స్విఫ్ట్ శకానికి ముగింపు పలికిన మారుతి సుజుకి

Written By:

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి 2018లో కొత్త తరం స్విఫ్ట్ కారును లాంచ్ చేయడానికి సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో పాత తరం స్విఫ్ట్(ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న) కారు ప్రొడక్షన్‌ను శాశ్వతంగా నిలిపివేసింది.

మారుతి సుజుకి స్విఫ్ట్

తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి ప్రొడక్షన్ ప్లాంటులో చివరిగా తయారైన స్విఫ్ట్ కారు ఫోటోలు విడుదలయ్యాయి. డిసెంబర్ 23, 2017 రోజుతో స్విఫ్ట్ ప్రొడక్షన్ పూర్తిగా నిలిచిపోయింది.

Recommended Video - Watch Now!
High Mileage Cars In India - DriveSpark
మారుతి సుజుకి స్విఫ్ట్

ప్లాంటు నుండి చిట్టచివరి స్విఫ్ట్‌గా బయటకొచ్చిన కారు మీద ప్లాంటులోని ప్రొడక్షన్ ఉద్యోగులు కారు బానెట్ మీద "Last Swift:-E07460 Glorious Journey Ends here... For new beginning... Great Car by Great Team Date:-23-Dec-2017 Bye Bye:-Swift." అనే వాక్యాలతో స్విఫ్ట్‌తో తమకు ఉన్న అనుభందాన్ని గుర్తుచేసుకున్నారు.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్ కారును తొలుత 2005లో మార్కెట్లోకి లాంచ్ చేసింది. అనతి కాలంలోనే విపణిలో మంచి సక్సెస్ సాధించిన కార్ల సరసన చేరిపోయింది. 2015 ఏడాదికి 13 లక్షల స్విఫ్ట్ కార్లను మారుతి విక్రయించింది.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి 2015లో 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేసి, ఆ తరువాత 2007లో 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో పరిచయం చేసింది. ఈ రెండు ఇంజన్‌లు మైలేజ్ పరంగా ఎంతో భారతీయ కస్టమర్ల హృదయాలను దోచుకున్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్

అయితే, బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను భారత ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో 2010లో 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 1.2-లీటర్ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది. 2011లో రెండవ తరానికి స్విఫ్ట్ మరియు 2014లో స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‍‌‌ను లాంచ్ చేసింది.

Trending On DriveSpark Telugu:

ఇంజన్ ఆయిల్ మార్చకుండా 80,000 మైళ్లు నడిపాడు...

లక్షద్వీప్ దీవుల్లో మహాద్భుతాన్ని నిర్మిస్తున్న భారత్

భారీ డిస్కౌంట్లు ప్రకటించిన నిస్సాన్: ఈ మూడు రోజులు మాత్రమే!

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి ఇప్పుడు మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను 2018 నుండి అందుబాటులోకి తీసుకొచ్చి, అమ్మకాలకు సిద్దం చేస్తోంది. 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో భారీ మార్పులు చేసి ఎన్నో అధునాతన ఫీచర్లను అందించింది.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి తమ నూతన 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ యొక్క హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసింది. మారుతి లైనప్‌‌లో ఉన్న బాలెనో మరియు న్యూ డిజైర్ కార్లను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద డెవలప్ చేసింది. సెకండ్ జనరేషన్ స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ఈ కొత్త స్విఫ్ట్ తేలికపాటి బరువుతో నిర్మించబడింది.

మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ 2018 స్విఫ్ట్‌లో మారుతి సుజుకి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది. ఇవి, వరుసగా 82బిహెచ్‌పి పవర్ మరియు 74బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానున్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అత్యంత సరసమైన ధర, స్పోర్టివ్ డిజైన్ మరియు ప్రతి కస్టమర్‌ను ఆకట్టుకునే ఫీచర్లతో మారుతి స్విఫ్ట్ కొన్ని సంవత్సరాలు భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా పేరుగాంచింది. ఇప్పుడు, దీని స్థానంలో ఎన్నో మార్పులకు గురైన కొత్త స్విఫ్ట్‌ను 2018లో విపణిలోకి ప్రవేశపెట్టడానికిస మారుతి సిద్దమైంది.

గతంలో మారుతి లాంచ్ చేసిన కొత్త తరం డిజైర్ అందుకున్న సక్సెస్ తరహాలోనే ఈ థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ భారీ విజయాన్ని అందుకోనుంది. తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి....

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Production Of Current-Gen Maruti Swift Ends — New-Gen Swift Coming In 2018
Story first published: Friday, December 29, 2017, 13:10 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark