పాత వాటి స్థానంలో కొత్త కార్లకు స్థానం...!!

Written By:

నోట్ల రద్దు అంశం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ను పూర్తి స్థాయిలో కుదిపేసింది. దీని కారణం కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీ స్థాయిలో స్తంభించిపోయాయి. అయితే కొన్ని వాహన తయారీ సంస్థలు గత నవంబర్ 2016లో మంచి అమ్మకాలు నమోదుచేసుకున్నాయి.

నోట్ల రద్దు తరువాత కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోయిన, టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఉన్న పది కార్ల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం...

 10. టాటా టియాగో

10. టాటా టియాగో

టాటా మోటార్స్ మొదటి సారిగా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల విభాగంలోకి గత నవంబర్ 2016 అమ్మకాలతో ఎంట్రీ ఇచ్చింది. దేశీయ పరిజ్ఞానంతో ఎదిగిన విభిన్న వాహన తయారీ సంస్థ టాటా తమ టియాగో ద్వారా దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో చివరికి నిలదొక్కుకుంది.

నవంబర్ లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

గడిచిన నవంబర్ 2016 లో 6,008 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. టాటా నమోదు చేసిన మొత్తం అమ్మకాల్లో 47 శాతం టియాగోకు చెందినవే. ఇంపాక్ట్ డిజైన్ నాణ్యత మరియు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లో రెండు రకాల ఇంజన్‌లు పరిచయం కావడం ఈ విజయానికి కారణమని చెప్పవచ్చు.

09. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

09. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్‌కు చెందిన ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 గత నవంబర్ 2016 అమ్మకాల్లో రెండు స్థానాలు పడిపోయింది. చిన్న కార్ల ప్రభావం మరియు నోట్ల రద్దు కారణంగా 7,601 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

నవంబర్ లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

గతంతలో ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో పోటీ ఉండేది కాదు. అయితే అచ్చం ఇదే ప్లాట్ ఫామ్ ఆధారంగా తయారు చేయబడిన బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ద్వారా గట్టి పోటీని ఎదుర్కుంటోంది. ఎలైట్ ఐ20 ధర బాలెనొ కన్నా కాస్త తక్కువగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణం అని చెప్పవచ్చు.

08. రెనో క్విడ్

08. రెనో క్విడ్

గతం రెండు మూడు నెలల అమ్మకాలతో పోల్చితే నవంబర్ 2016 లో క్విడ్ అమ్మకాలు కాస్త తగ్గాయి. నోట్ల రద్దు ఇందుకు ముఖ్య కారణమని చెప్పవచ్చు. గత నెల అమ్మకాల గణాంకాల ప్రకారం నవంబర్ 2016 లో 7,847 యూనిట్ల క్విడ్ కార్లు అమ్ముడుపోయాయి.

నవంబర్ లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

రెనో క్విడ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లోకి విడుదలయ్యి సంవత్సర కాలమయ్యింది. అయినప్పటికీ స్థిరమైన అమ్మకాలు సాధిస్తూనే ఉంది. ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించడానికి రెనో ఇండియా ఈ క్విడ్ ను ఈ మధ్య కాలంలో 1.0-లీటర్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల వేరియంట్లను విడుదల చేసింది.

07. మారుతి సుజుకి సెలెరియో

07. మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి ఇండియన్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో గత నవంబర్ 2016 అమ్మకాల్లో 9,543 యూనిట్ల సెలెరియో విక్రయాలు జరిపింది. గత ఏడాది ఇదే నవంబర్ అమ్మకాల్లో కేవలం 6,956 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

నవంబర్ లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

భారీ సంఖ్యలో సెలెరియో అమ్మకాలకు ముఖ్య కారణం ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఒకటి. భారతీయులకు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసిన కారు కూడా ఇదే. ఇది సులభమైన డ్రైవింగ్ అనుభవాన్ని కలిగిస్తుంది.

06. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

06. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్ దేశీయ లైనప్‌లో నవంబర్ 2016 కాలంలో అత్యధిక అమ్మకాలు సాధించిన గ్రాండ్ ఐ10 ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. గత నవంబర్ 2016 లో 11,059 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే క్రితం ఏడాది ఇదే మాసపు అమ్మకాలు 12,899 యూనిట్లతో పోల్చుకుంటే ఇది తక్కువే.

నవంబర్ లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ప్రస్తుతం మారుతి సుజుకి శ్రేణిలో ఉన్న ఉత్పత్తుల ద్వారా భారీ పోటీని ఎదుర్కుంటోంది. వాటిని నిలువరించేందుకు వచ్చే ఏడాదిలో ఈ గ్రాండ్ ఐ 10 కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో 2017 గ్రాండ్ ఐ10 నూతన ఫీచర్లతో విడుదల కానుంది.

 05. మారుతి సుజుకి బాలెనొ

05. మారుతి సుజుకి బాలెనొ

ధర, ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన బాలనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మంచి విజయాన్ని అందుకుంది. నోట్ల చెల్లింపులు రద్దు అయినప్పటికీ బాలెనో మంచి అమ్మకాలను సాధిస్తోంది. నవంబర్ 2015 లో జరిగిన 9,074 యూనిట్లతో పోల్చితే నవంబర్ 2016 లో 11,093 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది.

నవంబర్ లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

డిజైన్ పంరగానే కాకుండా అత్యాధునిక ఫీచర్లు కూడా కస్టమర్లను భారీ సంఖ్యలో ఆకర్షించింది. అంతే కాకుండా భద్రత పరంగా ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్ల ద్వారా

04. మారుతి సుజుకి స్విఫ్ట్

04. మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి గడిచిన నవంబర్ 2016 లో 14,594 యూనిట్ల విక్రయాలు జరిపింది. గత ఏడాది ఇదే నవంబర్ కాలానికి మారుతి సుజుకి 11,859 యూనిట్ల అమ్మకాలు జరిపింది. గత ఏడాదిలో టాప్ 10 జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న స్విఫ్ట్ నాలుగు స్థానానికి చేరుకుంది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో విపరీతమైన పోటీని ఎదుర్కుంటున్నప్పటికీ భారీ అమ్మకాల దిశగా మారుతి స్విఫ్ట్ దూసుకుపోతోంది.

నవంబర్ లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైన్, నాణ్యమైన డిజైన్, ఫీచర్లు మరియు సౌకర్యవంతమైన ప్రయాణానికి మరియు నాణ్యమైన పనితీరుకు ఇండియన్ మార్కెట్లో అత్యంత పేరుగాంచింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లలో మారుతి స్విఫ్ట్ అత్యుత్తమ విక్రయాలు సాధిస్తోంది.

03. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

03. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి లోని ఎవర్ గ్రీన్ మోడల్ వ్యాగన్ ఆర్. దీని నిరంతర అమ్మకాలు ఈ సారి కూడా దీనిని ఈ టాప్ 10 జాబితాలో అదే మూడవ స్థానానికి పరిమితమైంది. గత నవంబర్ 2016 ఈ వ్యాగన్ ఆర్ 15,566 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది ఇదే నెల అమ్మకాల్లో 13,986 యూనిట్లు అమ్ముడుపోయాయి.

నవంబర్ లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

అత్యంత విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్‌ మరియు పెట్రోల్ తో పాటు సిఎన్‌జి ఇంధన వేరియంట్లలో అందుబాటులో ఉడటం అదే విధంగా మార్కెట్లో దీనికి ఏవిధమైన పోటీ లేనటువంటి టాల్ బాయ్ బాడీ డిజైన్ దీని భారీ అమ్మకాలు బాగా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.

02. మారుతి స్విఫ్ట్ డిజైర్

02. మారుతి స్విఫ్ట్ డిజైర్

మారుతి భారీ సంఖ్యలో విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్‌ స్విఫ్ట్ డిజైర్. దేశీయంగా ఇది కాస్త పాత మోడలే అయినప్పటికీ దీనికి ఉన్న డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. దీని మీద వచ్చే భారీ డిమాండ్ ప్రతి మాసంలో కూడా వీటి అమ్మకాల్లో ప్రతిబింబిస్తోంది. గడిచిన నవంబర్ 2016 లో మారుతి ఏకంగా 17,218 యూనిట్ల విక్రయాలు జరిపింది.

నవంబర్ లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

మారుతి స్విఫ్ట్ డిజైర్ ఈ మధ్య కాలంలో ఓ మోస్తారు ఫలితాలే సాధించినప్పటికీ గత నవంబర్ లో ఆశించిన స్థాయిలో 17,682 యూనిట్లు అమ్ముడుపోయాయి. దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్ సామ్రాజ్యం, సేల్స్ మరియు సర్వీసుల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉండటం మరియు సబ్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో కొనుగోలు చేయడానికి ఉన్న అత్యుత్తమ ఉత్పత్తి ఈ డిజైర్.

01. మారుతి సుజుకి ఆల్టో

01. మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి మొత్తం లైనప్‌లో ఉన్న ఉత్పత్తుల్లో అత్యుత్తమ అమ్మకాలు సాగించే ఎంట్రీ లెవల్ వేరియంట్ ఆల్టో ఈ సారి కూడా టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన నవంబర్ 2016 అమ్మకాల్లో 23,320 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది అక్టోబర్ అమ్మకాలు వీటి విక్రయాలు 18,854 యూనిట్లు మాత్రమే నమోదయ్యాయి.

నవంబర్ లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ అయినప్పటికీ మారుతి ఆల్టో తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది. రెనో క్విడ్ మరియు క్విడ్ ఆధారిత ఉత్పత్తులు మార్కెట్లోకి ఎన్ని విడుదలైనా కూడా ఆల్టో నిలకడైన అమ్మకాలు సాధిస్తోంది. మరియు మారుతి ఈ మధ్య నోట్ల రద్దు కారణం చేత నగదు రహిత చెల్లిపులు ప్రారంభించింది, ఇది కూడా ఈ స్థాయి అమ్మకాలకు ఓ కారణం అని చెప్పవచ్చు.

పరిశీలన

పరిశీలన

డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఆటోమొబైల్ వార్తా వేదిక ప్రతి మాసంలో కూడా ఆ నెలకు గాను బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి మాసంలా కాకుండా నవంబర్ 2016 అమ్మకాల్లో టాప్ 10 జాబితాలో నూతన ఉత్పత్తులకు చోటు లభించింది. అది కూడా దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటాకు చెందిన టియాగో ఈ జాబితాలోకి ఎంటర్ అయ్యింది. దీని బట్టి చూస్తే దేశీయంగా చిన్న కార్లకు మంచి డిమాండ్ ఉందని స్పష్టం అవుతోంది.

 
English summary
Top 10 Selling Cars In November — Surprise Entry In 10th Position!
Story first published: Saturday, December 10, 2016, 23:03 [IST]
Please Wait while comments are loading...

Latest Photos