అన్ని ఫోర్ వీలర్లకు డిసెంబర్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి: కేంద్రం

Written By:

ఈ ఏడాది డిసెంబర్ 1, 2017 నుండి అన్ని ఫోర్ వీలర్ వాహనాలలో ముందు అద్దం మీద ఫాస్ట్‌ట్యాగ్ పరికరం తప్పనిసరిగా ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూచించింది.

డిసెంబర్ 1 నుండి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

అధికారిక ప్రకటన మేరకు, డిసెంబర్ 1, 2017 నుండి మార్కెట్లోకి విక్రయించే ప్రతి నాలుగు చక్రాల వాహనంలో ఫాస్ట్‌ట్యాగ్ పరికరం తప్పనిసరిగా ఉండాలి. అంటే డిసెంబర్ నుండి కొనుగోలు చేసే ప్రతి వాహనంలో ఫాస్ట్‌ట్యాగ్ ఖచ్చితంగా ఉండాలి. విక్రయదారులు లేదా తయారీ సంస్థలు తమ వాహనాలలో అందించాల్సి ఉంటుంది.

ఫాస్ట్‌ట్యాగ్ అంటే ఏమిటి? దీని ఆవశ్యకత ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది వంటివి ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి....

Recommended Video - Watch Now!
[Telugu] Bajaj Platina Comfortec Launched In India - DriveSpark
డిసెంబర్ 1 నుండి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

టోల్ ప్లాజాల వద్ద వాహనాలను నిలిపి టోల్ ట్యాక్సుల చెల్లింపులు చేస్తున్నాము. ఈ విధానంతో సమయం ఎంతగానో వృధా అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, సమయాన్ని ఆదా చేస్తూ, చెల్లింపులను మరింత వేగంగా సరళతరంగా చేసేందుకు ఫాస్ట్‌ట్యాక్ అనే సంస్థతో చేతులు కలిపి కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.

డిసెంబర్ 1 నుండి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

ఫాస్ట్‌ట్యాగ్ అంటే ఏమిటి?

ఫాస్ట్‌ట్యాగ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ అనే పరిజ్ఞానం కలదు. ఈ పాస్ట్‌ట్యాగ్‌ను వెహికల్ ముందు వైపు అద్దం మీద అమర్చుకోవడంతో టోల్ ప్లాజా గుండా వెళ్లినపుడు ఆటోమేటిక్ అనుసంధానం చేసిన బ్యాక్ ఖాతా నుండి టోల్ ట్యాక్స్ టోల్ ప్లాజా వారికి చేరుతుంది.

డిసెంబర్ 1 నుండి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

ఫాస్ట్‌ట్యాగ్ లేకపోతే ఏమవుతుంది?

ఒక వేళ విండ్‌స్క్రీన్(అద్దం) లేకుండా కేవలం ఛాసిస్ మాత్రమే ఉన్న వాహనాలను కొనుగోలు చేసినట్లయితే, ఆ వాహన యాజమాని ఫాస్ట్‌ట్యాగ్ స్వయంగా కొనుగోలు చేసి వెహికల్‌లో అమర్చుకోవాలని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

డిసెంబర్ 1 నుండి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

ఫాస్ట్‌ట్యాగ్‌ను ట్యాగ్ జారీ చేసే వారి నుండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ ట్యాగును ప్రిపెయిడ్ అకౌంటుతో అనుసంధానం చేసుకుని అందులో తగిన నిల్వలు ఉండేలా చూసుకోవాలి.

Trending On DrivSpark Telugu:

170 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికరమైన విషయాలు

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు

టైటానిక్-2 షిప్ వస్తోంది, టైటానిక్-1 గురించి మరచిపోండి

డిసెంబర్ 1 నుండి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న వాహనాలను టోల్ ప్లాజాల వద్ద ఆపాల్సిన పనిలేదు. యథావిధిగా టోల్ ప్లాజా దాటుకొని వెళ్లిపోవచ్చు. మరి పేమెంట్ ఎలా జరుగుతుందనే కదా మీ అనుమానం. ప్రతి టోల్ ప్లాజా ద్వారా మీ వెహికల్‌లో ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ కోడ్‌ను స్కాన్ చేసే పరికరాలు ఉంటాయి. మీరు టోల్ ప్లాజా దగ్గరికి చేరుకోగానే ఆటోమేటిక్ ట్రాక్షన్ జరిపేస్తాయి.

డిసెంబర్ 1 నుండి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

కాబట్టి మీరు చేయాల్సిందల్లా మొబైల్ ఫోన్‌కు రీచార్జ్ చేయించినట్లు, ఫాస్ట్‌ట్యాగ్ డివైజ్‌కు అనుసంధానం చేసిన ఖాతాలో తగిన డబ్బును జమ చేస్తూ ఉండాలి.

డిసెంబర్ 1 నుండి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

ఫాస్ట్‌ట్యాగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు మరియు హైవేల మీద సుమారుగా 370 టోల్ ప్లాజాల్లో ఉంది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(NETC) ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

డిసెంబర్ 1 నుండి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఈ ఫాస్ట్‌ట్యాగ్ విధానం డిసెంబర్ 1, ఆ తరువాత కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో డిసెంబబర్ 1, 2017 తరువాత ఫోర్ వీలర్లను కొనుగోలు చేసిన వారు టోల్ ప్లాజాల వద్ద ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం ఉండదు.

దేశం మొత్తం మీద సుమారుగా 500 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది.

English summary
Read In Telugu: FASTag Mandatory For Cars In India — Here Are The Details

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark