మూడు ఉత్పత్తులపై బుకింగ్ ప్రారంభించిన లెక్సస్

Written By:

దేశీయ విపణిలో విక్రయాలకు సిద్దమైన మూడు ఉత్పత్తుల మీద బుకింగ్స్‌ను లెక్సస్ అధికారికంగా ప్రారంభించింది. మరియు బుక్ చేసుకున్న లెక్సస్ ఉత్పత్తులను 2017 మార్చి నుండి కస్టమర్లకు డెలివరీ ఇవ్వనున్నట్లు కూడా సంస్థ స్పష్టం చేసింది. జపాన్‌కు చెందిన ఈ లగ్జరీ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ భారత దేశపు మొట్టమొదటి విక్రయ కేంద్రాన్ని ముంబాయ్‌లో అతి త్వరలో ప్రారంభించనుంది.

బుకింగ్స్ ప్రారంభించిన లెక్సస్

దేశ వ్యాప్తంగా ఒక్కొక్కటిగా ప్రారంభం కానున్న లెక్సస్ విక్రయ కేంద్రాలకు "లెక్సస్ బొటిక్" అనే పేరును పెట్టనున్నారు. ముంబాయ్‌లోని జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న శాంటాక్రజ్ లోని తాజ్ హోటల్‌ నందు మొదటి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

బుకింగ్స్ ప్రారంభించిన లెక్సస్

ప్రారంభంలో లెక్సస్ లోని ఆర్ఎక్స్450హెచ్ మరియు ఎల్ఎక్స్450డి ఎస్‌యువిలను అదే విధంగా ఇఎల్300హెచ్ సెడాన్ మోడల్‌ను ఎంచుకునే అవకాశాన్ని లెక్సస్ కల్పించింది. మూడు మోడళ్లను కూడా దిగుమతి చేసుకుని అందివ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. భవిష్యత్తులో వీటిని దేశీయంగా ఉత్పత్తి చేయనుంది.

బుకింగ్స్ ప్రారంభించిన లెక్సస్

ముంబాయ్ అనంతరం, బెంగళూరు, ఢిల్లీ మరియు గుర్గావ్‌ నగరాలలో లెక్సస్ తమ విక్రయ కేంద్రాలను ప్రారంభించనుంది. లెక్సస్ ఈ అన్ని విక్రయ కేంద్రాలను 2017 మధ్య భాగానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

బుకింగ్స్ ప్రారంభించిన లెక్సస్

2017 మలి సగంలో కొచ్చిన్, చెన్నై మరియు చంఢీఘర్ లో లెక్సస్ తమ షోరూమ్‌లను ప్రారంభించనుంది. దేశీయ మరియు అంతర్జాతీయ వాహన సమాచారాన్ని తెలుగులో పొందడానికి డ్రైవ్‌స్పార్క్ తెలుగు (/)తో కలిసి ఉండండి.

 
English summary
Lexus India Bookings Now Open, Deliveries Begin In March
Story first published: Tuesday, November 29, 2016, 12:23 [IST]
Please Wait while comments are loading...

Latest Photos