వోల్వో నుండి మరో రెండు కార్లు విడుదల

Written By:

స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఖరీదైన మరియు లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియన్ మార్కెట్లోకి తమ వి40 హ్యాచ్‌బ్యాక్ మరియు వి40 క్రాస్ కంట్రీ మోడళ్లను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేసింది. వి40 ప్రారంభ ధర రూ. 25.49 లక్షలు మరియు వి40 క్రాస్ కంట్రీ ధర రూ. 27.20 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు వోల్వో తెలిపింది.

వోల్వో వి40 శ్రేణి ధరలు

వోల్వో వి40 శ్రేణి ధరలు

  • వోల్వో వి40 డి3 కైనటిక్ ధర రూ. 25.49 లక్షలు
  • వోల్వో వి40 డి3 ఆర్-డిజైన్ ధర రూ. 28.53 లక్షలు
  • వి40 క్రాస్ కంట్రీ డి3 ఇన్‌స్క్రిప్షన్ ధర రూ. 29.4 లక్షలు
  • వి40 క్రాస్ కంట్రీ టి4 మూమెంటమ్ ధర రూ. 27.2 లక్షలు
  • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
వోల్వో వి40 మరియు వి40 క్రాస్

వోల్వో విడుదల చేసిన వి40 మరియు వి40 క్రాస్ కంట్రీ రెండు మోడళ్లు కూడా 2.0-లీటర్ సామర్థ్యం ఉన్ననాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌తో అందుబాటులో ఉన్నాయి.

వోల్వో వి40 మరియు వి40 క్రాస్

వీటిలోని ఇంజన్ గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

వోల్వో వి40 మరియు వి40 క్రాస్

వోల్వో వి40 క్రాస్ కంట్రీ మోడల్ పెట్రోల్‌తో పాటు 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 187బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

వోల్వో వి40 మరియు వి40 క్రాస్

వోల్వో వి40 మరియు వి40 క్రాస్ కంట్రీ రెండు వేరియంట్లలోని ఇంజన్‌లకు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

వోల్వో వి40 మరియు వి40 క్రాస్

డిజైన్ పరంగా ఈ రెండు వి40 మరియు వి40 క్రాస్ కంట్రీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లకు స్వల్ప మార్పులు చేసింది. ముందు వైపున థోర్స్ సిగ్నేచర్ గల ఎల్ఇడి లైట్లను మరియు సరికొత్త అప్‌డేటెడ్ ఫ్రంట్ గ్రిల్‌ను వోల్వో అందించింది.

వోల్వో వి40 మరియు వి40 క్రాస్

వి40 మరియు వి40 క్రాస్ కంట్రీ రెండు ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల ఇంటీరియర్‌లో మల్టిపుల్ లెథర్ ఆప్షన్ ట్రిమ్స్ కలవు మరియు ప్రత్యేకించి వి40 క్రాస్ కంట్రీలలో ఆప్షనల్‌ డ్యూయల్ టోన్ అప్ హోల్‌స్ట్రే కలదు.

వోల్వో వి40 మరియు వి40 క్రాస్

ఫ్రంట్ సీటును ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం కలదు. మరియు గతంలో సీటును ఎలా అడ్జెస్ట్ చేసుకున్నారనే సమాచారాన్ని గుర్తించుకునే మెమొరీ ఆప్షన్ ఇందులో కలదు. ప్యానొరమిక్ సన్ రూఫ్ మరియు సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని వీటిలో పరిచయం చేశారు.

వోల్వో వి40 మరియు వి40 క్రాస్

భద్రత పరంగా వోల్వో ఈ రెండు ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లలో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, పార్కింగ్ అసిస్ట్ కలదు ఇందు కోసం ముందు మరియు వెనుక వైపున ప్రత్యేకమైన పార్కింగ్ సెన్సార్లు కలవు.

వోల్వో వి40 మరియు వి40 క్రాస్

ఇండియాలో పాదచారుల కోసం ఎయిర్ బ్యాగును తమ ఈ ఉత్పత్తుల్లో అందించిన ఏకైక సంస్థ వోల్వో ఇండియా.

వోల్వో వి40 ప్రస్తుతం దేశీయంగా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ కారుకు గట్టి పోటీగా నిలవనుంది.

వోల్వో వి40 మరియు వి40 క్రాస్
 
Read more on: #వోల్వో #volvo
English summary
2017 Volvo V40 & V40 Cross Country Launched In India; Prices Start At Rs 25.49 Lakh
Story first published: Friday, December 16, 2016, 15:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos