ధరలు పెంచిన టాప్-10 కార్ల సంస్థలు: ఏ మేరకు పెరిగాయో తెలుసా ?

By Anil

2016 నూతన సంవత్సరంలో కారును కొనాలని ఎంతో మంది కోరుకుని ఉంటారు. అయితే ఈ ఏడాది వీరికి నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అగ్ర కార్ల తయారీ సంస్థలు అన్ని కూడా దాదాపుగా 2 నుండి 3 శాతం వరకు వాటి కార్ల మీద ధరల పెంపును ప్రకటించాయి.

ఇలా పెంచిన ధరలు అన్ని కూడా 2016 జనవరి నుండి అందుబాటులోకి వచ్చినట్లు ఆ యా కార్ల సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇలా అన్ని కార్ల మీద 2 నుండి 3 శాతం వరకు ధరలను పెంచడం వెనకున్న ముఖ్యకారణం, ముడి సరుకు మరియు ఉత్పత్తి వ్యయాలు పెరగడమే అని కొన్ని కార్ల సంస్థలు సెలవిచ్చాయి.

2016 జనవరి నుండి కొత్త ధరలను అందుబాటులోకి తెచ్చిన కార్ల సంస్థలు మరియు ఏ మేరకు పెంపును ప్రకటించాయో అనే సమాచారం గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ లోని అన్ని శ్రేణిలో గల కార్ల మీద దాదాపుగా 3 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2016 జనవరి నుండి అందుబాటులోకి రానున్నాయి.

మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్

లగ్జరీ కార్ల ఉత్పత్తులకు బాగా పేరు మోసిన సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇది కూడా జర్మనీకి చెందినదే . దేశీయంగా చాలా ఉత్పత్తులనే అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సంస్థ తమ అన్ని కార్ల మీద 2 శాతం మేర ధరలను పెంచింది. అయితే పెంచిన ధరలు 2016 జనవరి 1 వ తేదీ నుండి అందుబాటులో ఉన్నట్లు మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది.

జనరల్ మోటార్స్

జనరల్ మోటార్స్

షెవర్లే మోటార్స్‌కు మాతృ సంస్థ అయిన జనరల్ మోటార్స్ కార్లు మీద దాదాపుగా 2 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది. అయితే షెవర్లే సంస్థ ఈ మధ్యనే విడుదల చేసిన ప్రీమియన్ యస్‌యువి షెవర్లే ట్రయల్ బ్లేజర్ మీద మినహాయింపును ప్రకటించింది.

ఫోర్డ్ ఇండియా

ఫోర్డ్ ఇండియా

దేశీయంగా ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ వారు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన తమ అన్ని కార్ల మీద 2 శాతం వరకు ధరలను పెంచారు.

 స్కోడా ఆటో ఇండియా

స్కోడా ఆటో ఇండియా

స్కోడా ఆటో ఇండియా వారి ఫోర్ట్‌ ఫోలియోలో ఉన్న అన్ని కార్ల మీద కూడా 2 నుండి శాతం వరకు ధరలను పెంచారు. అయితే ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి కూడా కార్ల ధరలలో వ్యాత్యాసం ఉంటుందని స్కోడా ఆటో ఇండియా వారు ప్రకటించారు.

రెనో మరియు నిస్సాన్

రెనో మరియు నిస్సాన్

రెనో మరియు నిస్సాన్ మోటార్స్ వారు కూడా తమ అన్ని కార్ల మీద దాదాపుగా 3 శాతం వరకు ధరలను పెంచారు. ఇక రెనో సంస్థ నుండి బాగా అమ్ముడుపోతున్న డస్టర్ కాంపాక్ట్ యస్‌యువి మీద దాదాపుగా 20,000 రుపాయల వరకు ధర పెంపును ప్రకటించారు.

టయోటా ఇండియా

టయోటా ఇండియా

టయోటా ఇండియా వారు తాము మార్కెట్లో అందుబాటులో ఉంచిన అన్ని మోడల్స్ మీద దాదాపుగా 3 శాతం వరకు ధరలను పెంచినట్లు ప్రకటించారు. మరియు పెంచిన ధరల జనవరి 1, 2016 నుండి అందుబాటులోకి వచ్చాయి.

మారుతి సుజుకి

మారుతి సుజుకి

దేశ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు చేపడుతున్న ఏకైక సంస్థ మారుతి సుజుకి. మారుతి సుజుకి దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచిన అన్ని మోడల్స్‌ను 20,000 రుపాయలు అధిక ధరలతో విక్రయించనున్నారు.

హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్స్

ఉత్తమ ఉత్పత్తులు అందింస్తున్న సంస్థల వారిగా హ్యుందాయ్ మోటార్స్ బాగానే పేరుగాంచింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ తమ అన్ని కార్ల మీద దాదాపుగా 30,000 వరకు ధరల పెంపును ప్రకటించింది.

టాటా మోటార్స్

టాటా మోటార్స్

దేశీయం దిగ్గజ వాహన సంస్థ కూడా ఇదే బాట పట్టింది. తమ అన్ని ప్యాసింజర్ వాహనాల మీద ఈ నూతన సంవత్సరంలో 20,000 వరకు ధరలను పెంచింది.

హోండా కార్స్ ఇండియా

హోండా కార్స్ ఇండియా

ఉత్పత్తి వ్యయాలు పెరిగాయన్న నెపంతో హోండా కార్ల సంస్థ తమ అన్ని కార్ల మీద దాదాపుగా 16,000 రుపాయల వరకు పెంపును ప్రకటించింది.

మరిన్ని కథనాలు కోసం
  1. 2016 విడుదలకు సిద్దమైన కార్లు వాటి వివరాలు
  2. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఉత్తమమైన విమానాలు
  3. 2016 లో విడుదలకు సిద్దమైన ఎయమ్‌టి ఆప్షన్ గల టాప్-5 కార్లు
Most Read Articles

English summary
Top 10 manufacturers announced price hike from 2016 January
Story first published: Monday, January 4, 2016, 11:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X