క్రాష్ పరీక్షల్లో మళ్లీ ఫెయిల్ అయిన మేడిన్ ఇండియా షెవర్లే బీట్

Written By:

దేశీయంగా ఉత్పత్తి అయ్యే షెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్‌ లాటిన్ అమెరికాలో స్పార్క్ జిటి అనే పేరుతో అందుబాటులో ఉంది. లాటిన్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఈ మేడిన్ ఇండియా బీట్ హ్యాచ్‌బ్యాక్‌ సున్నా మార్కులు సాధించింది.

షెవర్లే బీట్ క్రాష్ టెస్ట్

చిన్న పిల్లలకు మరియు పెద్దల భద్రత పరంగా ఈ బీట్‌కు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో మరో సారి జీరో స్టార్ రేటింగ్‌కే పరిమితం అయ్యింది.

షెవర్లే బీట్ క్రాష్ టెస్ట్

షెవర్లే బీట్ లేదా స్పార్క్ జిటి (క్లాసిక్) దేశీయంగా కనీస భద్రత ప్రమాణాలతో ఉత్పత్తి అవుతోంది. అయితే మెక్సికో మరియు కొలంబియాలలో ఎంతో ప్రాముఖ్యత సాధించిన ఇది లాటిన్ ఎన్‌సిఎపిని భద్రత పరంగా ఆకట్టుకోవడంలో విఫలం చెందింది.

షెవర్లే బీట్ క్రాష్ టెస్ట్

ఎయిర్ బ్యాగులు లోపం కారణంగా క్రాష్ పరీక్షల్లో జీరో స్కోర్‌ను సాధించింది. ముందు వైపున ఇంపాక్ట్ క్రాష్ పరీక్షల్లో కాస్త నిలకడాగానే ఉంది.

షెవర్లే బీట్ క్రాష్ టెస్ట్

ముందు వైపున వచ్చిన ఆశించిన ఫలితలు ప్రక్క వైపు క్రాష్ పరీక్షల్లో సాధించలేకపోయింది. అంతే కాకుండా లాటిన్ ఎన్‌సిఎపి

ఈ బీట్‌కు మూలల్లో నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో కూడా రాణించలేకపోయింది.

షెవర్లే బీట్ క్రాష్ టెస్ట్

అంతే కాకుండా చిన్న పిల్లల భద్రత కోసం ఇందులో అమర్చిన వ్యవస్థ కూడా మంచి మార్కులు సాధించలేకపోయింది.

షెవర్లే బీట్ క్రాష్ టెస్ట్

ఈ మధ్య దేశీయంగా ఉత్పత్తి అయిన రెనో క్విడ్‌కు క్రాష్ పరీక్షలు నిర్వహించగా సింగల్ స్టార్ రేటింగ్ పొందింది.

షెవర్లే బీట్ క్రాష్ టెస్ట్

హోండా వారి మొబిలియోలోని రెండు ఎయిర్ బ్యాగులు గల వేరియంట్‌కు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో మూడు స్టార్ల రేటింగ్‌ను పొందింది.

లాటిన్ ఎన్‌సిఎపి మేడిన్ ఇండియా షెవర్లే బీట్‌కు నిర్వహించిన క్రాష్ పరీక్షలకు సంభందించిన వీడియో...

  
English summary
Read In Telugu: ‘Made-in-India’ Chevrolet Beat Fails Latin NCAP Crash Test
Story first published: Thursday, September 22, 2016, 18:29 [IST]
Please Wait while comments are loading...

Latest Photos