ఐ10 స్థానంలోకి సరికొత్త శాంట్రోను విడుదల చేయనున్న హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్స్ ప్రస్తుతం ఉన్న తమ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ను నిలిపివేసి,దీని స్థానంలో సరికొత్త శాంట్రోను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

By Anil

చాలా కాలం నుండి దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ ఐ10 అమ్మకాల్లో ఉంది. కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ఇప్పుడు ఈ ఐ10 స్థానంలోకి సరికొత్త శాంట్రోను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దేశీయ విపణిలో మొదటిసారి కార్యకలాపాలు ప్రారంభించిన హ్యుందాయ్ ప్రవేశపెట్టిన ప్రప్రథ ఉత్పత్తి శాంట్రో.

హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ మోటార్స్ ఇప్పుడు దేశీయంగా ఉన్న తమలైనప్ లోకి అత్యంత సరసమైన ఉత్పత్తిని విడుదల చేయాలని భావిస్తోంది. అందుకు ఐ10 స్థానంలో శాంట్రోను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిని 2018 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ శాంట్రో

ఐ10 పేరును శాశ్వతంగా లైనప్ నుండి తొలగించకుండా గ్రాండ్ ఐ10 గా కొనసాగించనుంది.

హ్యుందాయ్ శాంట్రో

2018 నాటికి విడుదల కానున్న శాంట్రో హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. అది మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ లతో పరిచయం కానుంది.

హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ శాంట్రోను మళ్లీ పూర్తి స్థాయిలో కొత్తగా మార్కెట్లోకి విడుదల చేస్తే మారుతి సుజుకి సెలెరియో, వ్యాగన్ ఆర్ మరియు రెనో క్విడ్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలవనుంది.

హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ ఇప్పటికే దీని డిజైన్ పనులను ప్రారంభించింది. అయితే మునుపటి శాంట్రో (టాల్ బాయ్ బాడీ) లా కాకుండా 2.0 ఫ్లూయిడిక్ డిజైన్ భాషలో డిజైన్ అవుతోంది. అయితే దీనిని ఏ వేదిక మీద అభివృద్ది చేస్తున్నారనే తెలియాల్సి ఉంది.

హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ శాంట్రో విజయాన్ని అందుకోవాలంటే దీని ధరను నిర్ణయించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. దీనికి పోటీగా నిలిచే వాటి కన్నా కాస్త తక్కువ ధరలో విడుదలైతే మరీ మంచిది.

హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ మోటార్స్ 2020 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 10 లక్షల అమ్మకాలు మైలు రాయిని అధిగమించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. దీనికి 2018 లో విడుదల కానున్న శాంట్రో అమ్మాకాలు కూడా కలిసిరానున్నాయి.

హ్యుందాయ్ శాంట్రో

  • క్లింబర్, రేసర్ అంటూ రెనో క్విడ్ లో మరిన్ని వేరియంట్లు
  • వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్
  • ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన టక్సన్: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

Most Read Articles

English summary
Hyundai i10 Hatchback To Be Replaced By Santro In India By 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X