ఒక్క సారి ఛార్జింగ్‌తో 346కిమీలు మైలేజ్‌నిచ్చే టెస్లా మోడల్ 3 కారు

Written By:

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఎట్టకేలకు ప్రొడక్షన్ దశకు చేరుకున్న మోడల్ 3 కారును రివీల్ చేశాడు. మస్క్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా జూలై 9, 2017 న మోడల్ 3 కు చెందిన కొన్ని ఫోటోలను ట్వీట్ చేశాడు.

టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు

ఐదు మంది సౌకర్యవంతంగా ప్రయాణించే సౌలభ్యం ఉన్న మోడల్ 3 కారును ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 346కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం ఆరు సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు

టెస్లా వద్ద ఉన్న ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోల్చుకుంటే మోడల్ 3 అత్యంత సరసమైన కారు. అయితే ఈ కారును ఎంచుకోవడానికి కస్టమర్లు మరికొన్ని నెలలు వేచిచూడాల్సిందే. కానీ, తొలి 30 మంది కస్టమర్లకు జూలై 28, 2017 న మోడల్ 3 కారును డెలివరీ ఇవ్వనుంది.

టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు

అమెరికా మార్కెట్లో మోడల్ 3 ధర 35,000 డాలర్లు(రుపాయల్లో దీని విలువ 22.8 లక్షలు)గా ఉంది. అమెరికాలో ఎలక్ట్రిక్ కార్లకు ట్యాక్స్ 27,500 డాలర్లు(17.74 లక్షల రుపాయలు)గా ఉంది. ప్రొడక్షన్ పెంచనున్న టెస్లా ఆగష్టు 2017 నాటికి 100 కార్లను, సెప్టెంబర్ 2017 నాటికి 1500 కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిసింది.

టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోడల్ 3 కారును టెస్లా ఆవిష్కరించింది. అయితే ఇప్పుడు టెస్లాకు ఎదురవుతున్న అతి పెద్ద సవాలు మోడల్ 3 ప్రొడక్షన్. ప్రస్తుతం ఈ కారుకు డిమాండ్ విపరీతంగా ఉంది. కాబట్టి డిమాండ్‌కు తగిన మేర ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.

English summary
Read In Telugu: Elon Musk Finally Reveals Tesla Model 3
Story first published: Tuesday, July 11, 2017, 12:11 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark