ఆల్ న్యూ రెనో డస్టర్ ఆవిష్కరించిన రెనో

Written By:

ఫ్రాంక్‍ఫర్ట్ మోటార్ షో వేదిక మీద డాసియా డస్టర్ ఆవిష్కరణ అనంతరం, ఇదే వెర్షన్ డస్టర్ ఎస్‌యూవీని దక్షిణ అమెరికా, ఆసియా మరియు రష్యా మార్కెట్ కోసం రివీల్ చేసింది. రెనో తమ నెక్ట్స్ జనరేషన్ డస్టర్ ఎస్‌యూవీని దేశీయ విపణిలోకి విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
రెనో డస్టర్

2017 రెనో డస్టర్ చూడటానికి అచ్చం డాసియా వెర్షన్ డస్టర్‌ను పోలి ఉంటుంది. అయిన కూడా స్వల్ప వ్యత్యాసం ఇందులో గుర్తించవచ్చు. రెనో కొలియోస్ ఎస్‌యూవీ మరియు రెనో ట్రక్కుల్లో సహజంగా వచ్చే ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ ఫినిషింగ్, గ్రిల్‌కు ఇరువైపులా రెనో సిగ్నేచర్ డేటైం రన్నింగ్ ఎల్ఇడి ల్యాంప్స్ ఉన్నాయి.

Recommended Video
[Telugu] Skoda kodiaq Launched In India - DriveSpark
రెనో డస్టర్

కండలు తిరిగిన రూపాన్ని కల్పించేందుకు బానెట్ మరియు ప్రంట్ డిజైన్‌లో ఉన్న క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. ఆల్ న్యూ డస్టర్ ఎస్‌యూవీలో స్క్రాచ్ రెసిస్టెంట్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ ఫ్రంట్ బంపర్ క్రింది వైపున జోడించబడింది.

రెనో డస్టర్

2017 రెనో డస్టర్ మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే చాలా విశాలమైన క్యాబిన్ కలదు. అప్ కమింగ్ ఎస్‌యూవీలో అల్యూమినయం రూఫ్ రెయిల్స్, 17-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స్ మరియు అధునాతన వీల్ ఆర్చెస్ ఉన్నాయి.

రెనో డస్టర్

నెక్ట్స్ జనరేషన్ రెనో డస్టర్ రియర్ డిజైన్‌లో ఆసక్తికరంగా ఎక్స్-ఆకారంలో ఉన్న టెయిల్ లైట్ క్లస్టర్ ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి టెయిల్ ల్యాంప్ డిజైన్ కేవలం జీప్ రెనిగేడ్‌లో మాత్రమే ఉంది.

రెనో డస్టర్

డాసియా వెర్షన్ డస్టర్‌తో పోల్చుకుంటే న్యూ జనరేషన్ డస్టర్ ఇంటీరియర్‌లో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. త్రీ-రౌండ్ ఎయిర్ వెంట్స్, సరికొత్త డిజైన్‌లో ఉన్న స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఒక విధంగా న్యూ డస్టర్ ఇంటీరియర్ నిస్సాన్ టెర్రానో ఇంటీరియర్‌ను పోలి ఉంటుంది.

రెనో డస్టర్

బాహ్య వాతారణం మరియు ఇంజన్ నుండి శబ్దం ప్రయాణికులకు చేరకుండా క్యాబిన్‌కు అత్యుత్తమ ఇన్సులేషన్ అందివ్వడం జరిగింది. నూతన ఫ్రేమ్, సరికొత్త సీట్లు, సౌకర్యవంతమైన బ్రేక పెడల్ మరియు క్రోమ్ సొబగులున్న గేర్ లీవర్ వంటివి ఇందులో ఉన్నాయి.

రెనో డస్టర్

సరికొత్త డస్టర్ ఎస్‌యూవీ ఎన్నో అధునాతన ఫీచర్లు రానున్నాయి. అవి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీ లెస్ ఎంట్రీ, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రిమోట్ ఇంజన్ స్టార్ట్, రిమోట్ కంట్రోల్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

రెనో డస్టర్

డస్టర్ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీగా ప్రసిద్ది చెందడానికి కారణమైన ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలను ఇందులో మరింత మెరుగుపరిచారు. 4X4 డ్రైవ్ సిస్టమ్‌తో పాటు, డ్రైవర్ కోసం ప్రత్యేకంగా మల్టీ వ్యూవ్ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్, 4X4 మానిటర్ మరియు రెనో డ్రైవింగ్ ఇకో2 వంటివి ఉన్నాయి.

రెనో డస్టర్

రెనో రివీల్ చేసిన సరికొత్త డస్టర్ ఎస్‌యూవీ దక్షిణ అమెరికా మార్కెట్ కోసం రెండు ఆప్షన్‌లలో ఎంచుకోగల 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈథనోల్ ఇంధనంతో నడిచే ఇదే ఇంజన్ 144బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. 4X4 మరియు 4X2 డ్రైవ్‌ ట్రైన్‌లో లభించనుంది.

రెనో డస్టర్

రెనో డస్టర్ బేస్ వేరియంట్ 1.6-లీటర్ కెపాసిటి గల ఎస్‌సిఇ నాలుగు సిలిండర్ల పెట్రోల్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మరియు యూరోపియన్ మోడళ్లకు యథావిధిగా 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బో మరియు ట్విన్ క్లచ్ ఇడిసి ఇంజన్‌లను అందివ్వనుంది.

రెనో డస్టర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్ కోసం, డస్టర్‌లో 1.5-లీటర్ కెపాసిటీతో రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్‌లను సివిటి ట్రాన్స్‌మిషన్‍ అనుసంధానంతో రెనో పరిచయం చేయనుంది.

ప్రీమియమ్ ఫీచర్లు, అధునాతన డిజైన్ లక్షణాలు, శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లతో పాటు అత్యుత్తమ ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలతో అప్ కమింగ్ రెనో డస్టర్ అతి త్వరలో విపణిలోకి విడుదల కానుంది. ఆల్ న్యూ డస్టర్ ఇండియన్ కస్టమర్లకు మరో మారు ఫేవరెట్ ఎస్‌యూవీగా నిలవనుంది.

Read more on: #renault #suv #రెనో
English summary
Read In Telugu: All new renault duster revealed, specifications, features, images
Story first published: Wednesday, November 15, 2017, 18:21 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark