ఆటోమేటిక్ రెనో క్విడ్ బుకింగ్స్ ప్రారంభం: పూర్తి వివరాల కోసం...

రెనో నుండి అతి త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్ బుకింగ్స్‌ను రెనో డీలర్లు ప్రారంభించారు.

By Anil

రెనో ఇండియా యొక్క ఉత్తమ అమ్మకాలు సాధిస్తున్న కారు క్విడ్. అతి త్వరలో రెనో ఈ క్విడ్ ను ఆటోమేటిక్ వేరియంట్లో మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే ఇప్పటికే రెనో అధీకృత డీలర్లు క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్ల యొక్క బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నారు.

రెనో క్విడ్ ఆటోమేటిక్

ఫ్రెంచ్‌కు చెందిన రెనో దేశీయంగా చిన్న కార్లను కొనుగోలు చేసే వారికి తక్కువ ధరలో ఉత్తమ ఫీచర్లతో ఎంట్రీ లెవల్ కార్లను అందుబాటులోకి తెచ్చి తిరుగులేని విజయాన్ని అందుకుంది.

రెనో క్విడ్ ఆటోమేటిక్

రెనో ప్రారంభంలో క్విడ్ ను 800సీసీ సామర్థ్యంతో, ఆ తరువాత 1.0-లీటర్ సామర్థ్యంతో విడుదల చేసింది. ఇప్పుడు ఆ ఎంట్రీ లెవల్ ఉత్పత్తులను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లో అందుబాటులోకి తెచ్చింది.

రెనో క్విడ్ ఆటోమేటిక్

దేశవ్యాప్తంగా రెనో ఇండియా డీలర్లు 10,000 రుపాయల డిపాజిట్‌తో క్విడ్ ఈజీ-ఆర్ వేరియంట్‌కు సంభందించిన బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నారు.

రెనో క్విడ్ ఆటోమేటిక్

రెనో ఇండియా తమ డస్టర్ ఎస్‌యువి కోసం అభివృద్ది చేసిన అదే 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఈ క్విడ్‌లో కూడా పరిచయం చేస్తోంది.

రెనో క్విడ్ ఆటోమేటిక్

ఈజీ-ఆర్ ట్రాన్స్‌మిషన్ క్విడ్ 1.0-లీటర్ వేరియంట్లో అందుబాటులో ఉండనుంది. ఇందులోని శక్తివంతమైన 999సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ సుమారుగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

రెనో క్విడ్ ఆటోమేటిక్

ఈజీ-ఆర్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను డస్టర్‌ ఎస్‌యువిలో ఉన్న విధంగా అందివ్వడం లేదు. ప్రస్తుతం ఆకారం మరియు గేర్ షిఫ్టింగ్ ఆఫ్షన్‌లలో ఈజీ-ఆర్ కలదు.

రెనో క్విడ్ ఆటోమేటిక్

డస్టర్‌లో కన్వన్షెనల్ రూపంలో గేర్‌ రాడ్ కలిగి ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌గా గేర్లు మార్పిడి చేస్తుంది. ఇలా కాకుండా ఈ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌లోని డ్యాష్ బోర్డ్ మీద గుండ్రంగా తిరిగే ప్లాస్టిక్ మూత వలే ఉంటుంది. ఇది గేర్ల మార్పిడిని సూచిస్తుంది.

రెనో క్విడ్ ఆటోమేటిక్

చాలా వరకు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కార్లలో గేర్‌నాబ్ మరియు దానికి సంభందించి పెద్ద పరిమాణం సెంటర్ కన్సోల్ వద్ద ఉంటుంది. అయితే ఏఎమ్‌టి ద్వారా గేర్ల మార్పిడి గమనించే పరికరాన్ని డ్యాష్‌బోర్డ్‌లో ఇముడింపచేయడం వలన ఎక్కుక ఖాలీ ప్రదేశానికి ఆస్కారం ఏర్పడింది.

రెనో క్విడ్ ఆటోమేటిక్

క్విడ్ 1.0-లీటర్ ఈజీ-ఆర్ వేరియంట్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆల్టో కె10 ఆటో గేర్‌ షిఫ్ట్ మోడల్‌కు గట్టి పోటీగా నిలవనుంది.

రెనో క్విడ్ ఆటోమేటిక్

  • మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్న మిత్సుబిషి
  • మార్కెట్లోకి విడుదలైన ఐషర్ పొలారిస్ మల్టిక్స్

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Read In Telugu: Bookings Commence For Renault Kwid AMT — Launch Imminent?
Story first published: Thursday, November 3, 2016, 12:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X