కారు కొనాలనుకున్నపుడు ఎదురయ్యే ఇలాంటి టెక్నికల్ పదాలను గమనించారా ?

Written By:

ఆటోమొబైల్స్ గురించి పూర్తిగా తెలిసినా, తెలియకపోయినా కారు కొనాలనే కోరిక చాలా మందికే ఉంటుంది. ఒకప్పుడు కారు కొనాలంటే ఎన్నో షోరూమ్‌లు తిరిగాల్సి వచ్చేది. మరి ఇప్పుడు, కారు అనే ఆలోచన రావడం ఆలస్యం, గూగుల్ సెర్చ్ బాక్సులోకి వెళ్లి నచ్చిన కారు మోడల్ మరియు దానిని తయారు చేసిన కంపెనీ పేరు ఎంటర్ చేసి మొత్తం వివరాల్ని రాబడుతున్నారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, అక్కడ ఉన్న వివరాలు చూసి అర్థం చేసుకోలేక తలలు పట్టుకుంటారు. 1.5-లీటర్ ఇంజన్, సీసీ, 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, డ్రైవ్‌ట్రైన్, వీల్ బేస్, ఏబిఎస్ మరియు ఇబిడి వంటి సాంకేతిక వివరాలు చూసి, అర్థంకాక షడన్‌గా ట్యాబ్ చేసేవాళ్లు ఎందరో ఉంటారు.

కారు కొనాలనుకున్నప్పుడు ప్రాథమికంగా చెక్ చేసేవాటిలో ఎదురయ్యే సాంకేతిక పదజాలం గురించి వివరంగా ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...!

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#1. ఇంజన్

ప్రతి కారుకు ఇంజన్ హృదయం లాంటింది. ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ కారు మొత్తం ముందుకు కదలడానికి సహకరిస్తుంది. సాధారణంగా ఇంజన్ మూడు రకాల: అవి, పెట్రోల్(పెట్రోల్ ఇంధనంతో), డీజల్(డీజల్ ఇంధనంతో) మరియు ఎలక్ట్రిక్(బ్యాటరీ పవర్‌తో నడిచేవి).

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#2. 4-సిలిండర్, 3-సిలిండర్...

కారు స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తున్నపుడు 4-సిలిండర్, 3-సిలిండర్ వంటివి చూసి ఉంటారు. నిజానికి ఒక్క సిలిండర్‌లో ఒక పిస్టన్ ఉంటుంది. సిలిండర్‌లో పిస్టన్ కదలికలు ఉంటాయి. ఇంధన నిరంతరం మండుతూ ఉండటంతో పిస్టన్ కదలికలు వేగంగా ఉంటాయి. ఇలా వచ్చే పవర్‌ కారు ముందుకు కదలడానికి సహకరిస్తుంది. కాబట్టి సాధారణంగా మనం తరచూ చూసే చిన్న బైకుల్లో సింగల్ సిలిండర్ ఉంటుంది. కార్లలో కూడా అంతే పిస్టన్లను బట్టి సిలిడర్ల సంఖ్య ఉంటుంది.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#3. డిస్ల్పేస్‌మెంట్ (Ex: 1259సీసీ లేదా 1.2-లీటర్)

ఇంజన్‌లోపల ఇంధనం మంటడానికి ఒక చిన్న గదిలాంటిది ఉంటుంది(Combustion Chamber).ప్రదేశపు పరిమాణాన్ని డిస్ల్పేస్‌మెంట్ అంటారు. దీనిని లీటర్లలో లేదా క్యూబిక్ సెంటీమీటర్లలో కొలుస్తారు. కాబట్టి 1.2-లీటర్ అని చూస్తే, ఇది ఇంజన్‌లోని ప్రతి సిలిడంర్‌కు ఇంధనం మండటానికి అందించిన కంబషన్ ఛాంబర్ యొక్క పరిమాణం అని గుర్తుంచుకోండి.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#4. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్

వెహికల్ వేగాన్ని బట్టి గేర్లను మార్చాల్సి ఉంటుందనే విషయం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. 5-స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌లో ఐదు గేర్లు ఉంటాయి. వాటిని వెహికల్ యొక్క ఐదు రకాల వేగాలను బట్టి మార్చుతూ ఉంటాము. ఇందులో 1 నుండి 5 వరకు గేర్లు ఉంటాయి. రివర్స్ గేర్‌ను ఇక్కడ లెక్కించమనే విషయాన్ని గుర్తుంచుకోండి. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మనం స్వయంగా గేర్లను మార్చాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో వెహికల్ వేగాన్ని బట్టి గేర్లు ఆటోమేటిక్‌గా మారుతుంటాయి.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#5. పవర్ - ఉదాహరణకు: 99HP

ఇంజన్‌ కారును లాగడానికి ఉత్పత్తి చేసే శక్తిని పవర్‌గా చెప్పుకుంటాము. పవర్‌ను హార్స్‌పవర్‌(అశ్వ శక్తి)గా లెక్కిస్తాము. మరింత వివరంగా, 1hp అంటే ఒక గుర్రం యొక్క శక్తి అదే విధంగా 99hp అంటే 99 అశ్వాల శక్తికి సమానం అన్నమాట. పవర్‌ను HP తో పాటు BHP కొలుస్తారు.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#6. టార్క్ - ఉదాహరణకు: 99NM

టార్క్‌ అనగా, తిరిగే వస్తువు భ్రమణం చేయడానికి దోహదమయ్యే బలం యొక్క ధోరణి అంటారు. ఒక వస్తువును మెలితిప్పడాన్ని టార్క్‌గా భావించవచ్చు. దీనిని ఇంజన్ మరియు టైర్లకు అన్వయించుకుంటే టార్క్ ద్వారా వెహికల్ మొత్తం బరువును ముందుకు నెట్టడం జరుగుతుంది. దీనికి ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ ఎంతో అవసరం. కాబట్టి ఎక్కువ బరువున్న వెహికల్స్‌కు టార్క్ ఎక్కువగా ఉంటుంది. ఎస్‌ఐ యూనిట్ల ప్రకారం, టార్క్‌ను న్యూటన్ మీటర్‌(NM)లలో కొలుస్తారు.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#7. డ్రైవ్‌ట్రైన్

ఇంజన్‌ ఉత్పత్తి చేసే పవర్ గేర్‌బాక్స్ నుండి చక్రాల వరకు చేరవేసే వ్యవస్థను డ్రైవ్‌ట్రైన్ సిస్టమ్ అంటారు. డ్రైవ్‌ట్రాన్ మూడు రకాల విభజించారు. అవి, ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD),రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ డ్రైవ్ (4X4/4WD/AWD). ఇక్కడ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనగా - ఇంజన్ పవర్ ముందు చక్రాలకు అందుతుంది, అదే విధంగా రియర్ వీల్ డ్రైవ్ అనగా- ఇంజన్ పవర్ వెనుక చక్రాలకు చేరుతుంది కాబట్టి వెనుక చక్రాలు వెహికల్ మొత్తాన్ని ముందుకు నెడుతాయి. ఆల్ వీడ్ డ్రైవ్ అనగా - ఇంజన్ పవర్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#8. సస్పెన్షన్

వెహికల్‌లోని ప్రతి చక్రానికి దగ్గరలో యాక్సిల్ మరియు బాడీని అనుసంధానం చేస్తూ, స్ప్రింగ్స్ మరియు షాక్ ఆబ్జార్వర్లను అందిస్తారు ఈ మొత్తాన్ని సస్పెన్షన్ సిస్టమ్ అంటారు . అతుకులు, గతుకులు నుండి వెహికల్‌కు వచ్చే కుదుపులు వెహికల్ బాడీని చేరకుండా సస్పెన్ సిస్టమ్ గ్రహిస్తుంది. కాబట్టి బెటర్ సస్పెన్షన్ వ్యవస్థ ఉంటే మంచి కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#9. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి - ఉదాహరణకు: 35-లీటర్లు

ప్రతి బైకు మరియు కారులో గరిష్టంగా ఎంత ఇంధనాన్ని నింపగలమో దానిని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి అంటారు. ఇందులో రిజర్వ్ మరియు ఫుల్ ట్యాంక్ కెపాసిటి ఉంటుంది. ఫ్యూయల్ రిజర్వులో ఉందంటే, వెహికల్ కనీసం దూరం మాత్రమే ప్రయాణిస్తుంది. అత్యాధునిక ఫీచర్లు రావడంతో ట్యాంకులో ఉన్న ఇంధనంతో మనం గరిష్టంగా ఎంత దూరం ప్రయాణించవచ్చో లెక్కగట్టి సమాచారాన్ని ఇచ్చేస్తున్నాయి.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#10. వీల్‌బేస్ (Wheelbase)

ముందు వైపు ఉన్న రెండు చక్రాలను కలిగే రాడ్‌ను యాక్సిల్ అంటారు. అదే విధంగా వెనుక వైపు ఉన్న రెండు చక్రాలను కలపే రాడ్‌ను రియర్ యాక్సిల్ అంటారు. ఫ్రంట్ వీల్ కేంద్ర బిందువు నుండి రియర్ వీల్ కేంద్ర బిందువు మధ్య ఉన్న దూరాన్ని వీల్‌బేస్ అంటారు. వీల్ బేస్ ఎక్కువగా ఉండటంతో వెహికల్ పొడవు ఎక్కువగా ఉంటుంది. వీల్‌బేస్‌ను మిల్లీమీటర్ల(mm)లో కొలుస్తారు.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#11. ట్రాక్ విడ్త్ (track width)

ఒకే యాక్సిల్ మీద ఉన్న రెండు చక్రాల మధ్య బిందువు మధ్య ఉన్న దూరాన్ని ట్రాక్ విడ్త్ అంటారు. పైనున్న ఫోటో ద్వారా ట్రాక్ విడ్త్ మరియు వీల్ బేస్ లను గమనించవచ్చు. ట్రాక్ విడ్త్‌ను కూడా మిల్లీమీటర్లలోనే కొలుస్తారు. ట్రాక్ విడ్త్ పెరిగితే వెహికల్ వెడల్పు అధికమవుతుంది.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#12. టర్నింగ్ రేడియస్ (Turning radius)

U-టర్న్ తీసుకుంటున్నపుడు రోడ్డు మీద కారు తీసుకునే వ్యాసార్ధాన్ని టర్నింగ్ రేడియస్ అంటారు. టర్నింగ్ రేడియస్‌ను మీటర్లలో లెక్కిస్తారు. చిన్న కార్లకు టర్నింగ్ రేడియస్ 5 మీటర్లుగా ఉంటుంది.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#13. కెర్బ్ వెయిట్ (Kerb weight)

ప్రయాణికులు మరియు ఎలాంటి అదనపు వస్తువులు లేనపుడు లెక్కించే కారు బరువును కెర్బ్ వెయిట్ అటారు. కెర్బ్ వెయిట్‌ను కిలోలలో లెక్కిస్తారు. ఇండియాలో చిన్న కార్ల కెర్బ్ వెయిట్ 1000కిలోల వరకు ఉంటుంది. పెద్ద పరిమాణంలో ఉన్న లగ్జరీ కార్ల బరువు భారీగా ఉంటుంది.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

#14. ఎయిర్‌బ్యాగులు

ప్రమాదం జరిగిన తరువాత ఎయిర్ బ్యాగులు విచ్చుకుని గాలిని నింపుకుంటాయి. ప్రమాదంలో తలం ముందుకు గుద్దుకున్నపుడు ప్రమాద తీవ్రత తల మీద పడకుండా ఎయిర్ బ్యాగులు రక్షిస్తాయి. ఇప్పుడు ముందు సీట్లలో ఉన్న వారికి మాత్రమే కాకుండా కారులో ప్రయాణించే అందరి కోసం ఎయిర్ బ్యాగులను కార్ల తయారీ సంస్థలు తమ కార్లలో అందిస్తున్నాయి.

కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌లోని బేసిక్ పదాలు

15. ABS మరియు EBD

ఏబిఎస్(ABS) అనగా - యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేకులను హార్డ్‌గా ప్రెస్ చేసినపుడు వీల్ లాక్ లేదంటే చక్రాలు స్కిడ్ అవడం జరగుతుంది. ఏబిఎస్ ఉండటం ద్వారా వీల్ లాక్‌ను నివారించవచ్చు. ABS పనిచేస్తున్నపుడు బ్రేక్ పెడల్ వైబ్రేట్ అవడాన్ని మీరు గమనించవచ్చు.

ఇబిడి(EBD) అనగా- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్‌లు ప్రెస్ చేసినపుడు రోడ్డు కండీషన్, ట్రాక్షన్ మరియు ఇతర పరిస్థిలను బట్టి ప్రతి చక్రానికి ఎంత మేరకు బ్రేక్ పవర్ అవసరం ఉంటుందో, అంతే బ్రేక్ పవర్‌ను సరఫరా చేయడానికి EBD సహకరిస్తుంది.

English summary
Read In Telugu: Common Car Specifications Explained: A Guide To Car Facts & Figures
Story first published: Thursday, July 6, 2017, 19:20 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark