ఒడిసా మార్కెట్లోకి అడుగిడిన ఐషర్ పోలారిస్ మల్టిక్స్

By Anil

ఐషర్ పొలారిస్ సంస్థ భారత దేశపు మొట్టమొదటి వ్యక్తిగత యుటిలిటి వాహనం మల్టిక్స్ ను ఒడిసా మార్కెట్లోకి విడుదల చేసింది. ఒడిసాలోని నాలుగు ఐషర్ పొలారిస్ డీలర్‌షిప్‌ల ద్వారా పియువి మల్టిక్స్ వాహనాలను కొనుగోలు చేయవచ్చు.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

ఐషర్ పొలారిస్ సంస్థ ఈ మల్టిక్స్ ను ప్రత్యేకించి వ్యక్తిగత వ్యాపారాలు నిర్విహించే వారి కోసం డిజైన్ చేసింది. చిన్న తరహా వ్యాపారులు దీనిని ఎంచుకోవచ్చు.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

ఐషర్ పొలారిస్ మల్టిక్స్‌ను ఏఎక్స్+ మరియు ఎమ్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

మల్టిక్స్ ఎమ్ఎక్స్ వేరియంట్ యొక్క ధర రూ. 3,43,000 ఎక్స్ షోరూమ్ భువనేశ్వర్‌గా ఉంది.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

ఒడిసాలోని భువనేశ్వర్, కత్తక్, సంబల్ పూర్ మరియు బెర్హంపూర్ వంటి నగరాలలో అందుబాటులో ఉంది.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

ఇండియన్ మార్కెట్లో మల్టిక్స్ వాహనం యొక్క డిమాండ్ దృష్ట్యా డీలర్ల సంఖ్యను పెంచనున్నారు. మరియు వినియోగదారులకు కోసం వివిధ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలతో చేతులు కలపనుంది.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

రెండు వరుసలలో సీటింగ్ మరియు వాహనం చివరలో 1918 లీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్ సామర్థ్యం కలదు. ఇందులో ప్రొ రైడ్ అనే వ్యక్తిగత సస్పెన్షన్ సిస్టమ్ కలదు.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

ఐషర్ పొలారిస్ మల్టిక్స్‌లో 510సీసీ సామర్థ్యం గల గ్రీవ్స్ ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ డీజల్ ఇంజన్ కలదు.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

ఐషర్ పొలారిస్ మల్టిక్స్ లోని సింగల్ సిలిండర్ డీజల్ ఇంజన్ సుమారుగా 99బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

ఇందులోని ఇంజన్‍‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. సంస్థ తెలిపిన వివరాలు ప్రకారం ఇది లీటర్‌కు 27 కిలమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

చిన్న మరియు వ్యక్తిగత వ్యాపార అవసరాల కోసం కొత్త డిజైన్ మరియు సాంకేతికతతో మల్టిక్స్‌ను రూపొందించామని ఐషర్ పొలారిస్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వణ అధికారి రాధేష్ సి వర్మ తెలిపాడు. చిన్న మరియు వ్యక్తి గత వ్యాపారాలను ప్రోత్సహించడంలో ఇవి ఎంతగానో సహకరిస్తాయని తెలిపారు.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

పొలారిస్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్, ఛోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ మరియు ఫైనాన్స్ సంస్థ (ఛోళ), పంజాబ్ మరియు సింద్ బ్యాంక్, హిందూజా లేలాండ్ ఫైనాన్స్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్ వంటి వాటితో జరిగిన ఒప్పందం ప్రకారం వాహనం మొత్తం ధరలో 90 శాతం ఋణం అందిస్తామని తెలిపారు.

ఐషర్ పొలారిస్ మల్టిక్స్

  • దీపాళికి కారు కొంటే వీటిని మాత్రమే ఎంచుకోండి, ఎందుకంటే ?
  • టైగర్ ఎడిషన్ అవతారంలో స్విఫ్ట్: మొదటి 100 మందికి మాత్రమే
  • విడుదలైన 24 గంటల్లో 1000కి పైగా బుకింగ్స్

Most Read Articles

English summary
Read In Telugu: Eicher Polaris Multix Launched In Odisha
Story first published: Thursday, October 6, 2016, 13:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X