టెరామౌంట్ ఎస్‌యువిని అభివృద్ది చేస్తున్న వోక్స్‌వ్యాగన్

Written By:

వోక్స్‌వ్యాగన్ చైనా మార్కెట్లోకి తమ సరికొత్త టెరామౌంట్ ఎస్‌యువిని విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ టెరామౌంట్ ఎస్‌యువి వోక్స్‌వ్యాగన్ అట్లాస్‌ను పోలి ఉంది. అట్లాస్ ను నార్త్ అమెరికా మరియు టెరామౌంట్‌ను చైనా మార్కెట్ కోసం అని వోక్స్‌వ్యాగన్ స్పష్టం చేసింది.

వోక్స్‌వ్యాగన్ టెరామౌంట్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ సరికొత్త ఎస్‌యువిని రూపొదిస్తోంది. వోక్స్‌వ్యాగాన్ గ్రూపు యొక్క మోడ్యులర్ ట్రాన్స్‌వర్డి మ్యాట్రిక్స్ (MQB) వేదిక ఆధారంగా దీనిని అభివృద్ది చేస్తోంది.

వోక్స్‌వ్యాగన్ టెరామౌంట్ ఎస్‌యువి

ప్రపంచ విభిన్న మార్కెట్లోకి వివిధ పేర్లతో విడుదలవుతున్న ఈ టెరామౌంట్ ఎస్‌యువిని వోక్స్‌వ్యాగన్ తమ ఎమ్‌క్యూబి ప్లాట్ ఫామ్ ఆధారంగా రూపొందించింది.

వోక్స్‌వ్యాగన్ టెరామౌంట్ ఎస్‌యువి

టెరామౌంట్ ఎస్‌యువి ఎత్తు 5,037ఎమ్ఎమ్, పొడవు 1,979ఎమ్ఎమ్ మరియు వెడల్పు 1,767ఎమ్ఎమ్ గా ఉంది. వోక్స్‌వ్యాగన్ శ్రేణిలో భారీ కొలతలతో అమ్మకాలకు సిద్దమవుతున్న మోడల్ ఇదే.

వోక్స్‌వ్యాగన్ టెరామౌంట్ ఎస్‌యువి

చైనీస్ మ్యాగజైన్ ప్రచురించిన కథనం ప్రకారం వోక్స్‌వ్యాగన్ ఇందులో 2.8-లీటర్ సామర్థ్యం గల టిఎఫ్ఎస్ఐ ఇంజన్ రెండు రకాలుగా శక్తిని ఉత్పత్తి చేయును.

వోక్స్‌వ్యాగన్ టెరామౌంట్ ఎస్‌యువి

186బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ మరియు 220బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. అంతే కాకుండా జర్మనీలో తయారైన 2.5-లీటర్ వి6 ఇంజన్‍‌ను కూడా అందించే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ టెరామౌంట్ ఎస్‌యువి

రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేసే రెండు ఇంజన్‌లకు 7-స్పీడ్ డిసిటి ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయనున్నారు. 4మోషన్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ సరఫరా చేయనుంది.

వోక్స్‌వ్యాగన్ టెరామౌంట్ ఎస్‌యువి

చైనా మార్కెట్లో ఈ ఎస్‌యువి టయోటా హైల్యాండర్ మరియు ఫోర్డ్ ఎడ్జ్ వంటి ఉత్పత్తులకు గట్టిపోటీగా నిలవనుంది.

వోక్స్‌వ్యాగన్ టెరామౌంట్ ఎస్‌యువి

చైనా మార్కెట్లో వోక్స్‌వ్యాగన్ టెరామౌంట్ ఎస్‌యువి ధర 300,000 యువాన్లు(30 లక్షలు) నుండి 4,50,00 యువాన్లు (45 లక్షలు) మధ్య ఉండే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ టెరామౌంట్ ఎస్‌యువి

వోక్స్‌వ్యాగన్ వచ్చే ఏడాది చైనాలోని జరగబోయే 2016 గువాంగ్‌ఝు ఆటో షో వేదిక మీద తమ అతి పెద్ద ఎస్‌యువిని ప్రదర్శించడానికి సిద్దమయిపోయింది.

English summary
Read In Telugu: Volkswagen To Launch Teramount SUV In China
Story first published: Monday, October 31, 2016, 9:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos