భారత్ మార్కెట్లోకి వోక్స్‌వ్యాగన్ నుండి సరికొత్త హ్యాచ్‌బ్యాక్

By Anil

జర్మనీ ఆధారిత ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ దేశీయ విపణిలోకి మరో కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. తమ సరికొత్త పోలో ఆల్ స్టార్ హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా పరీక్షిస్తోంది. అతి త్వరలో విడుదలకు నోచుకోనుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్ స్టార్

వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సరికొత్త పోలో ఆల్ స్టార్ హ్యాచ్‌బ్యాక్‌కు సంభందించిన ఫోటోలను విడుదల చేసింది. కేవలం వీటికి సంభందించిన రంగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్ స్టార్ లభించు రంగులు

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్ స్టార్ లభించు రంగులు

  • బ్లూ సిల్క్,
  • రిఫ్లెక్స్ సిల్వర్,
  • ఫ్లాష్ రెడ్,
  • క్యాండీ వైట్,
  • టోఫీ బ్రౌన్,
  • వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్ స్టార్

    దేశవ్యాప్తంగా ఉన్న వోక్స్‌వ్యాగన్ అధికారిక డీలర్ల వద్ద పోలో ఆల్ స్టార్ టెస్ట్ డ్రైవ్ కోసం సిద్దంగా ఉంది.

    వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్ స్టార్

    వోక్స్‌వ్యాగన్ సరికొత్త ఆల్ స్టార్‌కు సంభందించిన ధర వివరాలను వెల్లడించలేదు, అయితే ప్రస్తుతం విపణిలో ఉన్న పోలో హ్యాచ్‌బ్యాక్ ధర కన్నా 40,000 వరకు అదనంగా ఉండే అవకాశం ఉంది.

    వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్ స్టార్

    ఎక్ట్సీరియర్ పరంగా బి-పిల్లర్స్ మీద ఆల్ స్టార్ బ్యాడ్జిలు కలవు, అంతే కాకుండా వోక్స్‌వ్యాగన్ ఈ పోలో ఆల్ స్టార్‌లో 15-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కలవు.

    వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్ స్టార్

    పోలో ఆల్ స్టార్ ఇంటీరియర్ పరంగా పరిశీలిస్తే ఇందులో సరికొత్త సెంటర్ ఆర్మ్ రెస్ట్, రియర్ ఏ/సి వెంట్, న్యూ సీట్ అప్‌హోల్‌స్ట్రే, ఆల్ స్టార్ ను సూచించే స్కఫ్ ప్లేట్లు మరియు అల్ల్యూమినియం ఫుట్ పెడల్స్ కలవు.

    వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్ స్టార్

    వోక్స్‌వ్యాగన్ తమ సరికొత్త పోలో ఆల్ స్టార్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందించే అవకాశం ఉంది.

    వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్ స్టార్

    రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్నాయి. మరిన్ని తాజా ఆటోమొబైల్ వార్తలను తెలుగులో పొందడానికి మాతో కలిసి ఉండండి.

    వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్ స్టార్

    • సంచలనాత్మక విజయంలో టియాగో: అంతా టాటా అదృష్టం
    • క్షణాల్లో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారత దేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు
    • జపాన్ తొందర పాటు తనమా ? భారత్ వెనకబాటు తనమా...?

Most Read Articles

English summary
Read In Telugu: Volkswagen India Teases An All-New & Exclusive Hatchback, Launching Soon
Story first published: Thursday, October 13, 2016, 13:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X