుండి మరో శుభవార్త
  • వీటి విడుదల మార్కెట్లో మరో శకానికి నాంది...!!

Most Read Articles

English summary
BMW X3 Now Available With Petrol Engine In India For Rs. 54.90 Lakh
Story first published: Thursday, December 8, 2016, 15:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X