మేడిన్ ఇండియా షెవర్లే బీట్ సెడాన్ కార్ల ఎగుమతులు షురూ!

Written By:

మార్కెట్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అనంతరం షెవర్లే, మహాష్ట్రలోని తాలేగావ్ ప్రొడక్షన ప్లాంటులో యధావిథిగా కార్లను ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. జనరల్ మోటార్స్ బీట్ సెడాన్ కారును దేశీయంగా తయారు చేసి లాటిన్ అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తోంది.

బీట్ సెడాన్ కార్ల ఎగుమతులు ప్రారంభించిన షెవర్లే

తాలేగావ్ ప్రొడక్షన్ ప్లాంటులో బీట్ సెడాన్ కార్లను జూన్ 5, 2017 నుండి ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఇప్పుడు 1,200 కార్లను లాటిన్ అమెరికాకు ఎగుమతి చేయడానికి అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ సర్వం సిద్దం చేసుకుంది.

బీట్ సెడాన్ కార్ల ఎగుమతులు ప్రారంభించిన షెవర్లే

జనరల్ మోటార్స్ ప్రకారం, మే 2017 లో భారత దేశపు ప్యాసింజర్ కార్లను ఎగుమతి చేస్తున్న మూడవ అతి పెద్ద సంస్థగా జనరల్ మోటార్స్ ఇండియా నిలిచింది. అందుకు మహారాష్ట్రలోని తాలేగావ్ ప్లాంటు అత్యంత అనువుగా ఉండటంతో పాటు, ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయి.

బీట్ సెడాన్ కార్ల ఎగుమతులు ప్రారంభించిన షెవర్లే

జనరల్ మోటార్స్ షెవర్లే బ్రాండ్ పేరుతో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తొలిసారి బీట్ సెడాన్ కారును ఎసెన్షియా పేరుతో ఆవిష్కరించింది. నిజానికి ఇది షెవర్లే ఎసెన్షియా పేరుతో అమ్ముడుపోవాల్సి ఉంది. కానీ, దేశీయంగా కార్యకలాపాలను నిలిపివేయడంతో బీట్ సెడాన్ ప్రియులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది.

బీట్ సెడాన్ కార్ల ఎగుమతులు ప్రారంభించిన షెవర్లే

ప్రపంచ విపణిలో పట్టును పెంచుకునేందుకు తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇండియాలో ఉన్న ప్రొడక్షన్ ప్లాంటులో తయారీని యధావిథిగా కొనసాగించి, ఇక్కడ తయారయ్యే కార్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయాలని తీసుకున్న నిర్ణయం తెలిసిందే.

బీట్ సెడాన్ కార్ల ఎగుమతులు ప్రారంభించిన షెవర్లే

బీట్ సెడాన్‌తో పాటు బీట్ హ్యాచ్‌బ్యాక్ కూడా దేశీయంగా తయారయ్యి, విదేశీ మార్కెట్లకు ఎగుమతి అవుతోంది. 2016 నుండి మెక్సికోకు షెవర్లే తమ కార్లను ఇక్కడి నుండే ఎగుమతి చేస్తూ వస్తోంది.

బీట్ సెడాన్ కార్ల ఎగుమతులు ప్రారంభించిన షెవర్లే

ఎగుమతుల గురించి షెవర్లే ఇండియా తయారీ విభాగాధిపతి, ఆసిఫ్ ఖాత్రి మాట్లాడుతూ, " గత ఏడాదితో పోల్చుకుంటే ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి, మరియు మే 2017 నెలలో కార్లను ఎగుమతి చేస్తున్న మూడవ అతి పెద్ద సంస్థగా షెవర్లే నిలిచింది. ఇప్పుడు నెలకు గరిష్టంగా 8,297 యూనిట్లను ఎగుమతి చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు."

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ, తయారీ పరంగా ఉన్న అవకాశాలను జనరల్ మోటార్స్ చక్కగా వినియోగించుకుంటోంది. భవిష్యత్తులో జనరల్ మోటార్స్ ఇండియాలో తయారీని మరింత పెంచి ప్రపంచ దేశాలకు ఎగుమతుల హబ్‌గా మార్చేసుకుంటుంది.

English summary
Read In Telugu GM Begins Exports Of Chevrolet Beat Sedan From India
Story first published: Monday, June 26, 2017, 16:47 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark