ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే 14 బెస్ట్ డీజల్ కార్లు

ప్రతి ఒక్కరు కారు కొనే ముందు మైలేజ్ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అధిక మైలేజ్‌ను కోరుకునే వారు డీజల్ కార్లనే ఎంచుకుంటారు. అధిక మైలేజ్‌ ఇవ్వగల డీజల్ కార్లు గురించి పూర్తి వివరాలు

By Anil

భారతీయులు మైలేజ్ ప్రియులు... అందుకే కారు కొనే ప్రతి ఒక్కరు మైలేజ్ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అధిక మైలేజ్‌ను కోరుకునే వారు డీజల్ కార్లనే ఎంచుకుంటారు.

అధిక మైలేజ్‌ ఇవ్వగల డీజల్ కార్లను ఎంచుకునే పాఠకుల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేటి కథనంలో 14 బెస్ట్ మైలేజ్ డీజల్ కార్లు, వాటి మైలేజ్, ధర మరియు ఇతర వివరాలను వివరంగా అందిస్తోంది.

బెస్ట్ మైలేజ్ కార్లు

14. మహీంద్రా కెయువి100 డీజల్

మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన మైక్రో ఎస్‌యూవీ ఈ లిస్టులో 14 వ స్థానంలో నిలిచింది. మహీంద్రా కెయువి100 డీజల్ వెర్షన్ మైలేజ్ 25.31కిమీలీ మరియు పెట్రోల్ వెర్షన్ మైలేజ్ 18.174కిమీ/లీ

Recommended Video

Volkswagen Passat Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బెస్ట్ మైలేజ్ కార్లు

ఇందులో 77బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ ఎమ్‌ఫాల్కన్ డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బార్ బాక్స్ కలదు. ఇందులో 18.174కిమీల మైలేజ్ ఇవ్వగల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా కలదు.

  • మహీంద్రా కెయువి100 ధరల శ్రేణి రూ. 5.61 - 7.36 లక్షల మధ్య ఉంది.
  • బెస్ట్ మైలేజ్ కార్లు

    13. హ్యుందాయ్ ఎక్సెంట్ డీజల్

    హ్యుందాయ్ ఏప్రిల్ 2017 లో విడుదల చేసిన ఎక్సెంట్ సెడాన్ కాంపాక్ట్ సెడాన్ భారతదేశపు 13 వ బెస్ట్ మైలేజ్ డీజల్ కారుగా నిలిచింది. ఇందులో 79బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ యు2 సిఆర్‌డిఐ డీజల్ ఇంజన్ కలదు.

    బెస్ట్ మైలేజ్ కార్లు

    5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే హ్యుందాయ్ ఎక్సెంట్ డీజల్ సెడాన్ కారు లీటర్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

    • హ్యుందాయ్ ఎక్సెంట్ ధరల శ్రేణి రూ. 6.24 - 8.39 లక్షల మధ్య ఉంది.
    • బెస్ట్ మైలేజ్ కార్లు

      12. హోండా డబ్ల్యూఆర్-వి డీజల్

      బెస్ట్ మైలేజ్ ఇవ్వగల 12 వ బెస్ట్ డీజల్ కారుగా హోండా వారి డబ్ల్యూఆర్-వి క్రాసోవర ఎస్‌యూవీ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇందులో 1498సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ నుండి పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు సరఫరా చేస్తుంది. దీని మైలేజ్‌ లీటర్‌కు 25.5కిలోమీటర్లు.

      బెస్ట్ మైలేజ్ కార్లు

      అదే విధంగా హోండా డబ్ల్యూఆర్-విలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా కలదు. ఇదే ఇంజన్ హోండా జాజ్‌లో కూడా ఉంది, అయితే అది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‍‌బాక్స్‌తో మాత్రమే లభిస్తోంది.

      • హోండా డబ్ల్యూఆర్-వి ధరల శ్రేణి రూ. 8.72 - 9.92 లక్షల మధ్య ఉంది.
      • Trending Stories On DriveSpark Telugu:

        దూసుకొస్తున్న నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్: డేట్స్ ఖరారు చేసిన మారుతి సుజుకి

        బెంగళూరులో 100సీసీ టూ వీలర్ల మీద డబుల్ రైడింగ్ బ్యాన్

        బెస్ట్ మైలేజ్ కార్లు

        11. హోండా సిటి డీజల్

        హోండా సిటి మరియు హోండా అమేజ్ రెండు కార్లలో 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. అయితే, వీటిలో సిటి మిడ్ సైజ్ సెడాన్ కాగా, అమేజ్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ఉంటుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న సిటి డీజల్ వెర్షన్ మైలేజ్ లీటర్‌కు 25.6కిమీ/లుగా ఉంది.

        బెస్ట్ మైలేజ్ కార్లు

        హోండా సిటి సెడాన్‌లో 119బిహెచ్‍‌పి పవర్ ఉత్పత్తి చేసే 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా కలదు.

        హోండా సిటి ధరల శ్రేణి రూ. 5.45 - 9.41 లక్షల మధ్య ఉంది.

        బెస్ట్ మైలేజ్ కార్లు

        10. హోండా అమేజ్ డీజల్

        హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారులో 100బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానిత 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. అమేజ్ సెడాన్ డీజల్ వెర్షన్ మైలేజ్‌ లీటర్‌కు 25.8కిమీలుగా ఉంది.

        బెస్ట్ మైలేజ్ కార్లు

        హోండా ఇండియా లైనప్‌లో 1.5-లీటర్ ఐ-డిటిఇసి ఇంజన్‌ పొందిన మొదటి కారు అమేజ్ సెడాన్. దీని తరువాతనే సిటి, జాజ్, మొబీలియో, బిఆర్‌వి మరియు డబ్ల్యూఆర్-వి కార్లలో ఈ ఇంజన్‌ పరిచయం అయ్యింది.

        • హోండా అమేజ్ ధరల శ్రేణి రూ. 6.65 - 8.41 లక్షల మధ్య ఉంది.
        • బెస్ట్ మైలేజ్ కార్లు

          09. ఫోర్డ్ ఆస్పైర్ డీజల్

          కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో డిజైర్, అమేజ్, మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ కార్లతో పోల్చుకుంటే ఫోర్డ్ ఆస్పైర్ బరువు ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ లీటర్‌కు 25.83 కిమీ/ల మైలేజీతో ఫోర్డ్ ఆస్పైర్ డీజల్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

          బెస్ట్ మైలేజ్ కార్లు

          ఫోర్డ్ ఆస్పైర్‌లో 100బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల 1.5-లీటర్ డీజల్ కలదు.

          • ఫోర్డ్ ఆస్పైర్ ధరల శ్రేణి రూ. 6.52 - 7.95 లక్షల మధ్య ఉంది.
          • బెస్ట్ మైలేజ్ కార్లు

            08. ఫోర్డ్ ఫిగో డీజల్

            ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో కూడా అదే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఉంది. అయితే, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఫిగో డీజల్ వెర్షన్ లీటర్‌‌కు 25.83కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

            బెస్ట్ మైలేజ్ కార్లు

            ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్‌ పోలి ఉండే ఫిగో హ్యాచ్‌బ్యాక్ స్పోర్ట్ ట్రిమ్‌లో కూడా లభిస్తోంది. ఇందులో పెద్ద పరిమాణంలో ఉన్న వీల్స్ మరియు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ ప్రత్యేకంగా నిలిచాయి.

            • ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ ధరల శ్రేణి రూ. 5.69 - 7.22 లక్షల మధ్య ఉంది.
            • బెస్ట్ మైలేజ్ కార్లు

              07. టయోటా ప్రియస్ హైబ్రిడ్

              ఈ జాబితాలో అత్యంత ఖరీదైన కారు ఇదే. అయితే, మైలేజ్ అంశంతో ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచపు బెస్ట్ సెల్లింగ్ హైబ్రిడ్ కారుగా పేరుగాంచిన టయోటా ప్రియస్ హైబ్రిడ్‌లో ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానిత 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

              బెస్ట్ మైలేజ్ కార్లు

              పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా 142ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజల్‌తో కాకుండా అత్యధిక మైలేజ్ ఇవ్వగలిగే ఏకైక కారు ఇండియాలో ఇదే. దీని మైలేజ్ లీటర్‌కు 26.27కిమీలుగా ఉంది.

              • టయోటా ప్రియస్ హైబ్రిడ్ ధరల శ్రేణి రూ. 44.06 లక్షల మధ్య ఉంది.
              • బెస్ట్ మైలేజ్ కార్లు

                06. మారుతి సుజుకి ఇగ్నిస్ డీజల్

                మారుతి సుజుకి ఈ ఏడాది విడుదల చేసిన కొత్త మోడల్ ఇగ్నిస్ క్రాసోవర్ ఈ జాబితాలో 6 వ స్థానంలో నిలిచింది. 5-స్పీడ్ మ్యాన్యుల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించే 1.3-లీటర్ డీజల్ వెర్షన్ ఇగ్నిస్ లీటర్‌కు 26.8కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

                బెస్ట్ మైలేజ్ కార్లు

                ఇగ్నిస్‌లో 1.2-లీటర్ కెపాసిటి కె12సి డీజల్ ఇంజన్ కూడా ఇదే మైలేజ్ ఇవ్వగలదు. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

                • మారుతి ఇగ్నిస్ ధరల శ్రేణి రూ. 6.28 - 7.54 లక్షల మధ్య ఉంది.
                • బెస్ట్ మైలేజ్ కార్లు

                  05. టాటా టియాగో డీజల్

                  అతి తక్కువ ఇంజన్ కెపాసిటితో లభించే భారతదేశపు ఎంట్రీ లెవల్ డీజల్ కారు టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్. టియాగో లోని 1055సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ 70బిహెచ్‌పి పవర్ మరియు 140ఎమ్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే దీని మైలేజ్ 27.28కిమీ/లీ.

                  బెస్ట్ మైలేజ్ కార్లు

                  ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీలో టాటా అభివృద్ది చేసిన మొట్టమొదటి మోడల్ టియాగో పెట్రోల్ వేరియంట్లో కూడా లభిస్తోంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గల టియాగో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది.

                  • టాటా టియాగో ధరల శ్రేణి రూ. 3.88 - 5.65 లక్షల మధ్య ఉంది.
                  • బెస్ట్ మైలేజ్ కార్లు

                    04. హోండా జాజ్ డీజల్

                    భారతదేశపు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న జాజ్ కారులో 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. హోండా జాజ్ డీజల్ వెర్షన్ మైలేజ్ 27.3కిమీలుగా ఉంది.

                    బెస్ట్ మైలేజ్ కార్లు

                    జాజ్ కారులో 1.5-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభించే ఇది వరుసగా 18.7కిమీ/లీ మరియు 9కిమీ/లీ మైలేజ్ ఇవ్వగలదు.

                    • హోండా జాజ్ ధరల శ్రేణి రూ. 7.23 - 9.19 లక్షల మధ్య ఉంది.
                    • బెస్ట్ మైలేజ్ కార్లు

                      03. మారుతి సుజుకి బాలెనో డీజల్

                      మారుతి బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే 1248సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. ఇది లీటర్‌కు 27.39కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

                      బెస్ట్ మైలేజ్ కార్లు

                      బాలెనో 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు. అన్ని పెట్రోల్ వేరియంట్ల మైలేజ్ లీటర్‌కు 21కిలోమీటర్లుగా ఉంది.

                      • మారుతి సుజుకి బాలెనో ధరల శ్రేణి రూ. 6.44 - 8.43 లక్షల మధ్య ఉంది.
                      • బెస్ట్ మైలేజ్ కార్లు

                        02. మారుతి సుజుకి సియాజ్ డీజల్

                        1.3-లీటర్ డిడిఐఎస్ డీజల్ ఇంజన్‌కు సుజుకి వారి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని జోడించడంతో భారతదేశపు రెండవ బెస్ట్ మైలేజ్ కారుగా మారుతి సుజుకి సియాజ్ స్థానం సంపాదించుకుంది. సియాజ్ డీజల్ మైలేజ్ 28.09కిమీలుగా ఉంది.

                        బెస్ట్ మైలేజ్ కార్లు

                        మారుతి సియాజ్ 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ వెర్షన్‌లో కూడా లభిస్తోంది. ఎంచుకునే గేర్‌బాక్స్ ఆధారంగా ఇది 20.73కిమీ/లీ మరియు 19.12కిమీ/లీ మైలేజ్ ఇవ్వగలదు.

                        • మారుతి సియాజ్ ధరల శ్రేణి రూ. 9.43 - 11.44 లక్షల మధ్య ఉంది.
                        • బెస్ట్ మైలేజ్ కార్లు

                          01. మారుతి సుజుకి డిజైర్ డీజల్

                          భారతదేశపు బెస్ట్ మైలేజ్ డీజల్ కారు... మారుతి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. మైలేజ్ పరంగానే కాదు నెలకు 30 వేల సేల్స్‌తో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

                          బెస్ట్ మైలేజ్ కార్లు

                          మారుతి డిజైర్‌లోని 1.3-లీటర్ మల్టీ జెట్ డీజల్ ఇంజన్ లీటర్‌కు 28.4కిమీ/ల మైలేజ్ ఇవ్వగలదు. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. మారుతి డిజైర్‌లోని 1.2-లీటర్ కె12 పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 22కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

                          • మారుతి డిజైర్ ధరల శ్రేణి రూ. 6.44 - 9.39 లక్షల మధ్య ఉంది.
                          • బెస్ట్ మైలేజ్ కార్లు

                            డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

                            ప్రతి ఒక్కరూ మైలేజ్‌ను తొలి అంశంగా ఎంచుకున్న తరువాతే బాడీ స్టైల్ ఆధారంగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ కథనంలో హ్యాచ్‌బ్యాక్, ప్రీమియమ్ హ్యాచ్‌హబ్యాక్, కాంపాక్ట్ సెడాన్, మిడ్ సైజ్ సెడాన్, క్రాసోవర్ ఎస్‌యూవీ మరియు ఎస్‌యూవీ సెగ్మెంట్ల నుండి 14 డీజల్ మోడళ్లను ఇవ్వడం జరిగింది.

                            గమనిక: అన్ని కార్ల మైలేజ్ వివరాలు ఆయా కంపెనీలు ఏఆర్ఏఐ వద్ద నమోదు చేసుకున్న వివరాల ప్రకారం అందివ్వడం జరిగింది.

Most Read Articles

English summary
Read In Telugu: Best Mileage Diesel Cars in India
Story first published: Monday, October 23, 2017, 16:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X