షెవర్లే వారి కళ్లు చెదిరే సంవత్సరాంతపు ఆఫర్లు

Written By:

అమెరికా ఆధారిత కార్ల తయారీ సంస్థ షెవర్లే ఇండియా దేశీయ మార్కెట్లో ఉన్న తమ ఉత్పత్తుల పై ప్రత్యేకమైన సంవత్సరాంతపు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది.

షెవర్లే సంవత్సరాంతపు ఆఫర్లు

సంవత్సరాంతపు ఆఫర్లకు అదనంగా షెవర్లే వారి లక్కీ ఆఫర్‌గా 100 శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశాన్ని కూడా కల్పించింది.

షెవర్లే సంవత్సరాంతపు ఆఫర్లు

ప్రస్తుతం షెవర్లే ఇండియా లైనప్‌లోని బీట్, ఎంజాయ్, క్రూజ్, ట్రయల్‌బ్లేజర్ మరియు సెయిల్ వాహనాల మీద గరిష్టంగా 1.89 లక్షల వరకు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది.

షెవర్లే సంవత్సరాంతపు ఆఫర్లు

జనరల్ మోటార్స్ ఇండియా మార్కెటింగ్ మరియు కస్టమర్ ఎక్ప్సీరియన్స్ విభాగపు వైస్ ప్రెసిడెంట్ జాక్ ఉప్పల్ మాట్లాడుతూ, భద్రత , నాణ్యత మరియు ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించే ఉత్పత్తుల మీద దృష్టి సారించినట్లు తెలిపారు. వారి కోసం దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన ఇయర్ ఎండ్ ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపాడు.

షెవర్లే సంవత్సరాంతపు ఆఫర్లు

నవంబర్‌లో ప్రకటించిన ఆఫర్లు మరియు డిస్కౌంట్లకు గాను కస్టమర్ల నుండి సానుకూల స్పందన లభించడంతో ఇప్పుడు మళ్లీ సంవత్సరాంతపు ఆఫర్లతో ముందుకొచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చాడు.

షెవర్లే సంవత్సరాంతపు ఆఫర్లు

సంవత్సరాంతపు ఆఫర్లతో షెవర్లే బీట్ ధర రూ. 3.69 లక్షలు, సెయిల్ ఎన్‌బి ధర రూ. 4.99 లక్షలు, ఎంజాయ్ ధర రూ. 5.99 లక్షలు,క్రూజ్ సెడాన్ ధర రూ. 12.95 లక్షలు, మరియు షెవర్లే ఎస్‌యువి ధర రూ. 23.95 లక్షలు ప్రారంభ ధరలతో అందుబాటులో ఉన్నాయి.

షెవర్లే సంవత్సరాంతపు ఆఫర్లు

ప్రస్తుతం షెవర్లే కారును కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని ఆయన తెలిపాడు. ప్రస్తుతం సంవత్సరాంతపు ఆఫర్లతో అందుబాటులో ఉండటం తక్కువ ధరల్లో తమ ఉత్పత్తులు లభిస్తున్నాయని ఉప్పల్ గారు స్పష్టం చేసారు.

షెవర్లే సంవత్సరాంతపు ఆఫర్లు
 
English summary
Chevrolet Offering Year-End Discounts Up To Rs 1.89 Lakh Across Its Models
Story first published: Saturday, December 17, 2016, 14:41 [IST]
Please Wait while comments are loading...

Latest Photos