జీప్ ఉత్పత్తుల ఆరంభం అదిరింది: ప్రారంభ ధర రూ. 93.64 లక్షలు

Written By:

అమెరికాకు చెందిన ప్రముఖ ఎస్‌యువి వాహనాల తయారీ సంస్థ జీప్ ఎప్పటి నుండో ఇండియన్ మార్కెట్లోకి తమ ఉత్పత్తులను తీసుకురావాలని చూస్తోంది. అయితే ఎట్టకేలకు నేటి రోజు (30-08-2016)న తమ ఉత్పత్తులను విడుదల చేసింది. జీప్ సంస్థ యొక్క 75 సంవత్సరాల చరిత్రలో మొట్ట మొదటి సారిగా గ్రాండ్ చిరోకీ ఎస్‌యువితో ఇండియన్ మార్కెట్లోకి అడుగులు వేసింది. జీప్ గ్రాండ్ చిరోకీ గురించి పూర్తి వివరాలు...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ధర వివరాలు

ధర వివరాలు

జీప్ వారి గ్రాండ్ చిరోకీ మూడు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి లిమిటెడ్, సమ్మిట్ మరియు ఎస్‍‌‌ఆర్‌టి.

  • జీప్ గ్రాండ్ చిరోకీ లిమిటెడ్ ధర రూ. 93,64,527 లు
  • జీప్ గ్రాండ్ చిరోకీ సమ్మిట్ ధర రూ. 1,03,39,919 లు
  • జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్‌ఆర్‌టి ధర రూ. 1,12,825 లు

    గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

లిమిటెడ్ మరియు సమ్మిట్

లిమిటెడ్ మరియు సమ్మిట్

జీప్ గ్రాండ్ చిరోకీలోని లిమిటెడ్ మరియు సమ్మిట్ రెండు వేరియంట్లు కూడా 3.0-లీటర్ సామర్థ్యం గల వి6 డీజల్ ఇంజన్‌మను కలిగి ఉన్నాయి. ఈ శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 240బిహెచ్‌పి పవర్ మరియు 570ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీలోని లిమిటెడ్ మరియు సమ్మిట్ వేరియంట్లలో ఉన్న ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు. ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ ఈ ట్రాన్స్‌మిషన్ గుండా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది. గ్రాండ్ చిరోకీలోని డీజల్ ఇంజన్ లీటర్‌కు 12.8కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

జీప్ గ్రాండ్ చిరోకీ

ఇక గ్రాండ్ చిరోకీలో అత్యంత ముఖ్యమైన ఉత్పత్తి ఎస్‌ఆర్‌టిలో అతి పెద్ద 6.4-లీటర్ సామర్థ్యం ఉన్న సూపర్ ఛార్జ్‌డ్ హెచ్‌ఇఎమ్ఐ వి8 పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది సుమారుగా 469బిహెచ్‍‌పి పవర్ మరియు 630ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జీప్ గ్రాండ్ చిరోకీ

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు, ఇది ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్‌ను నాలుగు చక్రాలకు అందజేస్తుంది. ఇందులోని హెచ్‌ఇఎమ్ఐ పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 7.5కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్‌ఆర్‌టి కేవలం 4.8 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 275 కిలోమీటర్లుగా ఉంది.

జీప్ గ్రాండ్ చిరోకీ

డిజైన్ పరంగా గ్రాండ్ చిరోకీ మీరు కోరుకున్న అన్ని అంశాల పరంగా నచ్చుతుంది. గది వంటి నిర్మాణం ఉన్న బాడీ ఇంటీరియర్ అత్యంత విశాలంగా కలదు. ముందు వైపున అందమైన ఫ్రంట్ గ్రిల్‌తో పాటు ఎక్కువ గాలిని గ్రహించే విధంగా ఉన్న అతి పెద్ద ఎయిర్ ఇంటేకర్ కలదు. ఈ గ్రిల్‌కు ఇరువైపులా ప్రొజక్టర్ హెడ్‌ల్యాంప్స్ కలవు.

జీప్ గ్రాండ్ చిరోకీ

ఈ ఎస్‌ఆర్‌టిలో ప్రక్క వైపుల 20-అంగుళాల క్రోమ్ చక్రాలను అందించింది మరియు వెనుక వైపున విభిన్న టెయిల్ ల్యాంపులను డిజైన్ చేసింది. ఇంటీరియర్‌లో తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‍‌‌ను అందించింది. మరియు డ్యాష్ బోర్డ్‌ మీద చెక్క పరికరాలతో డిజైనింగే చేశారు.

 
Read more on: #జీప్ #jeep
English summary
Jeep Grand Cherokee Rumbles Into India; Prices Start At Rs. 93.64 Lakh
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark