టాటా నెక్సాన్ మీద అనధికారికంగా బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు

Written By:

విడుదలకు సిద్దంగా ఉన్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మీద దేశవ్యాప్తంగా టాటా డీలర్లు అనధికారికంగా బుకింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం దేశీయంగా ఉన్న ఎస్‌యూవీ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసే విధంగా సరికొత్త డిజైన్, నూతన ఇంజన్ ఆప్షన్స్ మరియు క్లాస్ లీడింగ్ ఫీచర్లున్న టాటా నెక్సాన్ ఆగష్టులో విడుదల కానుంది.

నెక్సాన్ బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు

దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన డీలర్లు నెక్సాన్ ఎస్‌‌యూవీ మీద అనధికారికంగా బుకింగ్స్ ఆహ్వానిస్తున్నారు. అయితే టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీ మీద ఆగష్టు తొలివారంలో బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

Recommended Video - Watch Now!
Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
నెక్సాన్ బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు

టాటా మోటార్స్ ఇది వరకే నెక్సాన్ లోని ఇంజన్‌లు వెల్లడించింది. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో కోరుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని సాంకేతికంగా నెక్సాన్ 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ రివొట్రాన్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల డీజల్ రివోటార్క్ డీజల్ ఇంజన్ వేరియంట్లో అందిస్తోంది.

నెక్సాన్ బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు

ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‍‌యూవీల కన్నా నెక్సాన్ లోని శక్తివంతమైన ఇంజన్‌లు అధిక పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తాయి. నెక్సాన్ లోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానున్నాయి.

నెక్సాన్ బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు

ఆధారంగా టాటా లైనప్‌లోకి ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా వస్తున్న నాలుగవ మోడల్ నెక్సాన్, టాటా ఇందులో ఐదు ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను అందిస్తోంది. అవి,

  • మల్టీ డ్రైవ్ మోడ్స్(ఎకో, సిటి మరియు స్పోర్ట్ మోడ్‌లలో నెక్సాన్‌ను డ్రైవ్ చేయవచ్చు).
  • ఫ్లోటింగ్ డ్యాష్ టాప్ హెచ్‌డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే.
  • ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే లను సపోర్ట్ చేయగల హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.
  • ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు యుఎస్‌బి కనెక్టివిటి ద్వారా కాలింగ్, మెసేజింగ్, న్యావిగేషన్ మరియు వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లను ఇన్ఫోటైన్‌మెంట్ సస్టమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.
  • లగ్జరీ సెంటర్ కన్సోల్ (డ్రవ్ మోడ్ సెలక్టర్, గేర్ నాబ్ మరియు స్లైడింగ్ డోర్ )
నెక్సాన్ బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు

మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్? ఇందులో ఎలాంటి ఇంజన్‌లు ఉన్నాయి? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి అనే అయోమయంలో ఉన్నారా....? డ్రైవ్‌స్పార్క్ తెలుగు వితారా బ్రిజా, ఎకోస్పోర్ట్ మరియు నెక్సాన్ లను పోల్చుతూ బెస్ట్ ఎస్‌యూవీ ఏది ? అనే కథనాన్ని ప్రచురించింది.

English summary
Read In Telugu: Tata Dealers Accepting Bookings For Tata Nexon Unofficially

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark