రికార్డు స్థాయి విక్రయాలతో దూసుకెళ్తున్న కార్ల కంపెనీలు

భారత వాహన పరిశ్రమ సానుకూల వృద్దిని నమోదుచేసుకుంటోంది. జూలై 1, 2017 నుండి సరికొత్త ట్యాక్స్ విధానం వస్తు మరియు సేవల పన్ను(GST) అమలైన తరువాత ప్యాసింజర్ కార్ల సేల్స్ విపరీతంగా పెరిగాయి.

By Anil

భారత వాహన పరిశ్రమ సానుకూల వృద్దిని నమోదుచేసుకుంటోంది. జూలై 1, 2017 నుండి సరికొత్త ట్యాక్స్ విధానం వస్తు మరియు సేవల పన్ను(GST) అమలైన తరువాత ప్యాసింజర్ కార్ల సేల్స్ విపరీతంగా పెరిగాయి. జూన్, జూలై మరియు ఆగష్టు నెలల్లో దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల సంస్థలు మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్ మరియు హోండా కార్స్ ఇండియాతో పాటు మరిన్ని సంస్థలు రెండంకెల వృద్దిని సాధించాయి.

గడిచిన మూడు నెలల్లో దాదాపు అన్ని ప్యాసింజర్ కార్ల కంపెనీలు భారీ విక్రయాలను సాధించాయి. జిఎస్‌టి అమలుతో కొన్ని కార్ల ధరలు దిగిరావడం, సరికొత్త మోడళ్లు మార్కెట్లోకి ఎప్పటికప్పుడు విడుదల కావడంతో ఊహించని ఫలితాలు సాధ్యమవుతున్నాయి. వివిధ కంపెనీలు మరియు వాటి సేల్స్ వివరాలు నేటి కథనంలో చూద్దాం రండి...

ప్యాసింజర్ కార్ల సేల్స్

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్(MSIL)

భారత దేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమలో కీలకపాత్ర పోషిస్తోంది. మారుతి సుజుకి గడిచిన ఆగష్టు 2017 నెలలో 1,63,701 యూనిట్లను విక్రయించింది. అయితే 2016 ఆగష్టులో విక్రయించిన 1,32,211 యూనిట్లతో పోల్చుకుంటే 23.8 శాతం వృద్దిని సాధించింది.

Recommended Video

Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
ప్యాసింజర్ కార్ల సేల్స్

మారుతి సుజుకి మొత్తం విక్రయాల్లో బాలెనో, స్విఫ్ట్ డిజైర్ కార్ల వాటా 62.4 శాతంగా ఉంది. ఎగుమతుల్లో ఆశించిన ఫలితం పొందని మారుతి, దేశీయంగా భారీ వృద్దిని సాధిస్తోంది.

ప్యాసింజర్ కార్ల సేల్స్

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(SMIL)

భారత దేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(SMIL) గడిచిన ఆగష్టు 2017 లో దేశీయంగా విక్రయాల్లో 9 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. 2016 ఆగష్టులో 43,201 యూనిట్లను విక్రయించిన హ్యుందాయ్ 2017 ఆగష్టులో 47,103 యూనిట్లను విక్రయించింది.

ప్యాసింజర్ కార్ల సేల్స్

హ్యుందాయ్ ఇండియా సేల్స్ గురించి హ్యుందాయ్ సేల్స్ మరియు మార్కెటింగ్ హెడ్ రాకేష్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, "తాజాగా విడుదల చేసిన సరికొత్త వెర్నా మీద భారీ స్పందన లభిస్తున్నట్లు తెలిపాడు. అతి తక్కువ సమయంలో 7,000 లకు పైగా బుకింగ్స్ మరియు 70,000 లకు పైగా ఎంక్వైరీలు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు."

ప్యాసింజర్ కార్ల సేల్స్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(HCIL)

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా గడిచిన ఆగష్టు నెలలో 25 శాతం వృద్దిని సాధించింది. గత ఏడాది ఆగష్టులో 13,941 యూనిట్లను విక్రయించిన హోండా, ఈ యేడు అదే ఆగష్టు నెలలో 17,365 కార్లను విక్రయించింది.

ప్యాసింజర్ కార్ల సేల్స్

2016 ఆగష్టులో 664 కార్లను ఎగుమతి చేసిన హోండా ఈ సంవత్సరం అదే కాలంలో 575 కార్లను ఎగుమతి చేసి 13.4 శాతం వృద్దిని కోల్పోయింది. మొత్తం విక్రయాల్లో విపణిలో ఉన్న సిటి సెడాన్ మరియు డబ్ల్యూఆర్-వి కార్ల వాటా అధికంగా ఉంది. పండుగ సీజన్ ప్రారంభమైంది కాబట్టి విక్రయాలు మరింత పెరగనున్నాయి.

ప్యాసింజర్ కార్ల సేల్స్

టాటా మోటార్స్

టాటా మోటార్స్ పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ప్యాసింజర్ కార్లను తయారు చేస్తోంది. రెండేళ్ల క్రితం వరకు సాదాసీదా కార్లను ఉత్పత్తి చేసిన టాటా నూతనంగా అభివృద్ది చేసిన ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంతో విడుదల చేసిన కొత్త కార్లతో భారీ వృద్దిని నమోదుచేసుకుంటోంది. విదేశీ సంస్థలకు గట్టి పోటీనిస్తూ ప్రతి నెలా అత్యుత్తమ విక్రయాలు సాధిస్తోంది.

ప్యాసింజర్ కార్ల సేల్స్

టాటా మోటార్స్ గడిచిన 2016 ఆగష్టు నెలలో 43,105 యూనిట్లను విక్రయించగా, 2017 ఆగష్టులో 48,988 యూనిట్లను విక్రయించి ప్యాసింజర్ కార్ల సేల్స్ పరంగా 14 శాతం వృద్దిని సాధించింది. ప్రస్తుతం టియాగో మరియు హెక్సా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి.

ప్యాసింజర్ కార్ల సేల్స్

మహీంద్రా అండ్ మహీంద్రా

ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో ఎస్‌యూవీ వెహికల్స్‌కు ప్రసిద్దిగాంచిన దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 6 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. 2016 ఆగష్టులో 18,246 యూనిట్లను విక్రయించిన మహీంద్రా 2017 ఆగష్టులో 19,325 యూనిట్లను విక్రయించింది.

ప్యాసింజర్ కార్ల సేల్స్

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో స్కార్పియో, ఎక్స్‌యూవీ500, టియువి300 మరియు మహీంద్రా కెయువి100 వాహనాలు లీడింగ్‌లో ఉన్నాయి. ఎగుమతులు మినహాయిస్తే, కేవలం దేశీయ విక్రయాల్లో 7 శాతం వృద్దిని నమోదుచేసుకుంది.

వ్యతిరేక వృద్దిని నమోదు చేసుకున్న కార్ల కంపెనీలు...

ప్యాసింజర్ కార్ల సేల్స్

టయోటా కిర్లోస్కర్ మోటార్స్

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ 2017 ఆగష్టు విక్రయాల్లో 6.86 శాతం వృద్దిని కోల్పోయింది. 2016 ఆగష్టులో 14,045 యూనిట్లను విక్రయించిన టయోటా, ఈ ఏడాది అదే నెలలో 13,81 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఎగుమతులు మినహాయిస్తే, దేశీయ విక్రయాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

ప్యాసింజర్ కార్ల సేల్స్

ఆగష్టు నెలలో ఎక్కువ సెలవులు మరియు తక్కువ ప్రొడక్షన్ కారణంగా ప్రస్తుతం ఉన్న అధిక డిమాండ్‌ను అందుకోలేకపోయామని టయోటా పేర్కొంది. ఆగష్టు 2017 నెలలో టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలు మాత్రమే అధిక సంఖ్యలో అమ్ముడయ్యాయి.

ప్యాసింజర్ కార్ల సేల్స్

ఫోర్డ్ ఇండియా

ఫోర్డ్ ఇండియా ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో భారీ పతనాన్ని చవిచూసింది. దేశీయ విక్రయాలు మరియు ఎగుమతులతో కలుపుకొని 40 శాతం వృద్దిని కోల్పోయింది. గత ఏడాది ఆగష్టులో 26,408 యూనిట్లను విక్రయించిన ఫోర్డ్ ఈ యేడు అదే నెలలో 15,740 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఫోర్డ్ ఇండియా దేశీయ విక్రయాలు 9.01శాతం వరకు తక్కువ నమోదు కాగా, ఎగుమతుల్లో 55.41 శాతం వృద్దిని కోల్పోయింది.

ప్యాసింజర్ కార్ల సేల్స్

వోక్స్‌వ్యాగన్ ఇండియా

వోక్స్‌వ్యాగన్ ఇండియా ఆగష్టు 2017 లో కేవలం 4,159 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 4,447 యూనిట్ల విక్రయాలు జరిపింది. అయితే వోక్స్‌వ్యాగన్ మొత్తం కార్ల విక్రయాల్లో 6.48 శాతం వృద్దిని కోల్పోయింది.

ప్యాసింజర్ కార్ల సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జిఎస్‍‌టి అమలుతో చాలా వరకు ప్యాసింజర్ కార్ల మీద విధించిన ట్యాక్స్ పాత పన్ను విధానంతో పోల్చుకుంటే తగ్గాయి. దీంతో గడిచిన మూడు నెలల నుండి దిగ్గజ కార్ల కంపెనీలు మంచి సేల్స్ సాధించాయి. ఈ ఏడాదిలో మిగిలిన చివరి నాలుగు నెలలు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని నింపనున్నాయి, కాబట్టి కార్ల కంపెనీలు పండుగ ఆఫర్లతో ముందుకు వస్తే, మరిన్ని సేల్స్ సాధించే అకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2017 August Car Sales: Maruti Sales Up, Toyota Witnesses Decline
Story first published: Saturday, September 2, 2017, 18:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X