ఆల్ న్యూ 2017 సియాజ్ ఇక పై నెక్సా షోరూమ్‌లో

Posted By:

మారుతి సుజుకి లైనప్‌లో ఉన్న సియాజ్ ప్రీమియమ్ సెడాన్‌కు అప్‌డేట్స్ నిర్వహించి 2017 మార్చి నాటికి మార్కెట్‌కు పరిచయం చేయనుంది. అయితే మారుతి వారి ప్రీమియమ్ షోరూమ్ నెక్సా నుండి ఈ సరికొత్త సియాజ్‌ను విక్రయించనున్నట్లు మారుతి స్పష్టం చేసింది. మారుతి తమ నెక్సా షోరూమ్ ద్వారా బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్-క్రాస్ ప్రీమియమ్ క్రాసోవర్‌ను అందుబాటులో ఉంచింది.

మారుతి సుజుకి 2017 సియాజ్

మార్చి 2017 నాటికి నూతన ఫీచర్లతో అప్‌డేటెడ్ వర్షన్‌గా రానున్న సియాజ్ ధర ను ప్రస్తుత ధర కన్నా ఎక్కువగా ఉండేట్లు నిర్ణయించనుంది మారుతి. తద్వారా ఈ మోడల్‌ను నెక్సా నుండి విక్రయించడానికి మారుతి సిద్దం అవుతోంది.

మారుతి సుజుకి 2017 సియాజ్

భవిష్యత్తులో మరిన్ని ప్రీమియమ్ వేరియంట్లను దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనున్న మారుతి, వాటన్నింటిని నెక్సా గూటికి చేర్చనుంది.

మారుతి సుజుకి 2017 సియాజ్

ప్రస్తుతం అప్‌డేటెడ్ వర్షన్‌లో రానున్న సియాజ్ డిజైన్ పరంగా స్వల్పంగా గురవుతోంది. అయితే సాంకేతికంగా ఏ విధంమైన మార్పులు చోటు చేసుకోవడం లేదు. స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి ఆప్షన్‌తో పాటు అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో రానుంది.

మారుతి సుజుకి 2017 సియాజ్

2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి అతి ముఖ్యమైన ఉత్పత్తులను విడుదల చేయనుంది. అందులో సరికొత్త 2017 సియాజ్ సెడాన్, ఇగ్నిస్ మిని ఎస్‌యువి మరియు బాలెనొ ఆర్ఎస్ హ్యాచ్‌బ్యాక్ లతో పాటు అప్‌డేటెడ్ స్విఫ్ట్ మరియు స్విఫ్ట్ డిజైర్ విడుదల కానున్నాయి.

మారుతి సుజుకి 2017 సియాజ్

 
English summary
Updated Maruti Ciaz Sedan To Be Sold Exclusively At NEXA By March 2017

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark