ఆడి నుండి విపణిలోకి కన్వర్టిబుల్ విడుదల: ధర రూ. 47.98 లక్షలు

Written By:

విలాసవంతమైన కార్ల తయారీ దిగ్గజం ఆడి, ఇండియా విభాగం దేశీయంగా ఏ3 క్యాబ్రియోలెట్ కన్వర్టిబుల్ ను విడుదల చేసింది. ఈ ఏ3 క్యాబ్రియోలెట్ కన్వర్టిబుల్ ప్రారంభ ధర రూ. 47,98,000 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

ఆడి ఏ3 క్యాబ్రియోలెట్ స్పెసిఫికేషన్లు

2017 ఆడి ఏ3 క్యాబ్రియోలెట్ లో 1.4-లీటర్ సామర్థ్యం గల టర్బోఛార్జ్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఆడి ఈ ఇంజన్‌లో అధునాతన పరిజ్ఞానాన్ని జోడించింది. ఎక్కువ పవర్ కావాల్సినప్పుడు మిగతా సిలిండర్లు కూడా పనిచేసే విధంగా చేయడం. అంటే సాధారణంగా తక్కువ పవర్ అవసరం ఉన్న వేళ తాత్కాలికంగా రెండవ మరియు మూడవ సిలిండర్లు పని చేయడం ఆగిపోతాయి. ఎక్కువ పవర్ కావాల్సి వస్తే ఈ రెండు పని చేయడం ప్రారంభిస్తాయి.

ఇంజన్ వివరాలు

 • ఇంజన్ సామర్థ్యం - 1,395సీసీ
 • పవర్ - 148బిహెచ్‌పి
 • టార్క్ - 250ఎన్ఎమ్ 
 • గేర్‍‌బాక్స్ - 7-స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ ఆటోమేటిక్
 • మైలేజ్ - 19.20 కిలోమీటర్లు

కొలతల పరంగా చూస్తే సరికొత్త ఆడి ఏ3 క్యాబ్రియోలెట్,

 • పొడవు - 4,423ఎమ్ఎమ్
 • వెడల్పు - 1,793ఎమ్ఎమ్
 • ఎత్తు - 1,409ఎమ్ఎమ్
 • వీల్ బేస్ - 2,595ఎమ్ఎమ్

డిజైన్

ఫేస్‌లిఫ్ట్ ఏ3 క్యాబ్రియోలెట్ ముందు మరియు వెనుక వైపున రీ డిజైన్ చేయబడిన బంపర్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే లైట్లు, విశాలమైన ఫ్రంట్ గ్రిల్ కలదు. మరియు మలచబడి తరహాలో ఉన్న బ్యానెట్ కండలు తిరిగి రూపాన్ని తలపిస్తోంది.

నూతన గ్రాఫిక్స్ మరియు డైనమిక్ టర్న్ సిగ్నల్స్ గల ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ సిస్టమ్‌ను పూర్తిగా రీ డిజన్ చేసింది. అంతే కాకుండా స్వల్ప మార్పులు చేయబడిన బంపర్ కూడా కలదు. గరిష్టంగా గంటకు 50కిలోమీటర్ల వేగం వద్ద క్యాబ్రియోలెట్ యొక్క రూఫ్ టాప్ తెరవడం మరియు మూయడం చేయవచ్చు.

ఇంటీరియర్

ఏ3 క్యాబ్రియోలెట్ ఇంటీరియర్‌లో 7-అంగుళాల పరిమాణం ఉన్న విధ్యుత్ శక్తితో ప్రతి స్పందించే తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. నూతన ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ ఎయిర్ కండీషనింగ్, సెంటర్ కన్సోల్ విభాగాన్ని డ్రైవర్‌కు కాస్త దగ్గరగా ఉండేట్లు డిజైన్ చేయడం మరియు మిలానో సీట్లను అందించారు.

భద్రత పరంగా ఇందులో,

 • ఐదు ఎయిర్ బ్యాగులు
 • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్,
 • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్,
 • ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు,
 • వెనుక వైపును గమనించేందుకు రియర్ వ్యూవ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

  

Read more on: #ఆడి #audi
English summary
Drop-Top Audi A3 Cabriolet Launched In India; Priced At Rs 47.98 Lakh
Story first published: Thursday, February 9, 2017, 11:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos