షెవర్లే సంవత్సరాంతపు ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

Written By:

షెవర్లే ఇండియా తమ లైనప్‌లోని ఉత్పత్తుల (కార్లు మరియు ఎస్‌యువి) మీద సంవత్సరాంతపు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. కొనుగోదారులకు ప్రయోజనాలు మరియు లాభాలను చేకూర్చడానికి రిటైల్ ప్రచారాన్ని ప్రారంభించింది.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

షెవర్లే శ్రేణిలో ఉన్న క్రజ్, బీట్, సెయిల్, ఎంజాయ్ మరియు ట్రయల్‌బ్లేజర్ ఎస్‌యువిల మీద సంవత్సరాంతపు ఆఫర్లను మరియు ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపింది.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

అమెజాన్ వేదిక ద్వారా వినియోగదారులు షెవర్లే బుక్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

అమెజాన్ ద్వారా తమ ఉత్పత్తులను నవంబర్ 16, 2016 నుండి బుక్ చేసుకోవచ్చని షెవర్లే ప్రకటించింది. మరియు దేశీయంగా మొదటి సారిగా ఇ-కామర్స్ దిగ్గజంతో జట్టు కట్టింది. భవిష్యత్తులో ఇ-కామర్స్ వేదికల ద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ఆలోచనలో ఉంది.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

ప్రస్తుతం ఈ సంవత్సరాంతపు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను చెన్నై, ముంబాయ్ మరియు ఢిల్లీ నగరాలలో ప్రారంభించి. వీటి మీద వచ్చే స్పందన ఆధారంగా మరిన్ని నగరాలను విస్తరించే ఆలోచనలో సంస్థ ఉంది.

షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

సంవత్సరాంతపు ప్రచారం 45 రోజుల ప్రోగ్రాం క్రింద నవంబర్ 10, 2016 నుండి ప్రారంభమైంది, ఈ ఏడాది చివరి వరకు షెవర్లే ఉత్పత్తుల మీద కస్టమర్లు పొందే ప్రయోజనాలను వివరించనున్నారు.

 డిస్కౌంట్లు మరియు ఆఫర్ల పరంగా షెవర్లే ఉత్పత్తుల కొత్త ధరలు

డిస్కౌంట్లు మరియు ఆఫర్ల పరంగా షెవర్లే ఉత్పత్తుల కొత్త ధరలు

  • బీట్ ధర రూ. 3.99 లక్షలు + రూ. 50,000 లు వరకు ప్రయోజనాలు
  • సెయిల్ ఎన్‌బి ధర రూ. 5.76 లక్షలు + రూ. 75,000 ల వరకు ప్రయోజనాలు
  • ఎంజాయ్ ధర రూ. 5.99 లక్షలు
  • క్రజ్ ధర రూ. 13.99 లక్షలు + రూ. 1.2 లక్షల వరకు ప్రయోజనాలు
  • ట్రయల్‌బ్లేజర్ ధర రూ. 23.95 లక్షలు
షెవర్లే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

భద్రత, నాణ్యత మరియు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్న ఫీచర్లను అస్త్రాలుగా మలుచుకునే షెవర్లే ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ సంవత్సరాంతపు ఆఫర్లను కస్టమర్లకు చేరవేయనుంది షెవర్లే.

English summary
Read In Telugu: Chevrolet Begins Year-End Offers And Discounts
Story first published: Friday, November 11, 2016, 18:21 [IST]
Please Wait while comments are loading...

Latest Photos