భారీగా పెరగనున్న కార్ల ధరలు: 2018లో కొనడానికి ప్లాన్ చేస్తే నష్టపోయినట్లే

Written By:

ఇండియన్ మార్కెట్లో దేశీయ ప్యాసింజర్ కార్లు, ప్యాసింజర్ వాహనాలు మరియు వాణిజ్య వాహన తయారీ సంస్ఖలు తమ ఉత్పత్తుల మీద 2018 జనవరి నుండి ధరలు పెంచడానికి సిద్దమయ్యాయి. అందులో ఒకటి జపాన్ దిగ్గజం ఇసుజు మోటార్స్.

భారీగా పెరగనున్న ఇసుజు మోటార్స్ ధరలు

ఇసుజు మోటార్స్ ఇండియా దేశీయంగా అందుబాటులో ఉంచిన పికప్ ట్రక్కులు మరియు ఎస్‌యూవీల మీద జనవరి 1, 2018 నుండి ధరల పెంచడానికి సిద్దమైంది. తమ ఉత్పత్తుల మీద 3 నుండి 4 శాతం మేరకు ధరలు పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది.

భారీగా పెరగనున్న ఇసుజు మోటార్స్ ధరలు

ఇసుజు మోటార్స్ ప్రస్తుతం డి-మ్యాక్స్ , డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్, డి-మ్యాక్స్ వి-క్రాస్ మరియు ఎమ్‌యు-ఎక్స్ వాహనాలను విక్రయిస్తోంది.

  • డి-మ్యాక్స్ వి-క్రాస్ ధర రూ. 13.31 లక్షలు
  • ఎమ్‌యు-ఎక్స్ ధరల శ్రేణి రూ. 23.83 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు ఉంది.
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
భారీగా పెరగనున్న ఇసుజు మోటార్స్ ధరలు

ఇసుజుకి భావించిన మేరకు తమ నాలుగు ఉత్పత్తుల ధరల్లో 3 నుండి 4 శాతం పెంపు ఖాయం అని తెలుస్తోంది. ఈ ధరల పెంపు తప్పనిసరైతే ఇసుజు రెగ్యులర్ క్యాబ్ వాణిజ్య వాహనం డి-మ్యాక్స్ మరియు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ ధర సుమారుగా రూ. 15,000 ల వరకు పెరిగే అవకాశం ఉంది.

భారీగా పెరగనున్న ఇసుజు మోటార్స్ ధరలు

ఇసుజు లైనప్‌లోని ఖరీదైన ప్రీమియమ్ ఎస్‌యూవీ ఎమ్‌యు-ఎక్స్ ధర రూ. 1 లక్ష వరకు పెరగనుంది. గతంలో వస్తు మరియు సేవల పన్ను అమల్లోకి రావడంతో వి-క్రాస్ మరియు ఎమ్‌యు-ఎక్స్ వాహనాల ధరలు తగ్గాయి.

భారీగా పెరగనున్న ఇసుజు మోటార్స్ ధరలు

2018 నుండి ధరల పెంపు బాటలో ఇసుజు మోటార్స్ మాత్రమే కాదు, స్కోడా కూడా వచ్చే 2018 నుండి తమ వాహనాల మీద ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వీటితో మరిన్ని ప్యాసింజర్ కార్లు మరియు వాణిజ్య వాహన తయారీ సంస్థల కూడా 2018 జనవరిలో ధరలు పెంచనున్నాయి.

భారీగా పెరగనున్న ఇసుజు మోటార్స్ ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా వరకు వాహన తయారీ సంస్థలు ధరల పెంపుకు సిద్దమవుతున్నాయి. ఇసుజుతో దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. మరికొన్ని వారాల్లో ఒక్కొక్కటిగా తమ వాహనాల మీద ధరల పెంపును అధికారికంగా ప్రకటించనున్నాయి.

English summary
Read In Telugu: Isuzu Motors To Hike Price In 2018 — Buy Now Or Pay More
Story first published: Saturday, December 2, 2017, 10:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark