ట్రాఫిక్‌కు చెక్ పెట్టే పోడ్ కార్లు దేశవ్యాప్తంగా మొదటిసారి గుర్గావ్‌లో

By Anil

ట్రాఫిక్‌‌ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం పోడ్ కార్లను దేశంలోని ప్రధాన నగరాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కాలుష్య రహిత మరియు తక్కువ సమయంలో మన గమ్యస్థానాన్ని చేరుకోడంలో ఈ పోడ్ కార్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

పోడ్ కార్లు గురించి మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

భారత దేశంలో చాలా రాష్ట్రాలు చాలా సార్లు పోడ్ కార్లను మేము ముందు మేము ముందు తీసుకువస్తాం అంటూ కాలం గడిపారు. అయితే చివరికి గుర్గావ్ నగరంలో ఈ ఆలోచన కార్యరూపం దాల్చనుంది.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

భారతదేశపు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఎఐ) దీనికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఫస్ట్ పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో దీనిని పూర్తి చేయనున్నారు. అందుకోసం అంతర్జాతీయంగా దీని కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నారు.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

పైలట్ ప్రాజెక్ట్ క్రింది ముందుగా 13 కిలోమీటర్లు మేర దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. గుర్గావ్ నుండి ఢిల్లీ బార్డర్ పరిధిలోని సోనా రోడ్‌లోని బాద్‌షా మోడ్ వరకు నిర్మించ తలపెట్టారు.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

ఈ ప్రదేశాల పరిధిలో వీటికి సంభందించి 16 స్టేషన్లను నిర్మిస్తున్నారు.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

మెట్రినో అనే ప్రాజెక్టు పేరుతో ప్రారంభం కానున్న దీని 13 కిలోమీటర్ల నిర్మాణానికి దాదాపుగా 850 కోట్ల రుపాయల వరకు ఖర్చు పెట్టనున్నారు.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

పోడ్ కారు వ్యవస్థ నిర్మాణానికి వినియోగించిన పెట్టుబడి మొత్తాన్ని వచ్చే 25 సంవత్సరాలలోపు రికవరీ చేయనున్నారు.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

వీటిని ఆకాశ హర్మ్యాలుగా ఉండేటటువంటి గైడ్‌వేస్ ఆధారంగా పరుగులు పెడతాయి. వీటి కదలికలకు మూలం పర్సనల్ ర్యాపిడ్ సిస్టమ్(పిఆర్‌టి)

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

ఆకాశంలో వ్రేళాడుతూ వేల్లే రూపంలో ఉన్న ఈ పోడ్ కార్లలో ఒక్క సారిగా ఐదు మంది వరకు ప్రయాణించవచ్చు. స్టేషన్ వచ్చినపుడు పోడ్ కారు ఆటోమేటిక్‌గా క్రిందకు దిగుతుంది. తరువాత పైకి వెళ్లి ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

ఇవి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

పంజాబ్ మరియు హర్యాణా రాష్ట్రాలు సంయుక్తంగా గుర్గావ్ మరియు అమృత్‌సర్‌ల మధ్య ఇటువంటి పోడ్ ట్యాక్సిలను అందుబాటులోకి తీసుకురావాలని యోచించారు. కాని ఆదిలో ఎన్నో అడ్డంకులతో ఆచరణ వెనకబడిపోయింది.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

సాదారణంగా ఒక కిలోమీటర్ మేర మెట్రో నిర్మాణానికి 250 కోట్లు, మోనో రైలు నిర్మాణం కోసం 200 కోట్లు మెట్రినో సిస్టమ్ (పోడ్ కారు) నిర్మాణం కోసం 70 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. అందుకే ఇప్పుడు పోడ్ కారు మీద ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు.

 కార్లను మరిచిపోండి, పోడ్ కార్లను ఎక్కండి: మన ఇండియాలోనే

చివరిసారిగా ప్రదాన మంత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ప్రదర్శనకు వెల్లినపుడు మస్దార్ నగరంలోని పోడ్ ఇలాంటి పోడ్ కారులో ప్రయాణించారు.

మరిన్ని కథనాలు....
  • ఖరీదైన కార్లు గల దక్షిణ భారత సినీతారలు
  • వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!
  • 100 కు పైబడి లగ్జరీ కార్లను కలిగి ఉన్న ఫేమస్ బాక్సర్

Most Read Articles

Read more on: #కారు #car
English summary
Indias First Pod Car Taxis Debut Gurgaon Soon
Story first published: Monday, March 21, 2016, 16:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X