నూతన ట్రాక్టర్ ఉత్పత్తులను విడుదల చేసిన టాఫె

By Anil

చెన్నై ఆధారిత ట్రాక్టర్ల తయారీ సంస్థ టాఫె (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్) దేశీయ వ్యవసాయ వాహనాల విపణిలోకి కొత్త ట్రాక్టర్లను విడుదల చేసింది. 40 బిహెచ్‌పి నుండి 60 బిహెచ్‌పి పవర్ మధ్య గల శ్రేణి వాహనాలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని ప్రత్యేకంగా మెరుగైన ఉత్పత్తి మరియు సామర్థ్యం కోసం అభివృద్ది చేసినట్లు టాఫె తెలిపింది.

నూతన ట్రాక్టర్ ఉత్పత్తులను విడుదల చేసిన టాఫె

టాఫె సంస్థ సిఇఒ మరియు చైర్మెన్ మల్లికా శ్రీనివాసన్ మాట్లాడుతూ, దేశీయంగా రైతులు విభిన్న అవసరాలకు ఉపయోగించుకునే విధంగా 28బిహెచ్‌పి సామర్థ్యం గల ప్రీమియమ్ కాంపాక్ట్ యుటిలిటి ట్రాక్టర్లను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.

నూతన ట్రాక్టర్ ఉత్పత్తులను విడుదల చేసిన టాఫె

పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా సరైన ఉత్పత్తి మరియు సామర్థ్యం గల ఈ వాహనాలతో రైతులు ఖచ్చితమైన ఫలితాలను సాధిస్తారని చెప్పుకొచ్చారు.

నూతన ట్రాక్టర్ ఉత్పత్తులను విడుదల చేసిన టాఫె

విభిన్నమైన అవసరాలకు ఉపయోగపడే ట్రాక్టర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, ట్రాక్టర్ల విభాగంలో ఒక కొత్త సెగ్మెంట్‌ను సృష్టిస్తున్నామని మేము నమ్ముతున్నాము. మరియు సులభంగా వినియోగించుకునే అవకాశం ఉన్నందున వలన ఇవి మంచి ఫలితాలను సాధిస్తాయనే నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.

నూతన ట్రాక్టర్ ఉత్పత్తులను విడుదల చేసిన టాఫె

సంస్థ అమ్మకాలకు సంభందించిన వివరాలను పరిశీలిస్తే గత ఏడాదిలో మొత్తం 1.40 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపింది. అయితే ఈ ఏడాదిలో 1.50 లక్షల అమ్మకాలు జరపాలనే లక్ష్యంతో ఉన్నారు.

నూతన ట్రాక్టర్ ఉత్పత్తులను విడుదల చేసిన టాఫె

  • భారత్‌లో ఉన్న ఉత్తమ ట్రాక్టర్ తయారీ సంస్థలు
  • డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లతో వ్యవసాయం చేయాలని ఉందా ?

Most Read Articles

English summary
Read In Telugu: Chennai Based TAFE Launched New Tractors
Story first published: Saturday, September 17, 2016, 13:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X