2017 ప్రారంభం నాటికి షెవర్లే ట్రయల్ బ్లేజర్ ప్రీమియమ్ ఎస్‌యువి

Written By:

ట్రయల్ బ్లేజర్ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వర్షన్ 2017 ప్రారంభం నాటికి ఇండియన్ షోరూమ్‌లను తాకనుంది. ఇండియన్ ప్రీమియమ్ ఎస్‌యువి సెగ్మెంట్లో ఉన్న ఫార్చ్యూనర్ ఎస్‌యువిని టయోటా ఈ మధ్యనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేసింది. దీనికి పోటీగా షెవర్లే తమ ట్రయల్ బ్లేజర్ ఎస్‌యువిని మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
2017 షెవర్లే ట్రయల్ బ్లేజర్

షెవర్లే ఇండియా ఈ ఫేస్‌లిఫ్టెడ్ ట్రయల్ బ్లేజర్‌ను దేశీయంగా చట్టపరమైన ప్రమాణాలు మరియు స్పెసిఫికేషన్ల పరమైన ఆమోదం కోసం దిగుమతి చేసుకోనుంది. 2016 మార్చిలో జరిగిన బ్యాంకాక్ మోటార్ షో వేదిక మీద ఈ వేరియంట్‌ను షెవర్లే మొదటి సారిగా ప్రదర్శించింది.

2017 షెవర్లే ట్రయల్ బ్లేజర్

షెవర్లే ట్రయల్ బ్లేజర్ సాధారణంగా భారీ శరీరాకృతితో ఉంటుంది, అయితే ఈ ఫేస్‌లిఫ్టెడ్ వర్షన్ మరింత అగ్రెసివ్‌గా ఉంది. సరికొత్త ట్రయల్ బ్రేజర్ ముందు భాగంలో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ఆకర్షణీయమైన హెడ్ ల్యాంప్స్ కలవు.

2017 షెవర్లే ట్రయల్ బ్లేజర్

2017 ఫేస్‌లిఫ్ట్ షెవర్లే ట్రయల్ బ్లేజర్‌లోని ఫ్రంట్ డిజైన్‌లో ఎక్కువ గాలిని గ్రహించేందుకు పెద్ద పరిమాణంలో ఎయిర్ వెంట్‌లను కలిగి ఉన్న లార్జ్ బంపర్, స్ట్రీమ్ లైన్డ్ బానెట్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ కలవు.

2017 షెవర్లే ట్రయల్ బ్లేజర్

2017 ఫేస్‌లిఫ్ట్ షెవర్లే ట్రయల్ బ్లేజర్ అల్లాయ్ వీల్స్ మరియు లో ప్రొఫైల్ గల టైర్లతో మరింత స్పోర్టివ్‌గా అవతరించింది. ఈ ప్రీమియమ్ ఎస్‌యువి మునుపటి వేరియంట్‌తో పోల్చుకుంటే 9 ఎమ్ఎమ్ ఎక్కువ పొడవు కలదు.

2017 షెవర్లే ట్రయల్ బ్లేజర్

2017 ఫేస్‌లిఫ్ట్ షెవర్లే ట్రయల్ బ్లేజర్‌ ఇంటీరియర్ సరికొత్త ఫీచర్లను మేళవింపుతో వచ్చింది. ఇందులో సరికొత్త డ్యాష్ బోర్డ్ మీద ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే లను సపోర్ట్ చేయగల మైలింక్ తాకే తెర గల ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

2017 షెవర్లే ట్రయల్ బ్లేజర్

భద్రత పరంగా ఈ 2017 ఫేస్‌లిఫ్ట్ షెవర్లే ట్రయల్ బ్లేజర్‌ లో ఆరు ఎయిర్ బ్యాగులతో పాటు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, బ్లైండ్ వార్నింగ్ అసిస్ట్, కొల్లిషన్ వార్నింగ్, లేన్ చేంజింగ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ మరియు క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి ఆధునిక భద్రత ఫీచర్లు కూడా కలవు.

2017 షెవర్లే ట్రయల్ బ్లేజర్

2017 ఫేస్‌లిఫ్ట్ షెవర్లే ట్రయల్ బ్లేజర్‌ లో సాంకేతికంగా 2.8-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డ్యూరామ్యాక్స్ డీజల్ ఇంజన్ కలదు. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. ఈ ఇంజన్ గరిష్టంగా 200బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 షెవర్లే ట్రయల్ బ్లేజర్

ప్రస్తుతం ట్రయల్ బ్లేజర్ 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందుబాటులో లేదు అయితే 2017 ఫేస్‌లిఫ్ట్ షెవర్లే ట్రయల్ బ్లేజర్‌ విడుదల నాటికి 4-వీర్ డ్రైవ్ సిస్టమ్‌తో పరిచయమయ్యే అవకాశం ఉంది.

2017 షెవర్లే ట్రయల్ బ్లేజర్

2017 ఫేస్‌లిఫ్ట్ షెవర్లే ట్రయల్ బ్లేజర్‌ ధర ప్రస్తుతం ఉన్న సాధారణం వేరియంట్ కన్నా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. షెవర్లే ట్రయల్ బ్లేజర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 23.95 లక్షలు ఎక్స్ షోరూమ్ గా ఉంది.

 
English summary
Chevrolet Trailblazer Facelift To Be Launched In India By Early 2017
Story first published: Saturday, December 24, 2016, 17:39 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark