మహిళా వరల్డ్ కప్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ అజేయమైన ప్రదర్శనకు నిస్సాన్ చిరు కానుక

Written By:

ప్రతిష్టాత్మక ఐసిసి మహిళా ప్రపంచ కప్ 2017లో భారత మహిళల జట్టు అద్బుత ఆట తీరును ప్రదర్శిస్తోంది. గత సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ సేన సారథ్యంలో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది.

భారత జట్టు తరపున బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ సెమీస్‌లో ఆస్ట్రేలియాకు తన బ్యాటింగ్ తీరుతో చుక్కలు చూపించింది. 115 బంతుల్లో 7 సిక్సులు, 20 ఫోర్లతో మొత్తం 171 పరుగులు సాధించింది. ఈ ప్రతిభకు గుర్తుగా నిస్సాన్ డాట్సన్ రెడి-గో స్పోర్ట్ కారును హర్మన్ ప్రీత్ కౌర్‌కు బహుకరించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
Recommended Video
Honda Cliq Review In Telugu - DriveSpark తెలుగు
హర్మన్ ప్రీత్ కౌర్ ఆట తీరుకు డాట్సన్ రెడి-గో బహుకరించిన నిస్సాన్

నిస్సాన్ 2015 లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో ఎనిమిదేళ్లకు స్పాన్సర్‌షిప్ డీల్ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, నిస్సాన్ ఇండియా విభాగం క్రెక్‌ట్‌లో అద్బుత ఆటతీరు ప్రదర్శిస్తున్న హర్మన్ ప్రీక్ కౌర్‌కు రెడి-గో స్పోర్ట్ కారును ప్రధానం చేసింది.

హర్మన్ ప్రీత్ కౌర్ ఆట తీరుకు డాట్సన్ రెడి-గో బహుకరించిన నిస్సాన్

2015లో జరిగిన ఒప్పందం ప్రకారం, 2023 వరకు ఐసిసి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నమెంట్లకు నిస్సాన్ అఫీషియల్ గ్లోబర్‌ స్పాన్సర్‌షిప్‌ చేయనుంది. ప్రస్తుతం ఐసిసి నేతృత్వంలో ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్, ఐసిసి ఛాంపియన్‌షిప్‌ ట్రోఫి, ఐసిసి వరల్డ్ ట్వంటీ20 మరియు అండర్-19 మరియు ఉమెన్స్ క్వాలిఫైయింగ్ క్రికెట్ నిర్వహిస్తుంది.

హర్మన్ ప్రీత్ కౌర్ ఆట తీరుకు డాట్సన్ రెడి-గో బహుకరించిన నిస్సాన్

ఈ ఒప్పందం ద్వారా నిస్సాన్ యొక్క ఇన్నోవేషన్‌ను ఐసిసి ద్వారా ప్రపంచ క్రికెట్ ప్రేమికులతో పంచుకుంటుంది. అంతే కాకుండా ఐసిసితో కుదుర్చుకున్న డీల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మందిని నిస్సాన్ చేరనుంది.

హర్మన్ ప్రీత్ కౌర్ ఆట తీరుకు డాట్సన్ రెడి-గో బహుకరించిన నిస్సాన్

హర్మన్ ప్రీత్ కౌర్‌కు బహుకరించిన రెడి-గో స్పోర్ట్ కారు విషయానికి వస్తే, నిస్సాన్ తమ భాగస్వామి డాట్సన్ గత ఏడాది దీనిని విపణిలోకి విడుదల చేసింది. ఇందులో 800సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 53.2బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

హర్మన్ ప్రీత్ కౌర్ ఆట తీరుకు డాట్సన్ రెడి-గో బహుకరించిన నిస్సాన్

ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ," హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి యువ ప్రతిభావంతులు అద్బుతమైన ఆట తీరును ప్రదర్శించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపాడు."

హర్మన్ ప్రీత్ కౌర్ ఆట తీరుకు డాట్సన్ రెడి-గో బహుకరించిన నిస్సాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వాహన తయారీ సంస్థలు భారత క్రీడాకారుల విజయాలను గుర్తించి వారికి బహుమానాలతో ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం. గతంలో, పివి సింధు, సాక్షి మాలిక్ వంటి క్రీడాకారులకు డాట్సన్ తచమ రెడి-గో స్పోర్ట్ కారును బహుకరించి గౌరవించింది.

English summary
Read In Telugu: Nissan Gifts Datsun redi-Go Sport To Cricketer Harmanpreet Kaur
Story first published: Friday, July 21, 2017, 18:01 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark