డిసెంబర్ 31 తరువాత అన్ని లారీలు, ట్రక్కులలో ఏ/సి క్యాబిన్ తప్పనిసరి చేసి కేంద్రం

Written By:

దేశవ్యాప్తంగా అన్ని ట్రక్కులు మరియు లారీలలో ఏప్రిల్ 1, 2017 నాటికి ఏ/సి క్యాబిన్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. అయితే ఈ గడువును డిసెంబర్ 31, 2017 నాటికి వాణిజ్యపరమైన అన్ని వాహనాలలో ఏ/సి క్యాబిన్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ప్రకటించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
లారీలలో ఏ/సి క్యాబిన్‌ తప్పనిసరి చేసిన కేంద్రం

అన్ని ఎన్2(3.5 నుండి 12 టన్నులు) మరియు ఎన్3(12 టన్నులకు పైబడిన) కెటగిరీ ట్రక్కుల్లోని క్యాబిన్‌లో ఏ/సిని తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి పేర్కొన్నారు.

Recommended Video
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
లారీలలో ఏ/సి క్యాబిన్‌ తప్పనిసరి చేసిన కేంద్రం

దేశం మొత్తం మీద జరుగుతున్న ప్రమాదాలలో ఇలాంటి భారీ ట్రక్కుల ప్రమేయం అధికంగా ఉన్నట్లు సర్వేలలో వెల్లడైంది. లారీ మరియు ట్రక్కుల డ్రైవర్లు అధిక దూరం పాటు వాహనాన్ని నడపడం, మరియు క్యాబిన్‌లో సమతుల ఉష్ణోగ్రత లేకపోవడంతో ఒత్తిడికి గురయ్యి ప్రమాదాలు చేస్తున్నారు, దీనిని నివారించడానికి ఎన్2 మరియు ఎన్3 కెటగిరీ ట్రక్కుల్లో ఏ/సి తప్పనిసరి అనే నియమాన్ని అమల్లోకి తెచ్చారు.

లారీలలో ఏ/సి క్యాబిన్‌ తప్పనిసరి చేసిన కేంద్రం

ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాలలో 1.5 లక్షల మంది మరణిస్తుండగా, సుమారుగా మూడు లక్షల మంది గాయాలపాలవుతున్నారు. లారీలలో ఏ/సి లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి.

లారీలలో ఏ/సి క్యాబిన్‌ తప్పనిసరి చేసిన కేంద్రం

2015 గణాంకాల ప్రకారం, ఒక్క 2015 లో 1,46,133 మంది రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. రోడ్డు ప్రమాదాలకు 11.4 శాతం వరకు లారీలు కారణం కాగా, 7.4 శాతం వరకు బస్సులు కారణమవుతున్నాయి.

లారీలలో ఏ/సి క్యాబిన్‌ తప్పనిసరి చేసిన కేంద్రం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి లారీలు మరియు ట్రక్కులలో ఏ/సి క్యాబిన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని చెప్పవచ్చు. లారీలలో ఏ/సి ఉండటం ద్వారా డ్రైవర్లు అలసట మరియు ఒత్తిడికి దూరమవుతారు, కాబట్టి లారీ యజమానులంతా దీనికి సహకరించి, ఈ నియమాన్ని అనుసరించడం ఎంతైనా ఉత్తమం.

English summary
Read In Telugu: AC Cabins For Trucks Is A Must From December 31
Story first published: Thursday, July 27, 2017, 16:53 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark